Dasara Sharan Navaratri Celebrations at Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహిషాసురమర్దిని దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై రేపు పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. భవానీ దీక్షాధారుల రాకతో ఇంద్రకీలాద్రిపై భక్తులు రద్దీ పెరిగింది. జలవిహారంపై ఇవాళ మధ్యాహ్నంలోగా నిర్ణయం తీసుకోనునున్నారు.
లోకకంటకుడైన మహిషాసురుడిని చంపిన మహోగ్రరూపం ఇది. సకలదేవీ, దేవతల శక్తులన్నీ ఈ దేవీలో మూర్తీభవించి ఉంటాయి. మానవనేత్రంతో చూడ సాధ్యం కాని దివ్యతేజస్సుతో, అనేక ఆయుధాలతో సింహవాహినియై ఈ తల్లి భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తోంది. ఈ తల్లి అనుగ్రహం పొందితే అసాధ్యమనేది ఉండదు. మహిషాసుర సంహారం జరిగిన రోజునే 'మహర్నవమి'గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున చండీ సప్తశతీహోమం చేసిన వారికి శత్రుభయం ఉండదు. అన్నింటా విజయం కలుగుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యై స్వాహా అనే మంత్రాన్ని జపించి, పానకం, వడపప్పు, గారెలు, పులిహోర, పాయసాన్నం నివేదన చేయాలి. సువాసినీ పూజ చేసి, మంగళద్రవ్యాలు, శక్తికొద్దీ నూతన వస్త్రాలు పెట్టాలి.
సరస్వతీదేవి రూపంలో అమ్మవారు - రాష్ట్రవ్యాప్తంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి : ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ దంపతులు దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, వరదల వంటి విపత్తుల సమయంలో అధికారులు బాగా పని చేశారని కొనియాడారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. దుర్గమ్మ అనుగ్రహంతో సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆశిస్తున్నానని తెలిపారు.
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ : నీతిఆయోగ్ ప్రతినిధుల బృందం దుర్గమ్మను దర్శించుకున్నారు. విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
మహిషాసురమర్దినిగా కనకదుర్గమ్మ- నైవేద్యమేంటి పెట్టాలి? ఏ పువ్వులతో పూజించాలి?
వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు - ఆలయాలకు క్యూ కట్టిన భక్తులు