Donation to CMRF on Floods : విజయవాడ వరద బాధితుల సహాయార్థం పలువురు దాతలు ముందుకొచ్చారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్‌ను కలిసి చెక్కులు అందజేశారు. గుంటూరుకు చెందిన దామచర్ల శ్రీనివాసరావు ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున రూ. 6 లక్షల నూట పదహారు రూపాయలు విరాళమిచ్చారు. అమలాపురం బోనం వెంకట చలమయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ బోనం కనకయ్య 5 లక్షలు, నంద్యాల SVR ఇంజనీరింగ్ కాలేజ్ M.Dదినేశ్ రెడ్డి, కాలేజీ డీన్ సూర్యప్రకాశ్ రెడ్డి 4 లక్షలు, ఎమ్మెల్యే గౌతు శిరీష నేతృత్వంలో పలాస నియోజకవర్గ ప్రజలు 2 లక్షల 90 వేలు విరాళమిచ్చారు.
నవ్యాంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మాన్యూఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ప్రతినిధి జయకుమార్ రెండున్నర లక్షల రూపాయలు, మదనపల్లె గోల్డెన్ వాలీ ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ రమణారెడ్డి 2 లక్షలు, అనంతపురానికి చెందిన సురేశ్ నాయుడు లక్ష అందజేశారు. బీజేపీ మజ్దూర్ విభాగం నాయకుడు నాగేశ్వరరావు 10వేలు అందజేశారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు తమవంతు సాయం అందించిన దాతలకు మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
Donations For Flood Relief : వరద బాధితుల కష్టాలు చూశాక వారికి అండగా ఉండేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు, నడవలేని స్థితిలో ఉన్నవారు వీల్‌చైర్‌లో వచ్చి విరాళాలు అందజేస్తున్న దృష్యాలు దాతృత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే సీఎంఆర్ఎఫ్కు రూ.300 కోట్లు వచ్చాయి. మరో రూ.50-100 కోట్లు వచ్చే అవకాశముందని అంచనాలున్నాయి.
సీఎం సహాయనిధికి రూ. 5 కోట్ల విరాళం అందజేసిన మేఘా
తమ వంతు సాయంగా చాలా మంది తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో స్కూల్ పిల్లలు సైతం వారి పాకెట్ మనీ ఇవ్వడం స్పూర్తిని కలిగించింది. వైఎస్ సునీత చంద్రబాబు నాయుడును కలిసి రూ.10 లక్షలను విరాళంగా అందజేశాారు. వరద విలయంతో కకావికలమైన వారికి విరాళాలు అందిస్తూ సాంత్వన చేకూరుస్తున్నారు దాతలు. తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో సేకరిస్తున్నారు. వివిధ గ్రామాల్లో వసూలు చేసిన విరాళాలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్‌ఛార్జులు తదితరులు పాల్గొంటున్నారు.
వరద బాధితులకు పోలీసుల సాయం-ఒకరోజు వేతనం 12 కోట్ల విరాళం - Huge Donations to CMRF AP