ETV Bharat / state

ఆదుకోండి మహాప్రభు - సాయం కోసం రైతుల ఎదురుచూపులు - Crops Damaged By Heavy Rains - CROPS DAMAGED BY HEAVY RAINS

Crops Damaged By Heavy Rains And Krishna River Floods : భారీ వర్షాలు, కృష్ణానది వరదలతో పంట కోల్పోయిన రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా లంక గ్రామాల్లో అయితే ఒక్క పంటా మిగలకుండా తుడిచిపెట్టుకుపోయింది. అందుకే పరిహారం విషయంలో ఉదారంగా వ్యవహరించాలని కొత్తగా బ్యాంకు రుణాలు ఇప్పించాలని కోరుతున్నారు.

CROPS DAMAGED BY HEAVY RAINS
CROPS DAMAGED BY HEAVY RAINS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 7:59 AM IST

Updated : Sep 17, 2024, 8:32 AM IST

Crops Damaged By Heavy Rains And Krishna River Floods in AP : వరి, పత్తి, అరటి, కంద, పసుపు ఇలా పంట ఏదైతేనేం ప్రకృతి ప్రకోపానికి బలయ్యాయి. కృష్ణమ్మ వరద ఉద్ధృతికి ఎన్నడూ లేని విధంగా తీర ప్రాంత రైతులు నష్టపోయారు. వరదల సమయంలో పంట పొలాల్లో ఎటు చూసినా నీరు మాత్రమే కనిపించింది. ఇప్పుడు రైతులను ఎవరిని కదిలించినా వారి కంటకన్నీరు ఒలుకుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణానది పరిధిలో 25 లంక గ్రామాలున్నాయి. తుళ్లూరు, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలోని ఈ లంక గ్రామాల్లో పంటలన్నీ కృష్ణమ్మ తన వెంట తీసుకుపోయింది. ఎకరాకు 50 వేల నుంచి లక్ష వరకూ పెట్టుబడులు పెట్టారు. అవన్నీ నీటిపాలవడంతో ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే చేయూత అందించాలని రైతులు కోరుతున్నారు.

వేల హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు : రైతులకు జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు అధికారులు పంట పొలాల్ని పరిశీలించారు. నష్ట వివరాలతో నివేదిక రూపొందించారు. భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇటీవల కేంద్ర బృందం పర్యటించింది. ఏ విధంగా నష్టపోయిందీ కేంద్ర బృందానికి రైతులు వివరించారు. గుంటూరు జిల్లాలో 29,882 హెక్టార్లలో వరి 2,430 హెక్టార్లలో పత్తి, 688.6 హెక్టార్లలో మినుము, ఇతర పంటలు మొత్తం 33,210.6 హెక్టార్లలో పంటలు నీట మునిగి 49,961 మంది రైతులకు నష్టం వాటిల్లింది. 4,058.86 హెక్టార్లలో ఉద్యాన పంటలు, కూరగాయ పంటలు నీటమునగటంతో 6,030 మంది రైతులు నష్టపోయారు.

కనుమరుగవుతున్న ఆ గ్రామం.. - Old Edlanka Submerged to Krishna

సాయం కోసం రైతుల ఎదురుచూపులు : లంక గ్రామాలతో పాటుగా నదీ తీరం వెలుపల ఉన్న ప్రాంతాల్లోనూ వరద ప్రభావం కనిపించింది. ముఖ్యంగా గుంటూరు ఛానల్ వెళ్లే మార్గంలో చాలా చోట్ల గండ్లు పడి పంట పొలాలు మునిగాయి. వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ (Kharif season) ప్రారంభంలో జూన్‌లో వేసిన నాట్లు జులైలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్నాయి. మళ్లీ నాట్లు వేయగా వరద ముంచేసింది. రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతో వరి పూర్తిగా కుళ్లిపోయింది. రైతులు ఎకరాకు రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు కౌలు చెల్లించారు. ఇప్పుడు పంట మొత్తం వరదలో కొట్టుకుపోయింది. ముంపులో ఉన్న పొలాల్లో డిసెంబరు వరకు ఎలాంటి పంటలూ సాగు చేసే పరిస్థితి లేదు. తక్షణమే ఆర్థిక సహాయం అందిస్తే కొంతైనా కోలుకుంటామని రబీలో పంటలు వేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని రైతులు చెబుతున్నారు.

భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి - జలాశయాలకు పోటెత్తుతున్న వరద - HEAVY RAINS IN UTTARANDRA

ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు - పూర్తిస్థాయి నీటిమట్టానికి జలాశయాలు - Heavy Rains in Uttarandra

Last Updated : Sep 17, 2024, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.