ETV Bharat / state

విజయవాడలో వరద నీరు తగ్గింది - ఫైరింజన్లతో క్లీన్​: మంత్రి నారాయణ - Decreasing Flood Impact

Decreasing Flood Impact in Vijayawada: విజయవాడలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని మంత్రి నారాయణ తెలిపారు. రేపటికల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు. అలానే ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే మెుదటి విడత వరద నష్టం అంచనా ప్రక్రియ పూర్తి అయ్యిందని కలెక్టర్ సృజనా తెలిపారు.

decreasing_flood_impact
decreasing_flood_impact (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2024, 7:15 PM IST

విజయవాడలో వరద నీరు తగ్గింది - ఫైరింజన్లతో క్లీన్ (ETV Bharat)

Decreasing Flood Impact in Vijayawada: విజయవాడలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని మంత్రి నారాయణ వెల్లడించారు. రేపటికల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు. మరి కొన్ని ఇళ్లల్లో చాలా బురద ఉందని, అన్ని వీధుల్లో ఫైర్ ఇంజిన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నామన్నారు. డ్రైన్​లలో ఉన్న సిల్ట్ తొలగింపు కూడా వేగంగా జరుగుతుందన్నారు. విజయవాడ నగరంలోని కండ్రిక, బోస్ నగర్, జర్నలిస్టు కాలనీలో నారాయణ పర్యటించారు. వరద నీరు ఉన్న ప్రాంతాలతోపాటు శానిటేషన్ జరుగుతున్న చిన్న చిన్న రోడ్లపై స్వయంగా బైక్ నడుపుకుంటూ పర్యటించారు.

జర్నలిస్టు కాలనీలో వరద నీటిని భారీ మోటార్లతో బయటికి పంపింగ్ చేస్తున్న పనులను మంత్రి పరిశీలించారు. వరద నీరు బయటకి వెళ్లేందుకు నున్న రోడ్డు, బై పాస్ రోడ్డు, 100 అడుగుల రోడ్లలో చాలా చోట్ల గండ్లు కొట్టినట్లు తెలిపారు. గండ్లు కొట్టిన చోట తాత్కాలికంగా పైప్ లైన్​లు వేయాలని అధికారులకు సూచించామన్నారు. భవిష్యత్తులో రోడ్లపై నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా కల్వర్టులు నిర్మిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

జగన్‌ ఐదేళ్ల పాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు: కూటమి నేతలు - NDA Leaders Fire on Jagan

వరద నష్ట గణన ప్రక్రియ పూర్తి: ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే మెుదటి విడత వరద నష్టం అంచనా ప్రక్రియ పూర్తి అయ్యిందని కలెక్టర్ సృజనా తెలిపారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, వాంబే కాలనీ ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్యుమరేషన్ ప్రక్రియపై ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానికులను స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో సుమారు 15 బృందాలు నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరద నష్ట గణన ప్రక్రియను పూర్తి చేశారన్నారు. రేపు సాయంత్రంలోపు తుది జాబితాను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

నిత్యావసర సరుకులు పంపిణీీ: కృష్ణా జిల్లాలో వరద బాధితులను ఆదుకున్న తానా ఫౌండేషన్‌ అందరికీ ఆదర్శనీయమని టీడీపీ నేత మండలి వెంకట్రామ్‌ అన్నారు. మోపిదేవి మండలం బొబ్బర్లంకలో 2 వందల కుటుంబాలకు తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల కిట్‌లను అందజేశారు. పది రకాల నిత్యావసర సరుకులు, టవల్స్‌ను పంపిణీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 6 వేల కుటుంబాలను ఆదుకున్న తానా ఛైర్మన్‌ శశింకాంత్‌, సంస్థ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

ఆక్రమణలతో బక్కచిక్కిపోయిన నమిడివంక - బిక్కుబిక్కుమంటున్న ప్రజలు - Heavy Floods In Nadimivanka

నాలుగో రోజూ కొనసాగుతున్న బోట్ల తొలగింపు ప్రక్రియ - సాయంత్రలోగా బయటకు తెస్తామంటున్న అధికారులు - Boat Removal at Prakasam Barrage

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.