ETV Bharat / state

పవన్ ఛాంబర్ సిద్దం - జనసేన మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు - Deputy CM Pawan Kalyan chamber - DEPUTY CM PAWAN KALYAN CHAMBER

AP Deputy CM Pawan Kalyan Chamber: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు, సచివాలయంలో ఇవాళ ఛాంబర్లు కేటాయించారు. రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో, 212వ గదిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. పవన్‌తో పాటు జనసేనకు చెందిన మరో ఇద్దరు మంత్రుల ఛాంబర్లు కూడా అదే అంతస్తులో ఏర్పాట్లు చేస్తున్నారు.

chamber allot to pavan kalyan
AP Deputy CM Pawan Kalyan Chamber (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 17, 2024, 7:28 PM IST

Deputy Chief Minister Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు శాఖలు కేటాయించిన అనంతరం ఆయన తనదైన స్టైల్లో ముందుకు సాగుతున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తనకు కేటాయించిన శాఖలపై పవన్ స్పందించారు. తన మనస్సుకు దగ్గరైన శాఖలను కేటాయించినందుకు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. అయితే, శాఖలు కేటాయించినప్పటికీ, జనసేన మంత్రులకు సంబంధించిన ఛాంబర్ల కేటాయంపులు జరగలేదు. తాజాగా జనసేనకు చెందిన మంత్రులకు ఛాంబర్లు కేటాయిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

వైఎస్సార్సీపీ లెక్కలు తేల్చిన పవన్ ​- ఏపీ రాజకీయాల్లో పెను తుపాన్ - Sensation in AP Politics

సచివాలయం 2వ బ్లాక్ లో జనసేన మంత్రులకు ఛాంబర్లు ( Ministers Chambers ) కేటాయించారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ కోసం రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో 212 రూమ్‌ను అధికారులు ముస్తాబు చేస్తున్నారు. పవన్‌తో పాటు జనసేనకు చెందిన మరో ఇద్దరి మంత్రుల ఛాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పక్కపక్కగా పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్‌లు ఉండనున్నాయి. ఎల్లుండి తన ఛాంబర్‌లో పవన్‌కల్యాణ్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ఈనెల 19న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. జనసేన పార్టీ కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్‌ కల్యాణ్.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తారు. ఈనెల 12న పవన్‌ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన అభిష్టం మేరకు శాఖలు కేటాయించారు.

తన ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా శాఖలు ఉన్నాయని పవన్ కల్యాణ్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో వెలగపూడిలోని సచివాలయంలో డిప్యూటీ సీఎం కోసం ఛాంబర్ సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 19న బాధ్యతలు స్వీకరించనున్నట్టు పవన్ కల్యాణ్‌ ప్రకటించడంతో జనసేన వర్గాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.

ఇప్పటికే తెలుగుదేశం, బీజేపీకి చెందిన మంత్రులకు ఛాంబర్లు కేటాయించగా, మంచి ముహూర్తం చూసుకొని, ఆయా మంత్రులు తమకు కేటాయించిన ఛాంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. అధికారం చేపట్టిన అనంతరం సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు సైతం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం తనదైన మార్క్ పాలనతో ముందుకు సాగుతున్నారు. ఇక పవన్ కల్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఏ విధంగా ముందుకు సాగుతారో అంటూ అటు అభిమానులు, ఇటు కూటమి నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పవన్​కు వదినమ్మ స్పెషల్ గిఫ్ట్​ - ఆ లిమిటెడ్ ఎడిషన్ పెన్ ధర తెలిస్తే షాకే! - Pawan Kalyan Pen

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి హోదా - AP Deputy CM Pawan Kalyan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.