ETV Bharat / state

"భయ్యా - పిజ్జా విత్ ఎక్స్​ట్రా ఛీజ్" అని ఆర్డర్ వేస్తున్నారా? - అయితే ఇదర్ దేఖో జీ! - Pizza

Eating Pizza Side Effects : ఈ జనరేషన్​లో యూత్​ను.. జంక్ ఫుడ్ తింటున్నారా? అని అడగకూడదు. ఏం తింటున్నారు? ఎంత తింటున్నారు? అని అడగాలి! అవును మరి.. దుస్తుల్లోనే కాదు తినే తిండిలోనూ "ఫ్యాషన్" చూసే కాలమిది! అందుకే.. "వీలైతే బర్గర్.. కుదిరితే పిజ్జా విత్ ఎక్స్​ట్రా ఛీజ్" అంటూ మోడ్రన్​గా ఆర్డర్ వేస్తుంటారు. అయితే.. ఈ ఆర్డర్స్ పెరుగుతున్నకొద్దీ ఆయుష్షు రేఖ తగ్గిపోతూ ఉంటదని హెచ్చరిస్తున్నారు నిపుణులు!

Pizza Side Effects
Eating Pizza Side Effects
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2024, 10:21 AM IST

Eating Pizza Side Effects : ఆకలేస్తే బేకరికి.. బోర్ కొడితే సినిమాకు అని పాడుకునే రోజులివి. అందుకే చాలా మంది చలో క్యాంటిన్ అంటారు. ఇంట్లో రొటీన్ ఫుడ్ బోర్ కొడుతోందంటూ.. పిజ్జాలు, బర్గర్స్ ఆరగిస్తూ, కూల్ డ్రింక్స్ ఆస్వాదిస్తుంటారు. అయితే.. ఎప్పుడో ఒకప్పుడు తింటే పెద్దగా ప్రాబ్లమ్ లేదు. కానీ.. నిత్యం లాగిస్తే మాత్రం శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఊబకాయం..

ఒక సాదా చీజ్ పిజ్జా స్లైస్‌లో దాదాపు 400 కేలరీలు ఉంటాయట. ఇలాంటి స్లైస్​లు రెండు లేదా మూడు తినడం వల్ల మీ ఒంట్లోకి 800 నుండి 1,200 కేలరీలు చేరుతాయి. ఈ పిజ్జా ముక్కలకు ప్రాసెస్ చేసిన టాపింగ్స్‌ యాడ్ చేసినప్పుడు.. ఈ కేలరీల పర్సెంట్ మరింతగా పెరుగుతుంది. వీటికితోడు రెగ్యులర్​గా తీసుకునే ఫుడ్ వల్ల వచ్చే కేలరీలు వీటికి జత అవుతాయి. ఇలా కుప్పలు తెప్పలుగా ఒంట్లో కేలరీలు పెరిగిపోవడం వల్ల బరువు అధికంగా పెరుగుతారని హెచ్చరిస్తున్నారు. ఆ తర్వాత తగ్గించుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. చాలా మందిలో అది సాధ్యం కాకపోవచ్చు.

గుండె జబ్బుల ప్రమాదం..

పిజ్జాలు అతిగా తినడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిజ్జాలోని చీజ్, ఇంకా ప్రాసెస్ చేసిన మీట్ టాపింగ్స్ లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయని చెబుతున్నారు. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం మరింతగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. రెండు, మూడు పీసులే అంటూ నిత్యం తింటే ఆరోగ్యానికి తీవ్రంగా హాని కలుగుతుందని అంటున్నారు.

క్యాన్సర్ వచ్చే ప్రమాదం..

పిజ్జాలు రెగ్యులర్​గా తీసుకోవడం ద్వారా.. గుండె జబ్బులతోపాటు క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుందట. పిజ్జా తయారీలో.. పెప్పరోని, బేకన్, సాసేజ్ వంటి ప్రాసెస్డ్ నాన్ వెజ్ ను పిజ్జాలో టాపింగ్స్‌గా ఉపయోగిస్తారు. ఇవి కంటిన్యూగా తినడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. ఇలాంటి పిజ్జాలు నిత్యం తినడం అంటే.. చక్కటి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పదార్థాలే డేంజర్..

పిజ్జాను ఎప్పుడో ఒకసారి తీసుకోవడం వల్ల పెద్దగా నష్టం లేదని నిపుణులు చెబుతున్నారు. కానీ.. తరచూ తినడం ఇబ్బందులపాల్జేస్తుందని అంటున్నారు. పిజ్జాలోని ప్రాసెస్ చేసిన పదార్థాలే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు. ఇందులో ప్రాసెస్ చేసిన పిండిని ఉపయోగిస్తారు. ఇది మీ జీర్ణక్రియను స్లోడౌన్ చేస్తుంది. ఇందులోని జున్ను కొలెస్ట్రాల్ పెంచుతుంది.

అంతగా తినాలనిపిస్తే..

మీకు అంతగా పిజ్జా తినాలనిపిస్తే.. ఇంట్లో మీరే తయారు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. దీనివల్ల మీరు స్వచ్ఛమైన, క్వాలిటీ ఉన్న ఫుడ్ ఐటమ్స్​ను సెలక్ట్ చేసుకుంటారు. ఛీజ్ కూడా తక్కువగా వేసుకోవచ్చు. ఇంకా.. మైదాకు బదులుగా క్వాలిటీ గోధుమ పిండిని యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా నాణ్యమైన పిజ్జా తింటే ఆరోగ్యానికి ఇబ్బందిలేదుగానీ.. మార్కెట్లో దొరికేవి తింటే ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువని చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.