ETV Bharat / state

సమాజ అభివృద్ధికి ఓటు ఎంతో కీలకం - ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి - ఓటు నమోదు చైతన్యంపై అవగాహన సదస్సులు

EENADU-ETV Will Conduct Vote Registration Awareness : ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఓటు నమోదు, చైతన్యంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. సత్యసాయి జిల్లా గోరంట్లలోని బెస్ట్‌ ఇన్నోవేషన్‌ యూనివర్సీటీలో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఓటు హక్కు ద్వారా సమర్ధవంతమైన పాలకులను ఎన్నుకుంటే భావితరాల భవిష్యత్తు బాగుపడుతుందని వక్తలు సూచించారు.

eenadu-etv_will_conduct_vote_registration-awareness

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 7:34 PM IST

ఓటు హక్కు మాత్రమే- కాదు ఓటు వేయడం అందరి బాధ్యత- 'ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు నమోదు అవగాహన సదస్సు'

EENADU-ETV Will Conduct Vote Registration Awareness : ప్రజాస్వామ్య దేశంలో ఓటు ఎంతో కీలకమైనది. దేశ పురోగతికి, సమాజ చైతన్యానికి, నిర్మలమైన వాతావరణానికి సరైన నాయకుడు ఎంతో అవసరం. భవిష్యత్​ తరాల భవితను నిర్ణయించేది దేశాభివృద్ధి, ఆర్థిక పరిస్థితులు నైతిక విలువలు అవన్నీ సక్రమంగా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును సద్వినియోగపరుచుకోవాలి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈనాడు, ఈటీవీ సంకల్పించుకుని పలు ప్రాంతాల్లో ఓటు నమోదు చైతన్యం పేరిట అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది.

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఓటు నమోదు అవగాహన సదస్సులు

EENADU-ETV Vote Registration Awareness Camp : 18 సంవత్సరాతలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని నెల్లూరు నగర నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ మాధవి అన్నారు. నెల్లూరులోని జగన్స్‌ కళాశాలలో ఓటు నమోదు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతపురం జిల్లా పామిడిలోని SR డిగ్రీ కళాశాలలో ఓటు హక్కు, చైతన్యంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఓటు నమోదు, ప్రాముఖ్యతపై కళాశాల సిబ్బంది యువతకు సందేహాలను నివృతి చేశారు. విద్యార్థులు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. ఓటు ప్రాధాన్యతపై విద్యార్థులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ఓటు అవగాహన కార్యక్రమం

Vote Registration Awareness Nellore : ప్రజల చేత, ప్రజల కోసం కృషి చేసే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరులో జరిగిన ఓటు నమోదు అవగాహన సదస్సు పిలుపునిచ్చింది. నగరంలోని జగన్స్ కళాశాలలో ఓటు నమోదు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఓటు హక్కు లేని పలువురు విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా తమ మొబైల్ ఫోన్ లోనే ఓటును నమోదు చేసుకున్నారు. ఓటు ప్రాముఖ్యత తెలుసుకుని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని ఈ కార్యక్రమానికి హాజరైన నగర నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ మాదవి కోరారు. ప్రలోభాలకు గురికాకుండా ఓటు వినియోగించుకుంటేనే ప్రగతి సాధ్యమని, ఇందుకు ఓటే వజ్రాయుధమని జగన్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి - 'ఈనాడు-ఈటీవీ' అవగాహన సదస్సు

Vote Registration Awareness in AP :ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులందరూ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటు హక్కు ద్వారా సమర్థవంతమైన పాలకులను ఎన్నుకుంటే భావితరాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ సహాయ రిజిస్టర్ జయ ప్రకాష్, కెరియర్ అండ్ ప్లేస్మెంట్ ఇంచార్జ్ శర్మ, డీన్ చిదానంద తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సులు

Vote Registration Awareness in Srikakulam : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో సదస్సులో కొత్తూరు తహసీల్దార్ చక్రవర్తి కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారావు మాట్లాడుతూ నేటి సమాజ అభివృద్ధికి ఓటు ఎంతో కీలకమన్నారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.