ETV Bharat / state

సీఎస్‌ జవహర్‌రెడ్డితో డీజీపీ గుప్తా భేటీ - 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ ఓపెన్ - AP DGP met CS Jawahar Reddy - AP DGP MET CS JAWAHAR REDDY

DGP Harish Kumar Gupta met CS Jawahar Reddy: సచివాలయంలో సీఎస్‌ జవహర్‌రెడ్డితో డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పోలింగ్‌ రోజు, తర్వాత హింసపై సిట్ నివేదిక నేపథ్యంలో ఇద్దరూ సమావేశమయ్యారు. ఈసీ నుంచి తదుపరి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం.

AP DGP met CS Jawahar Reddy
AP DGP met CS Jawahar Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 3:39 PM IST

Updated : May 21, 2024, 9:30 PM IST

DGP Harish Kumar Gupta met CS Jawahar Reddy: రాష్ట్రంలో ఎన్నికల రోజు, అనంతరం జరిగిన హింసపై సిట్ నివేదికను ఎలక్షన్ కమిషన్​కు పంపిన వేళ, సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరిష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. సచివాలయంలో ఇద్దరు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సిట్ ప్రాథమిక నివేదికపై ఈసీ నుంచి తదుపరి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం.

DGP Harish Kumar Gupta on Cases: ఎన్నికల ముందు, ఆ తర్వాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పత్రికా ప్రకటనలో తెలిపారు. ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్, మరో ఇద్దరిని బహిష్కరణ చేసేందుకు సిఫార్సు చేశామన్నారు. ఎన్నికల ముందు రోజు నమోదైన కేసుల్లో 1522 మంది నిందితులను గుర్తించినట్లు తెలిపారు. ఎన్నికల రోజు నమోదైన కేసుల్లో 2790 మందిని గుర్తించారు. ఎన్నికల అనంతరం నమోదైన కేసుల్లో 356 మందిని గుర్తించారు. నిందితుల్లో కొందరిని అరెస్ట్ చేశామని, మరికొందరికి 41ఏ నోటీసులిచ్చామని డీజీపీ ప్రకటనలో తెలిపారు.

33 చోట్ల హింసాత్మక ఘటనలు - ఏపీలో ఎన్నికల హింసపై సిట్‌ నివేదిక - డీజీపీకి అందజేత - SIT report to DGP

కాగా పోలింగ్‌ రోజు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్​లో హింసాత్మక ఘటనలకు సంబంధించి వినీత్‌ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని సిట్‌ నివేదికను సమర్పించింది. పల్నాడు జిల్లాలోని మాచర్ల, నరసరావుపేట, గురజాల నియోజకవర్గాల పరిధిలో నమోదైన 22 కేసులు, అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో నమోదైన 7 కేసులు, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో నమోదైన 4 కేసులను సిట్‌ బృందాలు సమీక్షించాయి. ఆయా కేసుల రికార్డుల్ని పరిశీలించాయి.

ఘటనా స్థలాన్ని సందర్శించాయి. దర్యాప్తు అధికారులు, బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించాయి. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన సిట్ అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించి డీజీపీకి అందించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి సిట్ నివేదికను ప్రభుత్వం పంపింది. సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలో తాజాగా సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు.

33 కేసుల్లో 1,370 మంది నిందితులు - అరెస్టు చేసింది 124 మందినే - 150 పేజీల సమగ్ర నివేదికలో సిట్‌ వెల్లడి - SIT Report on Violence in Andhra

Last Updated : May 21, 2024, 9:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.