ETV Bharat / state

జోరుగా కూటమి నేతల ప్రచారాలు- అధికార పార్టీ నుంచి తెలుగుదేశంలోకి భారీగా చేరికలు - Election Campaign Full Swing in AP

Election Campaign is Full Swing in Andhra Pradesh: ఎన్నికల సమయం దగ్గరపడటంతో రాష్ట్రంలో కూటమి నేతలు ప్రచారాల్లో దూసుకెళ్తున్నారు. గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలో అభ్యర్థులు పర్యటిస్తూ ఇంటింట ప్రచారం చేస్తున్నారు. పలువురు వైసీపీ నేతలు భారీగా టీడీపీలో చేరుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే టీడీపీతోనే సాధ్యమని పలువురు నేతలు అంటున్నారు.

Election Campaign is Full Swing in Andhra Pradesh

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 7:02 AM IST

జోరుగా కూటమి నేతల ప్రచారాలు- అధికార పార్టీ నుంచి తెలుగుదేశంలోకి భారీగా చేరికలు

Election Campaign is Full Swing in Andhra Pradesh: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలో అభ్యర్థులు పర్యటిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శ్రమిస్తున్నారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలలో మమేకమవుతున్నారు. వైసీపీ నేతలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 6వ డివిజన్‌లో తెలుగుదేశం అభ్యర్థి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం నిర్వహించి ముస్లింలతో మమేకమ్యయారు. రాష్ట్రంలో బీసీలకు తెలుగుదేశం పార్టీతోనే గుర్తింపు వచ్చిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అభిప్రాయపడ్డారు.

జగన్​కు శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే: పవన్ కల్యాణ్ - Pawan kalyan Election Campaign

ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలో జయహో బీసీల సదస్సులో ఆయన పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కొనకళ్ల నారాయణ కూటమి విజయానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అమరావతి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఉండవల్లి ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయనతో పాటు ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని పాల్గొన్నారు. జగ్గయ్యపేటలో లంబాడీల ఆత్మీయ సదస్సులో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పాల్గొన్నారు.

రెండు సెంట్ల స్థలంలో ఇళ్లు కట్టి ఇస్తాం- ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఖాతాల్లో వేస్తాం: చంద్రాబాబు

బాపట్ల జిల్లా చీరాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.ఎం కొండయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బల్లికురవ మండలం ముక్తేశ్వరంలో అద్దంకి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ జోరుగా ప్రచారం చేశారు. ఇండియా కూటమి అభ్యర్థులతో కలిసి గుంటూరు జిల్లా మంగళగిరిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కోవూరు నియోజకవర్గాన్ని చేనేతకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.

కోవూరు మండలం లేగుంటపాడులో చేనేత కుటుంబాలతో వారు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ప్రచారంలో జోరు పెంచారు. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు యాదవుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్విహంచారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్‌ జోరుగా ప్రచార జోరు పెంచారు.

జూన్‌ 4న అమరావతి రక్షణ - జగనాసుర వధ : చంద్రబాబు - Chandrababu Election Campaign

సత్యసాయి జిల్లా కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేశారు. మడకశిర కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ బెంగళూరుకి వలస వెళ్లిన ప్రజలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వలసల నిర్మూలనకు కృషి చేస్తానన్నారు. కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటా ప్రచారం చేపట్టారు. నంద్యాలలో వైకాపా నుంచి పలువురు టీడీపీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్​ఏండీ ఫరూక్‌, ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి వారందరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మైదుకూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ దువ్వూరు మండలం గుడిపాడులో సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు.

వైసీపీని గెలిపిస్తే గ్రామాల్లో చెరువులు ఖాళీ అయ్యాయి: వైఎస్ షర్మిల

టీడీపీ అధికారంలోకి రాగానే కొల్లేరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని కైకలూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లేరు లంక గ్రామాల్లో ఆయన పర్యటించారు. చింతలపూడి కూటమి అభ్యర్థి సొంగ రోషన్‌ కుమార్‌ జంగారెడ్డి గూడెంలో ఆర్యవైశ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం పెరిమిడి పంచాయతీలో వెంకటగిరి కూటమి అభ్యర్థి రామకృష్ణ ప్రఛారం చేశారు.

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ప్రచారం నిర్వహించారు. కోనసీమ జిల్లా మండపేటలో టీడీపీ అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావు సమక్షంలో పలువురు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో అధికార పార్టీ నుంచి 70 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. దేచుపాలెం నాయకులూ శ్రీ రాం తాతయ్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని కూకట్ పల్లి ఎన్​కేఎన్​ఆర్​ గార్డెన్స్​లో వైసీపీ నేతలు గురుమూర్తి ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా సూపర్​ సిక్స్​ స్కీమ్స్ ప్రచారంతో దూసుకెళ్తోన్న టీడీపీ - TDP Candidates State Wide Campaigns

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.