ETV Bharat / state

ఈనాడు చదవనిదే రోజు మొదలవ్వదు - క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా రాణించడానికి కీలక పాత్ర పత్రికదే: అభిమాని దుర్గారావు - Big Fan Of Eenadu Paper - BIG FAN OF EENADU PAPER

Eenadu Paper Fan Durgarao Master in Vijayawada: ఆయనకు ఈనాడు అంటే ఎంత ఇష్టమంటే పత్రిక చదవనిదే రోజు గడవదంట. ప్రతీరోజు పత్రిక చదివి ముఖ్యమైన సమాచారం సేకరించడం ఆయనకు ఎంతో ఆసక్తి. ఉపాధ్యాయునిగా ఉద్యోగం సాధించడంలోనూ ఈనాడు పత్రిక తనకు ఎంతో దోహదం చేసిందని విజయవాడకు చెందిన దుర్గారావు మాష్టారు చెబుతున్నారు.

Eenadu Paper Fan Durgarao Master
Eenadu Paper Fan Durgarao Master (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 10, 2024, 8:54 AM IST

Eenadu Paper Fan Durgarao Master in Vijayawada: ఆయనకు ఈనాడు పత్రికంటే ఎనలేని ప్రేమ. ఈనాడు చదవనిదే ఆ రోజు గడవదు. సమగ్రంగా ఏదైనా విషయంపైన అవగాహన కలగాలన్నా ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవాలన్నా ఈనాడు పత్రికే చదవాలని సూచిస్తున్నారాయన. ఆ అభిమానంతోనే 1982 నుంచి ముఖ్య సమాచారం ఉన్న ఈనాడు పత్రికలన్నీ భద్రపరుస్తున్నారు. ఆయన ఆసక్తికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడయ్యింది. ఉపాధ్యాయునిగా ఉద్యోగం సాధించడంలోనూ ఈనాడు పత్రిక తనకు ఎంతో దోహదం చేసిందని చెబుతున్నారు విజయవాడకు చెందిన దుర్గారావు మాష్టారు.

విజయవాడ భవానీపురంలో నివాసం ఉంటున్న పులిపాటి దుర్గారావు అనే ఉపాధ్యాయుడు ఈనాడు పత్రికపై చిన్ననాటి నుంచి ఎంతో ఇష్టం పెంచుకున్నారు. ప్రతీరోజు పత్రిక చదివి ముఖ్యమైన సమాచారం సేకరించడం ఆయనకు ఎంతో ఆసక్తి. ఈనాడు పత్రిక ఆధ్వర్యంలో జరిగే సేవా, చైతన్య కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని మద్దుతుగా నిలిచారు. నిత్యం సమాజంలో ఏమి జరుగుతుందో పరిశీలించడం ఆ ఉపాధ్యాయుడి పని. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని ఈనాడు లేఖలు పేజీలో ప్రచురించడానికి పంపిస్తుంటారు. అలా రాసి పంపించిన సమస్యలు పరిష్కారం అయితే ఎంతో ఆనందంగా ఉంటుందని దుర్గారావు మాష్టారు చెబుతున్నారు.

"ఈనాడు" అక్షర సమరానికి నేటితో 50 ఏళ్లు! - స్పెషల్ ఫొటో గ్యాలరీ మీకోసం - Eenadu 50 Years Celebrations

విజయవాడ నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు దుర్గారావు మాష్టారు. 1982 నుంచి ఈనాడుతో తనకు ఎంతో అనుబంధం ఉందని మాష్టారు చెబుతున్నారు. ఈనాడు పత్రిక ఐదు గంటలకు వచ్చేదని వచ్చిన వెంటనే తాను పత్రిక మొత్తం చదివేవాడినని దీంతో సమయానికి నిద్రలేవడం, చదవడం, క్రమశిక్షణగా మెలగడం సాధ్యమైందని అంటున్నారు. తాను క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా రాణించడానికి ఈనాడు పత్రిక ఎంతో కృషి చేసిందని దుర్గారావు మాష్టారు తెలిపారు

