ETV Bharat / state

పెండింగ్‌లో 2.06 లక్షల ధరణి దరఖాస్తులు - వేగం పెంచాలని రెవెన్యూ శాఖకు కమిటీ సూచన - Dharani Pending Applications - DHARANI PENDING APPLICATIONS

Dharani Pending Applications : రాష్ట్రంలో పెండింగ్​ భూ సమస్యలు తగ్గడం లేదు. తాజాగా వివిధ సమస్యలకు సంబంధించి 60 వేల దరఖాస్తులు వచ్చాయి. దీంతో మళ్లీ ధరణి పెండింగ్​ దరఖాస్తుల సంఖ్య 2.06 లక్షలకు చేరింది. ఈ మేరకు వేగం పెంచాలని రెవెన్యూ శాఖకు కమిటీ సూచించగా మరో రెండు మూడు రోజుల్లో మంత్రి పొంగులేటి అధికారులతో భేటీ కానున్నారు.

Dharani Pending Applications in Telangana
Dharani Pending Applications (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 10:02 AM IST

Dharani Pending Applications in Telangana : తెలంగాణలో పెండింగ్‌ భూ సమస్యలు తరగడం లేదు. ధరణిలో అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు రాష్ట్ర సర్కార్​ మార్చిలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తులను జూన్‌ 4లోపు పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పరిష్కార ప్రక్రియలో వేగం తగ్గడంతోపాటు, లోక్‌సభ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో డ్రైవ్‌ను రెవెన్యూ శాఖ నిలిపివేసింది.

దీంతో లక్ష దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయింది. వీటికి పాసు పుస్తకాలు జారీ చేయాల్సి ఉంది. మరో 1.46 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా పార్లమెంట్​ ఎన్నికలు ముగిసి కోడ్‌ తొలగిపోయేలోపు వివిధ సమస్యలకు సంబంధించి ధరణిలో మరో 60 వేల దరఖాస్తులు వచ్చాయి. దీంతో మళ్లీ పెండింగ్‌ దరఖాస్తుల సంఖ్య 2.06 లక్షలకు చేరింది.

గతంలో తిరస్కరణలతోనే : రైతులు 2023 అక్టోబరుకు ముందు ధరణి పోర్టల్‌లో చేసుకున్న దరఖాస్తులను కొన్ని జిల్లాల కలెక్టర్లు ఎడాపెడా తిరస్కరించారు. నెలనెలా దరఖాస్తుల పరిష్కారాలకు సంబంధించి ప్రభుత్వం లక్ష్యం విధించడంతో ఏ చిన్న లోపం కనిపించినా తిప్పి పంపించారు. పలు సమస్యలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి విచారణల్లో జాప్యం జరిగినా దస్త్రాలు అందుబాటులో లేకపోయినా తిరస్కరించారని రైతులు గతంలో పలుమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా చేశారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ అన్ని సమస్యలపై దృష్టి పెడుతుండటంతో రైతులు తిరిగి దరఖాస్తు చేసేందుకు ముందుకు వస్తున్నారు.

అంతేకాకుండా ధరణి కమిటీ కూడా భూ సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి రెవెన్యూ శాఖకు సూచనలు, సలహాలు ఇస్తోంది. పెండింగ్‌ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఇటీవల భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌కు సూచించింది. చాలాకాలం నుంచి భూ సమస్యలు పరిష్కారం కాక ఎదురుచూస్తున్న రైతులు తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ధరణి కమిటీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డితో భేటీ కానుంది. ధరణి కమిటీ చేపట్టిన అధ్యయనం, రెవెన్యూ శాఖ తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి రూపొందించిన నివేదికపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే ధరణి స్థానంలో భూ భారతి - ఇకనైనా సమస్యలు పరిష్కారమయ్యేనా? - BHU BHARATI IN PLACE OF DHARANI

సర్కార్ మారినా అదే తీరు - 'ధరణిలో ఏ పని కావాలన్నా డబ్బులు ముట్టజెప్పాల్సిందే' - DHARANI PORTAL SCAM 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.