Kothwalguda Eco Park in Hyderabad : వారం మొత్తం పని చేసి సెలవు రోజు గురించి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తాము. ఆ ఒక్కరోజే బయటకు వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కానీ నగరానికి దూరంగా వెళ్లి పర్యాటక ప్రాంతాలను చూసి రావాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ ఉన్నది ఒక్కరోజు మాత్రమే.. ఈ ఒక్కరోజు గురించి అంతదూరం ప్రయాణం చేయాలా అని ఆలోచించి చాలా మంది వెళ్లకుండా ఇంట్లోనే బోర్ కొట్టిన కాలక్షేపం చేస్తారు. ఇలాంటి వారి కోసం, కార్తిక మాసం కావడంతో విహారయాత్రలు వెళ్లేవారికోసం, నగరంలో నిత్యం ట్రాఫిక్ ధ్వనుల మధ్య ఉండేవారికోసం ప్రకృతి ఒడిలో కాసేపు సేద తీరేందుకు నగరం నడిబొడ్డున హిమాయత్ సాగర్ దరిలో ప్రకృతి ఉద్యానం ముస్తాబవుతోంది. ఇది 85 ఎకరాల విస్తీర్ణంలో ఉంటూ ఇక్కడ ఉండే సౌకర్యాలను చూస్తే వావ్ అనాల్సిందే.
ఐటీ కారిడార్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేసే ఓఆర్ఆర్ను అనుకొని కొత్వాల్‌గూడ ఎకో పార్క్‌కు రెండేళ్ల క్రితమే హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టగా, ఇప్పుడు ఆ పనులు కొలిక్కి వస్తున్నాయి. ఈ ఎకో పార్క్ సుమారు 85 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడి నిర్మాణాలను రూ.300 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. అతిపెద్ద అక్వేరియం, బోర్డు వాక్, ల్యాండ్ స్కేపింగ్, పక్షిశాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ఎకో పార్కు వారాంతాల్లో ప్రకృతి చెంత గడపాలని అనుకునే వారి ఎంతో ఉపశమనం ఇస్తుంది. ఎందుకంటే జూ మినహా మరొకటి నగరంలో లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ కొత్వాల్‌గూడ పార్క్ రావడంతో పాటు హిమాయత్‌సాగర్ జలాశయం ఉండటంతో వేలాది సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఎకో పార్క్ అనేది అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం టూరిజం పరంగా మరింత అభివృద్ధి చెందనుండగా.. పెద్ద టూరిజం స్పాట్‌గా మారనుంది.
పార్కులో అతిపెద్ద పక్షి శాల :
- ఎకో పార్కులో అతిపెద్ద పక్షిశాల ఏర్పాటు
- ఈ అతిపెద్ద పక్షిశాల ఆరు ఎకరాల్లో ఉంది.
- పక్షిశాల సీతాకోక చిలుక ఆకృతిలో నిర్మాణం
- ఇక్కడికి పెరూ, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, అమెరికా, న్యూజిలాండ్స్, జపాన్, చైనా దేశాలకు చెందిన అరుదైన 200-300 రకాల పక్షులను ఇక్కడ ఉంచనున్నారు.
- సముద్ర జీవుల కోసం అతిపెద్ద అక్వేరియం అందుబాటులోకి
- పిక్నిక్ పార్క్
- రిసార్ట్
- అడ్వెంచర్ జోన్
- ఫుడ్‌కోర్టులు
- ఓపెన్ ఎయిర్ థియేటర్
- పర్యాటకులు రాత్రి బస చేసేందుకు పార్కుని ఉన్న అటవీ ప్రాంతంలో కాటేజీలు
- ఉద్యానం చుట్టూ గోడలపై పక్షులు, జంతువుల బొమ్మలు
కజిరంగలో 30ఏనుగుల జలకాలాట- వరదల తగ్గుముఖంతో సందడి- వీడియో చూశారా! - Kaziranga Elephants Video