ETV Bharat / state

చూశారా.. ఇదీ జగన్ మార్క్ మోసం! - Jagan cheating in Funds Release - JAGAN CHEATING IN FUNDS RELEASE

Election Commission on CM Jagan Scams in Release of Funds: జగన్ చేస్తున్న మోసాలను ఈసీ బట్టబయలు చేసింది. ఎలక్షన్ నోటిఫికేషన్​కు ముడు నాలుగు నెలల ముందు బటన్ నొక్కినా నిధులు జమకాలేదు కాని జగన్ అనుబంధ సంస్థలకు మాత్రం వేల కోట్ల రూపాయలు దోచిపెట్టినట్లు ఎలక్షన్ కమీషన్ తెలిపింది.

ec_on_cm_jagan
ec_on_cm_jagan (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 3:18 PM IST

Election Commission on CM Jagan Scams in Release of Funds: మోసాలందు జగన్​ మోసాలు వేరయా అన్నట్లుగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో చివరిగా మార్చ్​ 14న బటన్ నొక్కినా డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు పడలేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఏప్రిల్​ 18న అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి నెల రోజుల పైనే అయ్యింది బటన్ నొక్కి కాని లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ కాలేదు. సాయి రెడ్డి, చెవిరెడ్డి కంపెనీలకు మాత్రం మార్చ్ ఎండింగ్​లో 13 వేల కోట్ల రూపాయల బిల్లులకు బటన్ నొక్కేసుకున్నారు. ఎన్నికలకు ముందు పందేరాలు చేసి ఓట్లు వేయించుకుందాం అని ప్లాన్ చేసి అది బెడిసికొట్టడంతో చంద్రబాబు ఆపించాడని వైసీపీ నేతలు అబద్దపు ప్రచారం చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో కాదు స్వయానా ఎలక్షన్ కమిషనే. ఈ వైఎస్సార్​సీపీ ప్రభుత్వ మోసాలను బయటపెట్టింది.

చూశారా.. ఇదీ జగన్ మార్క్ మోసం!
చూశారా.. ఇదీ జగన్ మార్క్ మోసం! (ETV Bharat)

పథకాల నిధులు పోలింగ్‌ తర్వాతే - స్పష్టం చేసిన ఈసీ - EC On Schemes Funds Release

ఈసీ ప్రభుత్వానికి మరో లేఖ: నగదు బదిలీ పథకాలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం మరో లేఖ రాసింది. ఇవాళే నగదు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తమ ముందుంచాలని ఆదేశించింది. ఒకరోజే నిధుల బదిలీ అవసరం ఎందుకొచ్చిందో తెలుసుకోవడానికేనని వ్యాఖ్యానించింది.

ఇప్పటివరకు నగదు బదిలీ ఎందుకు చేయలేకపోయారో పోలింగ్‌ తేదీకి ముందు ఎందుకు ఇవ్వాలనుకుంటారో వివరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరణ ఇవ్వాలని ఈసీ తేల్చిచెప్పింది. ఈ ఐదేళ్లలో బటన్‌ నొక్కిన సమయానికి నిధుల బదిలీకి మధ్య వ్యవధిని కోరింది. 'బటన్‌ నొక్కి చాలా వారాలైంది, ఇవాళే నిధులు జమ చేయకపోతే ఏమవుతుంది' అని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ప్రశ్నించింది.

ఎన్నికలు పూర్తయ్యాకే డబ్బులు- రాష్ట్రంలో పథకాలపై ఈసీ నిర్ణయం - EC on schemes funds release in AP

నిధుల జమకు ఏప్రిల్‌, మే నెలలో కోడ్‌ ఇబ్బంది ఉంటుందని ముందే తెలుసు కదా అని సీఈసీ పేర్కొంది. వారాలపాటు ఆపి పోలింగ్‌ ముందురోజే జమ చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది. ఇవాళే జమ చేయాలన్న తేదీ ముందే నిర్ణయమైందా, ఉంటే వాటి పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. మధ్యాహ్నం 3 గంటలలోపు సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించిన ఈసీ నిధుల జమపై హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలివ్వలేదని లేఖలో పేర్కొంది.

ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనేందుకు జగన్ కుట్ర- రూ.4వేల కోట్లు విడుదల చేసినట్లు ఈసీ​ నివేదిక : నీలాయపాలెం - Nilayapalem Vijay Kumar on YCP Scam

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.