ETV Bharat / state

వర్షానికి కూలిన ఇల్లు - 5 ఏళ్గుగా బాత్‌రూమ్‌లోనే నివాసం - Couple Staying In Wash Room

Couple Staying In Wash Room From Past 5 Yrs in Satya Sai District : ఉన్న ఒక ఇల్లు కాస్తా వర్షానికి కూలిపోయింది. కొత్త ఇల్లును నిర్మించుకునే స్తోమత లేదు. అద్దెకు ఇల్లు తీసుకోలేని పరిస్థితి. దీంతో ఉన్న బాత్​రూమ్​లోనే నివాసం ఉంటున్న ఓ కుటుంబ దుర్భర పరిస్థితి ఇది.

COUPLE STAYING IN WASH ROOM
COUPLE STAYING IN WASH ROOM (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2024, 2:01 PM IST

Couple Staying In Wash Room From Past 5 Yrs in Satya Sai District : ఇల్లు కూలిపోయింది. కొత్తది కట్టుకునే స్తోమత లేదు. వేరేచోట అద్దెకు ఉండేంతా డబ్బూ లేదు. దీంతో బాత్‌రూమ్‌నే నివాసంగా మార్చకున్నారు సత్యసాయి జిల్లాలోని ఓ ఫ్యామిలీ. ఇల్లు మంజూరు చేస్తామన్న వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి. ఊరు దాటగానే హామీని గాలికి వదిలేశారు. బాధితులు దుర్భర పరిస్థితి తెలుసుకున్న కూటమి ఎమ్మెల్యే ఎంఎస్​ రాజు ఆర్థిక సాయం చేసి ఇల్లు నిర్మించే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

5 ఏళ్గుగా బాత్‌రూమ్‌లోనే నివాసం :
రెక్కాడితే కానీ డొక్కాడని ఓ కుటుంబం గూడు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం హెచ్​ఆర్​ పాలెంలో నరసింహప్ప, లక్ష్మీదేవి దంపతులు మట్టి మిద్దెలో నివసించేవారు. ఆ ఇల్లు కొన్నేళ్ల క్రితం వర్షానికి కూలిపోయింది. కొత్త ఇంటిని నిర్మించుకునే స్తోమత లేక ఇంటికి అనుసంధానంగా ఉన్న మరుగుదొడ్డిలోనే ఇద్దరు పిల్లలతో సహా జీవనం సాగిస్తున్నారు. సరిగా కూర్చునేందుకు, పడుకునేందుకు కూడా స్థలం లేని బాత్‌రూమ్‌లోనే ఐదేళ్లుగా ఉంటున్నారు. వర్షం వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వ భవనాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు.

వర్షాలకు మా ఇళ్లు కూలిపోయింది. దీంతో మేం బాత్​రూమ్​లో నివాసం ఉంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గడపగడప కార్యక్రమంలో అప్పటి ఎమ్మెల్యే ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడైనా మాకు ఒక ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం- బాధితులు

పెళ్లిచూపుల కోసం మేనత్త ఇంటికి వచ్చాడు - అసలు పని వదిలేసి - Son in Law Robbery at Aunt House

బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గడపగడప కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగిన అప్పటి ఎమ్మెల్యే తిప్పేస్వామి నరసింహప్పకు ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత పట్టించుకోలేదు. బాత్‌రూమ్‌లో ఉండేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నరసింహప్ప దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఎస్​ రాజు నరసింహప్ప నివాసం వద్దకు వెళ్లి పరామర్శించారు. 20 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. కొత్త ఇల్లు నిర్మించుకునే వరకు అద్దె డబ్బు ఇస్తానని బాధితులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

హోంమంత్రి నివాసాన్ని చుట్టుముట్టిన వరద- 'నా కంటే ముందు సామాన్యులకు సాయం చేయండి' - Anita residence under flood

పుట్టినరోజు విందు - సందడి చేసిన రామచిలుకలు

Couple Staying In Wash Room From Past 5 Yrs in Satya Sai District : ఇల్లు కూలిపోయింది. కొత్తది కట్టుకునే స్తోమత లేదు. వేరేచోట అద్దెకు ఉండేంతా డబ్బూ లేదు. దీంతో బాత్‌రూమ్‌నే నివాసంగా మార్చకున్నారు సత్యసాయి జిల్లాలోని ఓ ఫ్యామిలీ. ఇల్లు మంజూరు చేస్తామన్న వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి. ఊరు దాటగానే హామీని గాలికి వదిలేశారు. బాధితులు దుర్భర పరిస్థితి తెలుసుకున్న కూటమి ఎమ్మెల్యే ఎంఎస్​ రాజు ఆర్థిక సాయం చేసి ఇల్లు నిర్మించే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

5 ఏళ్గుగా బాత్‌రూమ్‌లోనే నివాసం : రెక్కాడితే కానీ డొక్కాడని ఓ కుటుంబం గూడు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం హెచ్​ఆర్​ పాలెంలో నరసింహప్ప, లక్ష్మీదేవి దంపతులు మట్టి మిద్దెలో నివసించేవారు. ఆ ఇల్లు కొన్నేళ్ల క్రితం వర్షానికి కూలిపోయింది. కొత్త ఇంటిని నిర్మించుకునే స్తోమత లేక ఇంటికి అనుసంధానంగా ఉన్న మరుగుదొడ్డిలోనే ఇద్దరు పిల్లలతో సహా జీవనం సాగిస్తున్నారు. సరిగా కూర్చునేందుకు, పడుకునేందుకు కూడా స్థలం లేని బాత్‌రూమ్‌లోనే ఐదేళ్లుగా ఉంటున్నారు. వర్షం వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వ భవనాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు.

వర్షాలకు మా ఇళ్లు కూలిపోయింది. దీంతో మేం బాత్​రూమ్​లో నివాసం ఉంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గడపగడప కార్యక్రమంలో అప్పటి ఎమ్మెల్యే ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడైనా మాకు ఒక ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం- బాధితులు

పెళ్లిచూపుల కోసం మేనత్త ఇంటికి వచ్చాడు - అసలు పని వదిలేసి - Son in Law Robbery at Aunt House

బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గడపగడప కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగిన అప్పటి ఎమ్మెల్యే తిప్పేస్వామి నరసింహప్పకు ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత పట్టించుకోలేదు. బాత్‌రూమ్‌లో ఉండేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నరసింహప్ప దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఎస్​ రాజు నరసింహప్ప నివాసం వద్దకు వెళ్లి పరామర్శించారు. 20 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. కొత్త ఇల్లు నిర్మించుకునే వరకు అద్దె డబ్బు ఇస్తానని బాధితులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

హోంమంత్రి నివాసాన్ని చుట్టుముట్టిన వరద- 'నా కంటే ముందు సామాన్యులకు సాయం చేయండి' - Anita residence under flood

పుట్టినరోజు విందు - సందడి చేసిన రామచిలుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.