ETV Bharat / state

బల్బులో డ్రగ్స్​ - బెంగళూరు టు హైదరాబాద్​ వయా గుంటూరు - POLICE SEIZE DRUGS

65 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్​ సీజ్‌ - హైదరాబాద్​లో ఫ్రెండ్స్​కు పంపేందుకు యత్నం

police_seize_drugs
police_seize_drugs (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2024, 8:15 PM IST

Updated : Oct 18, 2024, 9:13 PM IST

Drugs Caught in Guntur: బెంగళూరు నుంచి గుంటూరు, హైదరాబాద్‌కు డ్రగ్స్‌ రవాణా చేస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 65 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్​ను సీజ్‌ చేశారు. ఎఈడీ బల్బ్‌లో డ్రగ్స్​ను రవాణా చేస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ పేర్కొన్నారు. బల్బ్​లో డ్రగ్స్​ను రవాణా చేస్తున్నట్లుగా వచ్చిన సమాచారంతో తనిఖీలు చేపట్టి డ్రగ్స్​ను సీజ్‌ చేశామని వివరించారు. డ్రగ్స్​ను సరఫరా చేస్తున్న యూసఫ్‌, డోనాల్డ్‌ (టోనీ)లను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ అన్నారు.

65 గ్రాముల డ్రగ్స్​ విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. వీరికి అవసరమైనంత డ్రగ్స్​ను ఉంచుకుని మిగిలినది హైదరాబాద్‌లోని స్నేహితులకు పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 3 సార్లు డ్రగ్స్​ను తరలించారని ఆ వివరాలను రాబట్టామని తెలిపారు. హైదరాబాద్‌లో ఎవరికి పంపుతున్నారనే వివరాలతో పాటుగా బెంగళూరులో వీరికి సరఫరా చేస్తున్న వారిని పట్టుకునేందుకు కూడా ప్రత్యేక బృందాలను పంపామని అన్నారు. తల్లిదండ్రులు, సమాజంలోని వ్యక్తులు ఇటువంటి డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోరారు.

బల్బులో డ్రగ్స్​ - బెంగళూరు టు హైదరాబాద్​ వయా గుంటూరు (ETV Bharat)

రూ.2వేల కోట్లు విలువైన డ్రగ్స్‌ స్వాధీనం- 10 రోజుల వ్యవధిలో రెండోసారి!

Police Seize 148 kg of Ganja: విశాఖ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయింది. గంజాయి మాఫియా గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు మత్తు పదార్ధాలను తరలిస్తోంది. కారులో రవాణా చేస్తున్న గంజాయిపై సమాచారం అందుకున్న విజయవాడ పోలీసులు నిఘా వేశారు. రామవరప్పాడు రింగ్ రోడ్ వద్ద తనిఖీలు చేసి కారులో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 10 లక్షల రూపాయల విలువ చేసే 148 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

చెన్నైకు చెందిన దినేష్ కుమార్ తన స్నేహితుడు ముత్తుతో కలిసి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి గంజాయిని కొనుగోలు చేశాడని డీసీపీ మహేశ్వరరాజు తెలిపారు. గతంలో మధ్యవర్తి ద్వారా గంజాయిని చెన్నైకి సరఫరా చేసిన దినేష్ డబ్బు అధికంగా వస్తుందని ఆశతో నూతన కారు కొనుగోలు చేసీ మరీ ఈ దందా ప్రారంభించాడని అన్నారు. నిందితునిపై గతంలో పలు కేసులున్నట్లు గుర్తించామని తెలిపారు. బీహార్​లో రూ.75 వేలకు తుపాకీని కొనుగోలు చేశాడని ఈ దందాలో ఎవరైనా ఎదురుతిరిగితే వారిని బెదిరించే వాడని డీసీపీ తెలిపారు.

మత్తు కోరల్లో యువత జీవితం- తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాల్సిందే! - Increasing Drug Use In Nellore

'సంకల్పం'తో మాదకద్రవ్యాల వ్యాప్తికి చెక్ - కళాశాలల్లో వినూత్నంగా అవగాహన కల్పిస్తున్న పోలీసులు - POLICE SANKALPAM PROGRAM ON DRUGS

Last Updated : Oct 18, 2024, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.