ETV Bharat / state

రామోజీ ఫిల్మ్​సిటీలో దసరా, దీపావళి కార్నివల్‌ - 46 రోజుల పాటు సంబురాలే సంబురాలు - Carnival In Ramoji Film City - CARNIVAL IN RAMOJI FILM CITY

Carnival In Ramoji Film City : పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్‌సిటీలో దసరా, దీపావళి వేడుకల్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 46 రోజుల పాటు సంబురాలు కొనసాగనున్నాయి. భూతల స్వర్గంగా పేరొందిన ఫిల్మ్‌సిటీ ప్రత్యేక వేడుకలకు చేసిన ముస్తాబుతో మిలమిలా మెరిసిపోతోంది. వెలుగు జిలుగులతో పర్యాటకులకు సరికొత్త అనుభూతుల్ని పంచుతోంది.

Dussehra and Diwali Carnival in Ramoji Film City
Dussehra and Diwali Carnival in Ramoji Film City (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2024, 7:26 AM IST

Updated : Sep 28, 2024, 7:33 AM IST

Dussehra and Diwali Carnival in Ramoji Film City : ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో అంగరంగ వైభవంగా కార్నివాల్‌ పరేడ్ కొనసాగుతోంది. లైవ్‌షోలు, వినోద కార్యక్రమాలతో పర్యాటకులు ఆనంద డోలికల్లో విహరిస్తున్నారు. సరికొత్త మ్యూజికల్‌ గ్లో గార్డెన్‌లో మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ కాంతుల నడుమ కార్నివాల్‌ పరేడ్‌ ఆకర్షణీయంగా జరుగుతోంది. నృత్యకారులు, స్టిల్ట్‌ వాకర్లు, జెగ్లర్ల వినోదాలు మధురానుభూతిని కలిగిస్తున్నాయి. మ్యూజికల్‌ గ్లో గార్డెన్, ఫిల్మీ స్ట్రీట్‌ సహా వివిధ విశేషాలతో నిజమైన సినిమా తరహా వేడుకలను పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు.

ఫిల్మ్‌సిటీకి వచ్చిన సందర్శకులు ప్రత్యక్షంగా వర్చువల్‌ ప్రొడక్షన్‌ సెట్‌, మోషన్‌ క్యాప్చర్, వర్చువల్‌ షూట్‌ను చూసి అబ్బురపడుతున్నారు. కార్నివాల్‌ పరేడ్‌లో హుషారుగా స్టెప్పులు వేసి, ఎంజాయ్‌ చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఉన్న కట్టడాలను చూసి పర్యాటకులు ఆనందిస్తున్నారు. కొందరైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్న చారిత్రక కట్టడాలు ఇక్కడ ఉన్నాయని, విదేశాల్లో ఉండే విధంగా ఇక్కడ స్ట్రీట్స్‌ నిర్మించిన విధానం చాలా అద్భుతంగా ఉందని వివరించారు. సినిమా షూటింగ్ సెట్స్ చాలా బాగున్నాయని తెలిపారు.

"రామోజీ ఫిల్మ్‌సిటీ చూడటానికి చాలా బాగుంది. చాలా మంది చెప్పారు చూడటానికి చాలా బాగుంటుంది అని. అందుకే చూడటానికి వచ్చాం. ఇక్కడి ఫుడ్‌, ప్లేసెస్‌ చాలా బాగున్నాయి. బాహుబలి సెట్‌ సూపర్​గా ఉంది. కొన్ని రాష్ట్రాలకు కూడా వెళ్లే అవసరం లేదు. ఇక్కడ అన్నీ ఉన్నాయి. రాజస్థాన్‌ తరహాలో ఉన్న సెట్టింగ్స్‌ చాలా బాగున్నాయి. అన్ని వసతులు ఉన్నాయి. చాలా శుభ్రంగా మెయింటెన్‌ చేస్తున్నారు." - పర్యాటకులు

పుష్ప క్లైమాక్స్ షూటింగ్- రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ - Pushpa At RFC

రామోజీ ఫిల్మ్‌సిటీ అందాలను వీక్షిస్తూ పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు అడుగడుగునా ఆకట్టుకొనే విశేషాలు, అబ్బురపరిచే కట్టడాలు, అద్భుతమైన కళాఖండాలను చూసిన పర్యాటకుల ఆనందాలకు అవధులు లేవు. నిరంతర సరదాలు, సరికొత్త వినోదాలతో దసరా, దీపావళి ప్రత్యేక వేడుకల్ని రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. మర్చిపోలేని జ్ఞాపకాలు, మధురానుభూతులను దాచుకుని పర్యాటకులు అమితానందానికి గురవుతున్నారు.

చెన్నై ట్రావెల్​ ఫెయిర్​లో రామోజీ ఫిల్మ్​ సిటీ స్టాల్​ సందడి- విజిటర్స్​ ఫిదా!

Festival Celebrations at Ramoji Film City : రామోజీ ఫిల్మ్‌సిటీలో దసరా, దీపావళి పండుగ సంబురాలు.. ఇక సందడే సందడి

Last Updated : Sep 28, 2024, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.