Demand for Hyderabad Haleem : హలీమ్ ఈ పేరు వినగానే అందరి నోళ్లలో నీళ్లూరుతాయంటే అతిశయోక్తి కాదు. ఈ వంటకం ప్రత్యేకతే వేరు మరి. కట్టెల పొయ్యి మీద స్వచ్ఛమైన నెయ్యితో చికెన్, మటన్‌ను బాగా ఉడకబెట్టి చేసే వంటకం ఇది. రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండే ముస్లింలు సాయంత్రం వేళల్లో ప్రార్థనల అనంతరం దీనిని ఆరగిస్తుంటారు. ఒకప్పుడు ముస్లింలు తినే ఈ వంటకం నేడు అందరికీ ప్రీతిపాత్రమైంది. దీనిలో రుచి మాత్రమే కాదు, ప్రోటీన్ కూడా అంతే ఉంటుంది. అందుకే ముస్లింలు రోజంతా ఉపవాసం ఉండటానికి కావాలసిన ప్రోటీన్ దొరుకుతుందని దీనిని ఆరగిస్తుంటారు.
నోరూరించే హైదరాబాదీ హలీమ్ - ఇంటి వద్దే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!
Hyderabadi Haleem : అందుకే హైదరాబాదీ హలీమ్‌కు (Hyderabadi Haleem) జీఐ గుర్తింపు వచ్చి, ప్రత్యేక బ్రాండ్‌గా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో హలీమ్ తయారీలో పేరుగాంచిన పిస్తా హౌజ్ రోజుకు 10,000ల కిలోల హలీమ్‌ను విక్రయిస్తోందని ఆ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలో మాంసం అధికంగా లభిస్తుంది. దీని వల్ల హలీమ్‌కు కావాల్సిన ముడి సామాగ్రి అంతా ఇక్కడే లభిస్తుండటంతో ఎక్కువ శాతం ఇక్కడి నుంచే వేరే దేశాలకు హలీమ్‌ను ఎగుమతి చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పిస్తా హౌస్, రాయదుర్గంలోని ఓల్డ్ సిటీ రెస్టారెంట్, ప్యారడైజ్ రెస్టారెంట్లు ఈ నెలలో వేరే దేశాలకు దీనిని ఎగుమతి చేస్తుంటాయి.
Ramadan Festival 2024 : అయితే కొన్నిసార్లు రవాణా ఆలస్యం కావడంతో దాని రుచి మారడం, పాడవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలా కాకుండా నేరుగా వంట వాళ్లనే అక్కడికి పంపి అక్కడే ఔట్లెట్ ఏర్పాటు చేసి, వాటిని తాజాగా వండి విక్రయిస్తున్నారు. దేశాల్లో హలీమ్ తయారు చేసే షెఫ్‌లకు నెలకు రూ.2 లక్షలకు పైగా వేతనం చెల్లిస్తారు. కేవలం షెఫ్‌లను పంపితే వారికి వచ్చే ఆదాయంలో పది శాతం కమిషన్‌గా ఇస్తారని హోటల్ నిర్వాహకులు అంటున్నారు. అందరికీ ప్రియమైన వంటకమైన హలీమ్ భారతీయులకే కాదు విదేశీయుల మనసులనూ దోచేసుకుంది. దీన్ని రుచి చూడటం కోసం విదేశీయులు సైతం సంవత్సరం మొత్తం వేచిచూడటం విశేషం.
'నాణ్యత విషయంలో మేము చాలా ఫోకస్ చేస్తాం. చుట్టూ మొత్తం క్లీన్‌గా ఉంచుతాం. హలీమ్‌లో మూడు పదార్థాలు ఉంటాయి. 100 శాతం మటన్, చికెన్, నెయ్యి ఉంటుంది. హలీమ్‌ను ఇక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తాం.'- మహమ్మద్ అఖీల్, పిస్తా హౌజ్ ఫుడ్ ప్రొడక్షన్ మేనేజర్
రంజాన్ స్పెషల్ "రైస్ ఖీర్ పుడ్డింగ్" - ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండిలా! - Rice Kheer Pudding Recipe