1982లో నుంచి ఈనాడు పత్రిక చదవటం ప్రారంభించాను. ఉదయాన్నే మనల్ని మేల్కొనే సరికి రెడీగా ఉండేది. వేకువజామునే పత్రిక రావడంతో అప్పటి నుంచి ఈనాడు ద్వారానే క్రమశిక్షణ అనేది వచ్చింది. నాకు ఉద్యోగ సమయంలో ఈనాడు సంపాదకీయంలో వచ్చేటువంటి వ్యాసాలు చాలా ఉపయోగపడ్డాయి. -పులిపాటి దుర్గారావు, ఉపాధ్యాయుడు, ఈనాడు అభిమాని

గొప్ప వ్యక్తులు, నాయకులు, వారు మరణించిన వార్తలు, వరదలు, వివిధ రకాల ప్రమాదాల్లో మరణించిన సంఘటనల ఈనాడు పత్రిక కటింగ్‌లన్నీ మాష్టార్‌ వద్ద ఉన్నాయి. రాజకీయంగా రాష్ట్రంలో సంచలనాలు సృష్టించిన పత్రికలన్నీ భద్రపరిచారు. ఎన్టీ రామారావు నాయకత్వంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం, వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టినప్పటి పత్రికలన్నీ భద్రపరిచారు. వీటితో పాటు ఈనాడు ఆదివారం అనుబంధ సంచిక, చతుర, విపుల వంటి మొదటి పత్రికలు ఈయన సంరక్షించారు. ఈతరం, హాయ్ బుజ్జి, సుఖీభవ మొదటి సంచికలనూ భద్రపరిచారు.

Eenadu@50 : అభాగ్యుల పెన్నిధి - దేశమంతటా మానవత్వ పరిమళాలు వెదజల్లిన 'ఈనాడు' - EENADU Golden Jubilee Celebrations

వీటితో పాటు ఈనాడు విజయవాడ సిటీ అనుబంధం మొదటి పత్రిక, వసుంధర మొదటి పేజీ, ఈనాడు సినిమా అనుబంధం మొదటి పేజీ, వారం వారం వేసే అనుబంధాల మొదటి పేజీలు, న్యూస్ టైం మొదటి సంచిక, తెలుగు వెలుగు, బాలభారతం తొలి సంచికలు ఈ మాష్టారు దగ్గర ఉన్నాయి. ఈనాడు అధిపతి, అక్షర యోధుడు రామోజీరావు ఈయనకి వ్యక్తిగతంగా రాసిన ఉత్తరం ఇంకా ఈనాడు పత్రికకు రాసిన లేఖలు, ఈనాడు విజయవాడ అనుబంధానికి రాసిన లేఖలు, వాటి ద్వారా పరిష్కారం అయిన సమస్యలకు సంబంధించిన సమాచారం అంతా ఈయన దాచిపెట్టారు.

తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు, వృత్తిలో నైపుణ్యం, అభిరుచుల గురించి గతంలో ఈనాడు పత్రికలో కథనాలు రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెబుతున్నారీ దుర్గారావు మాష్టారు. తన భర్తకి ఈనాడు పత్తిక చదవనిదే రోజు గడవదని దుర్గారావు భార్య కనకదుర్గ చెబుతున్నారు. తనకు పాత పత్రికలను సేకరించి భద్రపరచడం అంటే ఎంతో ఆసక్తి అని అందుకే ఆయనను ప్రోత్సహిస్తూ ఉంటామని కనకదుర్గ తెలిపారు. ఆయన క్రమ శిక్షణతో ఉండటమే కాకుండా తమ కుటుంబ సభ్యులందరికీ క్రమశిక్షణగా జీవించాలని చెబుతుంటారని చెప్పుకొచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్‌ కాంతులతో వెలుగులు చిమ్ముతున్న ఈనాడు కార్యాలయాలు - Eenadu 50 Years Celebrations

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.