Drug Racket Arrest in Bowenpally Hyderabad : హైదరాబాద్ బోయిన్పల్లి పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి రూ.8.5 కోట్లు విలువైన 8.5 కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక కారు 3 సెల్ఫోన్లు సీజ్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : ఆదివారం రాత్రి ముగ్గరు వ్యక్తులు జిన్నారం నుంచి ఎఫిటమైన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు వారు ఏ దారిలో వస్తున్నారు వంటి వివరాలు తెలుసుకుని అక్కడ కాపలా కాశారు. బోయిన్పల్లి పోలీసులను అలర్ట్ చేశారు. సుచిత్ర నుంచి ప్యారడైజ్‌కు వెళ్లే క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న మహేంద్ర గ్జైలో కారును వెంబడించారు. డైరీ ఫార్మ్ రహదారిపై పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు.
కిలో డ్రగ్స్ కోటి రుపాయలు : అనంతరం వాహనాన్ని తనిఖీ చేయగా కారు డిక్కీలో మూడు పింక్ కవర్లను గుర్తించారు. వాటిని తెరిచి చూడగా అందులో ఎఫిటమైన్ అనే డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 8.582 కిలోల మత్తుపదార్థాలను గుర్తించినట్లు చెప్పారు. దీని విలువ రూ.8.50 కోట్లు ఉంటుందన్నారు. డ్రగ్స్‌తో పాటు నిందితుల నుంచి కారు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎఫిటమైన్ డ్రగ్ విలువ కిలో కోటి రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లసు వివరించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన నాగరాజు, కారు డ్రైవర్ వినోద్, మరో పెడ్లర్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు .
డ్రగ్స్ సరఫరా కేసులో గుంటూరుకి చెందిన రావి మస్తాన్ సాయి అరెస్టు - Mastan Sai Arrested in drugs case