Drivers Stole a Lorry Of Apples in Choutuppal : సిమ్లా నుంచి చెన్నైకి ట్రక్కులో యాపిల్స్‌ను తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదం జరిగిందని చెప్పి డ్రైవర్లు వాటిని మాయం చేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఈ నెల 23న చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ కొత్తపేట పండ్ల మార్కెట్‌లో కందగొండ దత్తాత్రేయ పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. ఆయన సిమ్లాలో భువన్‌సింగ్ అనే వ్యక్తి వద్ద ఈ నెల 17న 493 డబ్బాల యాపిల్ పండ్లను కొనుగోలు చేశాడు. వీటి విలువ రూ.15.32 లక్షలు ఉంటుందని సమాచారం. వీటిని చెన్నైలో విక్రయించేందుకు కంటైయినర్ ట్రక్కులో తీసుకున్నారు. రవాణా చేసేందుకు ట్రాన్సుపోర్టు కంపెనీకి రూ.1,32,200 చెల్లించాడు. కంటైనర్‌లో పండ్లను తీసుకొని బయలుదేరిన డ్రైవర్లు, ఈ నెల 23వ తేదీన చౌటుప్పల్ మండలం దండుమల్కాపురానికి చేరుకున్నా రు.
ప్రమాదం జరిగిందని నమ్మించి పారిపోయారు : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై దండుమల్కాపురం వద్ద ప్రమాదం జరిగిందని, లారీ బోల్తా పడటంతో యాపిల్ పండ్లను ఎత్తుకెళ్లారని డ్రైవర్లు భువన్‌సింగ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పండ్ల వ్యాపారితో పాటు భువన్‌సింగ్ వచ్చి చూడగా, కంటైనర్ ట్రక్కుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అక్కడ ఇద్దరు డ్రైవర్లు కూడా కనిపించకుండా పారిపోయారు. వారికి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారి, పండ్ల వ్యాపారి దత్తాత్రేయ డ్రైవర్లు ఇద్దరు కలిసి మాయం చేసి ఉంటారని ఆనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కన్నేస్తాడు - గెటప్ మార్చేస్తాడు - ఆపై కొట్టేస్తాడు - తర్వాత ఎంచక్కా! - Gold theft in hyderabad