DGP Ravi Gupta On Lok Sabha Election Polling : రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుందని కేంద్రాల వద్ద ఐదుగురి కంటే ఎక్కువగా గుమికూడవద్దని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జెండాలు, గుర్తులతో ప్రచారాలు ప్రలోభాలు చేయవద్దని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.93 కోట్ల నగదు, 10 కోట్ల విలువ గల మద్యం రూ.7.86 కోట్ల డ్రగ్స్ సీజ్ చేశామని వివరించారు. అలాగే రూ.68 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.
పోలింగ్ కోసం పటిష్ట బందోబస్తు : రాష్ట్ర వ్యాప్తంగా రూ. 186.14కోట్ల విలువైన సొత్తు పట్టుబడిందని తెలిపారు. ఎక్సైజ్ యాక్టు కింద 8044, ఎన్‌డీపీఎస్ కింద 293 కేసులు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 73,414 వేలమంది సివిల్ పోలీసులు, ఐదువందల మంది రాష్ట్ర స్పెషల్ పోలీసులు, 164 సెంట్రల్ ఫోర్స్, తమిళనాడు 3 ఆర్మీ కంపెనీలు, 7వేల మంది ఇతర రాష్ట్రాల హోంగర్డ్స్ ఎన్నికల విధుల్లో పని చేస్తారని వివరించారు.
పోలింగ్‌కు ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల పోలింగ్ పర్యవేక్షణ కొరకు డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. చివరి ఈవీఎం స్ట్రాంగ్ రూముకు చేరేంతవరకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని డీజీపీ రవిగుప్తా పేర్కొన్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కోసం రాచకొండ కమిషనరేట్‌లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
రాచకొండ కమిషనరేట్‌లో పోలీసుల బందోబస్తు : కమిషనరేట్‌లోని 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షింస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3 వేల396 పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయి. ఇందులో 533 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 188 సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటివరకు 114 కవాతు ప్రదర్శనలు నిర్వహించారు. లైసెన్స్ కలిగి ఉన్న వెయ్యి 114 తుపాకులను పోలీసులు డిపాజిట్ చేసుకున్నారు. రౌడీషీటర్లు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారు, అనుమానితులు మొత్తం 4వేల892 మందిని పోలీసులు బైండోవర్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై 14 కేసులు నమోదు చేశారు.
మైక్‌లు బంద్ - రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల ప్రచారం - lok sabha elections 2024
సాయంత్రం వరకే ఛాన్స్ - నేటి నుంచి 2 రోజులు వైన్స్ బంద్! - Wine Shops Close in Telangana