Double Murder in Chebrolu of Kakinada District : వేరే వ్యక్తితో సాన్నిహిత్యంగా ఉందనే అనుమానంతో మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి పొలంలో మాటు వేసి ఇద్దరిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన కాకినాడ జిల్లా చేబ్రోలులో చోటు చేసుకుంది. ఈ దాడిలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. క్షణికావేశంలో ఉన్మాదిలా మారిపోయి దాడి చేయటమే కాకుండా ఆ నిందితుడు వీడియో కూడా తీసుకున్నాడు. అంతే కాకుండా గ్రామంలోకి వెళ్లి మరో వృద్ధురాలిపై హత్యాయత్నం చేయగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురంలో జరిగిన ఈ దారుణకాండ అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
సెల్‌ఫోన్ కోసం నానమ్మను హత్య చేసిన మనవడు- మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చేశాడు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేబ్రోలు గ్రామానికి చెందిన పోసిన శ్రీనివాస్ (45), పెండ్యాల లోవమ్మ (39) బుధవారం ఉదయాన్నే బెండ తోట పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. అప్పటికే సమీప నువ్వుల పంటలో అదే గ్రామానికి చెందిన లోకా నాగబాబు మాటు వేసి వారిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. లోవమ్మపై దాడి సమయంలో అతడు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ దాడిలో ఇద్దరూ మృతి చెందారు. ఈ హత్యల అనంతరం గ్రామానికి చేరుకుని లోవమ్మను తన నుంచి వేరు చేస్తుందనే అనుమానంతో లోవమ్మ తల్లి విసరపు రామలక్ష్మిపైనా కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను కాకినాడ జీజీహెచ్ (Government General Hospital)కు తరలించారు.
పాతకక్షలు - అన్న కుమార్తెపై హత్యాయత్నం - తీవ్రగాయాలు
భర్త నుంచి విడిచిపోయిన లోవమ్మ, ఆమె బంధువు లోకా నాగబాబు ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇటీవల శ్రీనివాస్‌తో ఆమె సన్నిహితంగా ఉంటున్నట్లు నాగబాబు అనుమానం పెంచుకోవడంతో మాటు వేసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలంలో ఉన్న మృతదేహలను అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, డీఎస్పీ హనుమంతరావు, సీఐ శ్రీనివాస్ పరిశీలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ జంట హత్యతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కుమార్తె ప్రేమ వ్యవహారం - కొట్టి చంపిన తల్లి
నిందితుడు నాగబాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతడి భార్య వాలంటీరుగా పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు గురైన లోవమ్మ కుమారుడు ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. తల్లి చనిపోయిన విషాదంలోనూ పరీక్షకు హాజరయ్యాడు. స్థానికులు, తోటి విద్యార్థులు అతడికి ధైర్యం చెప్పారు. నిందితుడు నాగబాబు దాడిలో గాయపడిన రామలక్ష్మికి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఫోటోషూట్ అని పిలిచి చంపేశారు - ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన