ETV Bharat / state

పెట్టుబడి పెట్టి మోసపోయారా? - పలు కేసుల్లో నిందితులు మీరే కావొచ్చు! - అసలు విషయం తెలిస్తే షాకే - CYBER CRIMES IN VIJAYAWADA

పెట్టుబడుల పేరుతో మోసాలు - కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సైబర్​ నేరగాళ్లు

cyber_crimes_in_vijayawada
cyber_crimes_in_vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 15 hours ago

Cyber Crimes In Vijayawada : విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక వైద్యురాలు రూ.3లక్షలు పెట్టుబడులు పెట్టారు. ఆమెకు రూ.4లక్షల వరకు వచ్చాయి. మరో రూ.1.75లక్షలు రావాల్సి ఉంది. ఈ లోగా హరియాణా పోలీసులు ఆమె ఖాతాను ఫ్రీజ్‌ చేశారు. కారణం ఆమె పెట్టుబడులు పెట్టి ఎక్కువ మొత్తంలో లాభాలు కొంత మంది నుంచి పొందారు. మోసపోయిన వారు కేసు పెట్టారు. హరియాణా పోలీసుల దర్యాప్తులో నగదు విజయవాడ వైద్యురాలి ఖాతాకు వచ్చాయని తేలింది. ఆమెను నిందితురాలిగా చేరుస్తూ ఖాతాను ఫ్రీజ్‌ చేశారు. ఇప్పుడు ఈ తరహా కేసులు వస్తుండడం విస్మయం కలిగిస్తోంది.

  • నగరానికి చెందిన ఓ వ్యక్తి చిరు ఉద్యోగి. టెలిగ్రామ్‌లో వచ్చిన మెసేజ్‌ చూసి ఒక సంస్థలో రూ.1000 పెట్టుబడులు పెట్టారు. అతనికి రూ.3000 ఆదాయం వచ్చింది. తర్వాత మరో రూ.5వేలు పెడితే రూ.20 వేల ఆదాయం వచ్చింది. తర్వాత రూ.10లక్షలు పెట్టుబడులు పెడితే పైసా తిరిగి రాలేదు.
  • ‘పెట్టుబడులు పెట్టండి ఆకర్షణీయమైన ఆదాయం పొందండి’ అనే ప్రకటనను ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వాట్సాప్‌లో చూశారు. రూ.100 పంపిస్తే రూ.1000 వచ్చింది. మరోసారి రూ.3వేలు పంపించగా రూ.10వేలు ఆదాయం వచ్చింది. విడతల వారీగా రూ.5 లక్షలు పంపితే నిలువునా మోసపోయారు.

ఈ రెండు కేసుల్లోని వ్యక్తులు బాధితులే. రూ.లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నారు. కానీ సైబర్‌ క్రైం పోలీసుల విచారణలో వీరిద్దరూ నిందితులని తేలింది. అదేంటి డబ్బులు పోగొట్టుకుంటే నిందితులు ఎలా అవుతారని అనుకుంటున్నారా? సైబర్‌ నేరగాళ్లు వినూత్నంగా వీరిద్దరిని నిందితులుగా మార్చేశారు. సైబర్‌ నేరగాళ్లు పెట్టుబడులు పెట్టించిన ఇద్దరితోనూ ఒకరికి తెలియకుండా మరొకరికి వాళ్లతోనే డబ్బులు పంపించేలా చేశారు. పెద్ద మొత్తంలో పెట్టిన పెట్టుబడులను మాత్రం నేరగాళ్ల ఖాతాలకు మళ్లించుకున్నారు.

బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే దర్యాప్తులో చిరుద్యోగి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల ఖాతాలకు డబ్బులు వెళ్లాయని తేలుతుంది. వారి ఖాతాలను బ్యాంకర్లు సీజ్‌ చేస్తారు. మోసాలకు పాల్పడ్డారని వారిద్దరిపైనే కేసులు నమోదు చేస్తారు. తాము ఆదాయం వస్తుందన్న ఆశతో పెట్టుబడులు పెట్టామని చెప్పినా ఉపయోగం ఉండదు.

"ఆ స్టాక్​లో కళ్లు చెదిరే లాభాలు" - ఏడు బ్యాంకు ఖాతాలకు రూ.1.21 కోట్లు - ఏమైందంటే!

మీపైనే నేరం మోపుతారు : రూ.100 పెట్టుబడులు పెడితే రూ.1000 ఆదాయం వస్తుందంటే నమొద్దంటున్నారు పోలీసులు. సామాజిక మాధ్యమాల వేదికపై పెట్టుబడులు పెట్టమని కోరితే అది కచ్చితంగా మోసంగా గుర్తించాలని చెబుతున్నారు. మీరు పెట్టుబడి పెట్టి ఆదాయం పొందితే మొదటి నిందితుడు మీరే అవుతారని హెచ్చరిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు ఇలా ఒకరితో ఒకరికి పెట్టుబడులు పెట్టించి లాభాలు పంపుతూ మోసం చేస్తున్నారని వెల్లడిస్తున్నారు.

ఇవి గుర్తుంచుకోండి

  • సామాజిక మాధ్యమాల వేదికగా వచ్చిన ప్రకటనలు చూసి పెట్టుబడులు పెడితే మోసపోతారు. నిందితులవుతారు.
  • పెట్టుబడుల ప్రకటనలు 100 శాతం మోసమే.
  • చిన్న పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో ఆదాయం అంటే అది సైబర్‌ నేరగాళ్ల ఎత్తుగడే.
  • వాట్సాప్, టెలిగ్రామ్‌ల ద్వారా పెట్టుబడులకూ దూరంగా ఉంటే మంచిది.
  • దేనిలోనైనా పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఆశ చూపారు, యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించారు- కోటి రూపాయలు కొట్టేశారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.