East Godavari Women Sushmita Won Mrs New York Elite Universe Title : గోదావరి తీరంలో పుట్టిన అమ్మాయి న్యూయార్క్ అందాల వనితగా ఎంపికయ్యారు. తొలిసారిగా పాల్గొన్న పోటీల్లోనే ప్రథమ స్థానంలో నిలిచి అందరి ప్రశంసలందుకున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన సుస్మిత సోమిరెడ్డి మిసెస్ న్యూయార్క్ ఎలైట్ యూనివర్స్-2025 విజేతగా ఎంపికయ్యారు.
సుస్మిత రాజమహేంద్రవరంలోని బాలవిజ్ఞాన మందిర్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. 2007లో గెయిట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసి టాపర్‌గా నిలిచారు. 2011లో వివాహమయ్యాక ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసేవారు. భర్త కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావడంతో ఇద్దరూ ఉద్యోగంలో మరింత ఎదుగుదలకు 2014లో న్యూయార్క్ వెళ్లి అక్కడే స్థిరపడ్డామని చెప్తున్నారీ మిసెస్ న్యూయార్క్ ఎలైట్ యూనివర్స్-2025.
అందాల పోటీల్లో మొదటిసారి : ఎల్‌కేజీలో ఉండగా నాలుగేళ్ల వయసులో తొలిసారిగా ఆనం కళాకేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్వహించిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో మొదటి బహుమతి పొందారు. తర్వాత మరెప్పుడు ఎలాంటి పోటీలకు వెళ్లినా కూడా సరైన గుర్తుంపు రాలేదంటుందీ మహిళ. తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొస్తున్నారు. పాఠశాల, కళాశాలల్లో జరిగే వార్షికోత్సవాలతో పాటు న్యూయార్క్‌లో నేను పని చేసే సంస్థలో ఏడాది కోసారి జరిగే వేడుకలో డ్యాన్స్ చేసేవారు.
భర్త ప్రోత్సాహంతో : గతేడాది ఇక్కడే జరిగిన మిసెస్ భారత్ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైనా అనారోగ్య కారణంతో వెళ్లలేకపోయానని తెలిపారు. భర్త సుధాకర్ ప్రోత్సాహంతో ఈసారి న్యూజెర్సీ వేదికగా జరిగిన ‘మిసెస్ న్యూయార్క్ ఎలైట్ యూనివర్స్-2025 పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. టాలెంట్ రౌండ్, ర్యాంప్ వాక్, నేషనల్ కాస్ట్యూమ్స్ తదితర విభాగాల్లో ప్రతిభ చూపించారు. ప్రశ్నల విభాగంలో గృహహింస, స్త్రీ స్వేచ్ఛ తదితర అంశాలకు బదులిచ్చి తుది పోటీలకు ఎంపికయ్యారు. డిసెంబరు 1న న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన తుది పోటీల్లో విజేతగా కిరీటం అందుకున్నారు.
రాజమహేంద్రవరం ఇంటి కోడలే మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్ రన్నరప్
లక్ష్య సాధనకు పాటుపడాలి : గోదావరి తీరంలో పుట్టిన తను ఉద్యోగరీత్యా న్యూయార్క్‌లో ఉంటూ ఇక్కడ విజేతగా నిలవడం చిన్న విషయం కాదని చెప్పారు. అది ఇప్పటికీ కలగానే అనిపిస్తోందనిపిస్తుంది. మహిళలు లక్ష్యం ఎంచుకుని వాటిని సాధించేందుకు కృషి చేయ్యాలని వివరిస్తున్నారు. కుటుంబ ప్రోత్సాహం ఉండాలంటున్నారు. తన భర్త ఇచ్చిన ప్రోత్సాహంతోనే విజేతగా నిలిచానంటున్నారు. ఇంట్లో ఆరోగ్యకర వాతావరణం ఉంటేనే ఏదైనా సాధించగలమంటున్నారు. వృత్తి, కుటుంబం వేర్వేరుగా చూస్తూ రెండింటికి న్యాయం చేయగలిగితే మహిళలు అనుకున్న రంగంలో రాణించేందుకు అవకాశం ఉంటున్నారు మిసెస్ న్యూయార్క్ ఎలైట్ యూనివర్స్-2025 సుస్మిత సోమిరెడ్డి.
హొయలొలికే నడకతో ముద్దుగుమ్మల ర్యాంప్ వాక్ - విశాఖలో మిస్ అండ్ మిసెస్ ఫ్యాషన్ షో