E Racing Competitions at BVRIT College : చూస్తున్నారుగా ఎత్తుపల్లాలు, గతుకులు, రాళ్లు, బురద, ప్రమాదకర మలుపులు వీటన్నింటినీ లేక్కచేయకుండా రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్న వాహనాల దృశ్యాలు. మరో విషయం ఏంటంటే విద్యార్థులే ఈ విద్యుత్ వాహనాలను(Electric Vehicles) తయారుచేశారు. బజా సేఇండియా- 2024 పేరుతో జరిగిన రేసింగ్ పోటీల్లో 18 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొని సత్తాచాటారు.
మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని బీవీరాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(Institute of Technology) కళాశాలలో 4 రోజుల పాటు ఈ-బజా, సే ఇండియా-2024 పేరుతో జాతీయస్థాయి ఈ-రేసింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 18 రాష్ట్రాల నుంచి 71 విద్యార్థి బృందాలు పాల్గొన్నాయి. అందులో 46 బృందాల విద్యుత్ వాహనాలను మాత్రమే ఈ రేసంగ్ పోటీలకు అనుమతించారు.
Baja se India 2024 E Racing : కళాశాల సమీపంలోని రామచంద్రాపూర్ చెరువులో విద్యుత్ వాహనాల పోటీలు నిర్వహించారు. రేసింగ్ కోసం 2.2 కిలోమీటర్ల పొడవున గతుకులు, బురద, రాళ్లతో కూడిన ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 4 గంటల సమయంలో ట్రాక్ చుట్టూ 30 రౌండ్లు వేసేలా పోటీలు నిర్వహించారు. ఈ రేస్‌లో గెలుపొందిన వారికి 36 విభాగాల్లో బహుమతులు ప్రధానం చేశారు.
ఈ-రేస్ ఒప్పందం ఎందుకు చేసుకున్నారో చెప్పండి - అరవింద్ కుమార్‌కు ప్రభుత్వం షోకాజ్ నోటీసు
పాఠ్యపుస్తకాల్లో చదువుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. స్వయంగా వాహనాలను తయారు చేయడం వల్ల వాటిలోని లోటుపాట్లను తెలుసుకోవడం సులభమవుతుందని అంటున్నారు. దీంతో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఈ-రేసింగ్ తమ ఇన్‌స్టిట్యూట్‌లో జరగడం తమకెంతో సంతోషంగా ఉందని వాలంటీర్లుగా చేస్తున్న బీవీఆర్ఐటీ కళాశాల విద్యార్థుల చెబుతున్నారు.
Students Make E Race Vehicles : ఇక్కడికొచ్చిన విద్యుత్ వాహనాల గురించి పూర్తిస్థాయిలో తెలుసుకున్నామని వివరిస్తున్నారు. మెకానికల్ విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతో సహకరిస్తుందని చెబుతున్నారు. ఈ రేసింగ్(E Racings Competition) పోటీల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి ప్రమాదం లేదనుకున్న తర్వాతే పోటీలకు అనుమతించారు. 6 సంవత్సరాల నుంచి పోటీల్లో పాల్గొంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. గతంలోని తప్పులను సరిదిద్దుకుంటూ ఈసారి విజయం సాధించా మని అంటున్నారు.
మహిళలు తయారు చేసిన వాహనాలు టాప్ త్రీలో నిలవడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. సాధారణంగా రేసింగ్ అంటే స్పోర్ట్స్ కార్లతోనే నిర్వహించే ఈవెంట్. కానీ, విద్యార్థులు తాము సొంతంగా తయారు చేసిన కార్లతో పోటీపడి సత్తాచాటారు. ఈ-రేసింగ్ పోటీల్లో విజయం సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు(Job Opportunity) కల్పిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం ప్రకటించింది. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులు నూతన సాంకేతికతను నేర్చుకోవడంతో పాటు ఉపాధిని పొందుతారని అధ్యాపకులు చెబుతున్నారు.
ఆయన చెప్పారనే ఈ ఫార్ములా రేస్ ఒప్పందం - ఐఏఎస్ అర్వింద్ కుమార్ నివేదిక
ఫార్ములా ఈ రేస్ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం లేదు: భట్టి విక్రమార్క