Pawan kalyan Comments On Swarnandhra Vision 2047 Document : స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి తక్కువలో తక్కువగా దాదాపు రెండున్నర దశాబ్ధాల పాటు రాజకీయ సుస్థిరత ఉండాలన్నారు. కుల, మత, ప్రాంతాల పరంగా కొట్టుకునే రోజులు ఇక పోయాయని తెలిపారు. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితులు ఇక ఉండవని స్పష్టం చేశారు. చంద్రబాబుకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్షుతో పాటు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీల్లో ఉన్న అన్ని స్థాయిల్లో నాయకులు చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి వెళ్లటమే ప్రజలు మనకిచ్చిన ఎన్నికల ఫలితాన్ని సాకారం చేయటమని వ్యాఖ్యానించారు. వేదిక మీద ఉన్న వాళ్లమంతా ఒకే మాట మీద ఉన్నాం, చంద్రబాబు వెన్నంటే ఉన్నామని స్పష్టం చేశారు. అంతా కలిసి ప్రధాని మోదీ లక్ష్యమైనా వికసిత్ భారత్ కలను సాకారం చేస్తామన్నారు. మోదీ ఆకాంక్ష నెరవేరాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయకత్వంలో బలంగా ఉండాలని ఆకాంక్షించారు. అద్భుతమైన 2047 విజన్ సాకార యాత్రలో చంద్రబాబు వెన్నంటే ఉంటా అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ - పోలీసుల అదుపులో మల్లికార్జునరావు
పవన్ కల్యాణ్ హితబోధ : ప్రజలకు, పాలకులకు మధ్య ఉన్నతాధికారులు అనుసంధానకర్తలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. గత ఐయిదేళ్లలో ఒక్క ఉన్నతాధికారైనా గట్టిగా చెప్పుండి ఉంటే ఈనాడు ఇన్ని వారసత్వ సమస్యలు వచ్చి ఉండేవి కాదన్నారు. ఉన్నతాధికారులకు పవన్ కల్యాణ్ హితబోధ చేశారు. ఎంతో అనుభవంతో ముఖ్యమంత్రి రూపొందించిన విజన్ డాక్యుమెంట్ ను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. ఈ విజన్ డాక్యుమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదేనని తెలిపారు. దయచేసి గత ప్రభుత్వంలా భయపడుతూ రాజీ పడొద్దని పవన్‌కల్యాణ్ హితవుపలికారు. ప్రజలు కూడా తమ శక్తిని తెలుసుకుని ఎన్నికల్లో గట్టి తీర్పు చెప్పారని అన్నారు. ప్రజా భాగస్వామ్యంతోనే అధికారులతో గట్టిగా పనిచేయించగలమని అన్నారు. ఎన్నికలప్పుడు కనబరిచిన బాధ్యతను ప్రజలు కొనసాగించాలని పవన్‌కల్యాణ్ ఆకాంక్షించారు.
"పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం" - డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్
ఆయనపై అపార గౌరవం పెరిగింది : తన ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచే జరగాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విజన్ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కోట్లాదిమంది కలల్ని సాకారం చేసే మహాసంకల్పమని తెలిపారు. పార్టీ పెట్టి తాను నలిగిన తర్వాతే చంద్రబాబు విలువేంటో మరింత తెలిసి ఆయనపై అపార గౌరవం పెరిగిందని పవన్ వెల్లడించారు. ప్రతీ ఒక్కరికీ దిక్సూచీ అవసరమన్న పవన్, విజన్ 2020 నాడు తన స్థాయికి అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆయన కోసం కలల కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కలలుకన్న మహానాయకుడని విజన్ 2020ఫలితాలు ద్వారా అర్థమైందన్నారు.
నాడు తాను రాళ్లు రప్పలు చూసిన ప్రాంతంలో చంద్రబాబు కట్టిన సైబర్ సిటీ మహానగరాన్ని చూశారని పవన్ కితాబుఇచ్చారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సైబరాబాద్ రూపకర్త, శిల్పి, చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబేనన్నారు. ఎంతో కష్టపడి కట్టిన ట్విన్ టవర్స్ ను ఉగ్రవాదులు ఒకపూటలోనే కూల్చేశారు, నిర్మాణం విలువ తెలియని గత పాలకులూ ఇదే మాదిరి వ్యవహరించారన్నారు. చంద్రబాబు ఓపికను ఎన్నిసార్లు మెచ్చుకున్నా సరిపోదన్న పవన్, తాము తమ కోసం కలలు కంటే ఆయన ప్రజల కోసం కలలు కంటున్నారని తెలిపారు. అలాంటి అనుభవజ్ఞుడి వద్ద పనిచేయటం ఎంతో గర్వంగా ఉందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు.
స్టెల్లా ఎల్ పనామా నౌకలో 38 వేల టన్నుల బియ్యం - కొనసాగుతున్న తనిఖీలు