ETV Bharat / state

విజయవాడలో 'కాస్మో క్రూయిజ్' ప్రదర్శన- రాకెట్ ప్రయోగాలపై విద్యార్థుల్లో అవగాహన - Cosmo Cruise Exhibition - COSMO CRUISE EXHIBITION

Cosmo Cruise Exhibition on KBN College in Vijayawada : కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో కాస్మోక్రూయిజ్ పేరుతో ఇస్రో పంపిన తొలి ఉపగ్రహం నుంచి ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్-3 వరకు వాటి నమూనాలు ప్రదర్శించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్ధులు ఈ ప్రదర్శనకు విచ్చేసి ఉపగ్రహలను ఎలా రూపొందిస్తారు. వాటిని ఎలా ప్రయోగిస్తారనే అంశాలను తెలుసుకున్నారు.

Cosmo Cruise Exhibition
Cosmo Cruise Exhibition (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 2:38 PM IST

Cosmo Cruise Exhibition on KBN College in Vijayawada : విజయవాడ కేబీఎన్​ కళాశాల ప్రాంగణంలో కాస్మో క్రూయిజ్ పేరుతో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఇస్రో పంపిన తొలి ఉపగ్రహం నుంచి ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్ -3 వరకు వాటి నమూనాలు ప్రదర్శించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులు ప్రదర్శనకు విచ్చేశారు. ఉపగ్రహాలు ఎలా రూపొందిస్తారు, వాటిని ఎలా ప్రయోగిస్తారనే అంశాలను విద్యార్థులు తెలుసుకున్నారు. రాకెట్ల నమూనాలను చూసేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున రావడంతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది.

విజయవాడలో ప్లాస్మా ఎగ్జిబిషన్​ - ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తూ ఆకట్టుకున్న విద్యార్థులు - Plasma Exhibition in Vijayawada

రాకెట్ల వినియోగం ఎలా జరిగింది, అలాగే సాంకేతికతను రాకెట్లలోకి ఎలా జోడించారు అనే అంశాలను ఇస్రో అధికారులు విద్యార్ధులకు వివరించారు. ఉపగ్రహ నమూనాలను ప్రత్యేక్షంగా చూడడం, వాటి గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. తాము అనుకున్న లక్ష్యాలను అందుకోవడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని విద్యార్థులు అంటున్నారు.

అవాక్కయ్యో ఆకృతులు - చిట్టి కుండీలో భారీ వృక్షం - అదిరిపోయేలా బోన్సాయ్ వృక్ష ప్రదర్శన

శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం : విద్యార్థులు తమలోని ప్రతిభకు పదును పెడితే శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని ఇస్రో అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలోనే తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఘనత ఇస్రోకి దక్కిందని పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో విద్యార్థులు అద్భుతమైన విజయాలను సాధించడానికి ఈ ప్రదర్శన దోహదపడుతుందని పేర్కొన్నారు.

Bharat Drone Shakti 2023 Exhibition : వాయుసేనలోకి పవర్​ఫుల్ విమానం. ఎమర్జెన్సీ సమయంలో సైనికుల తరలింపు మరింత ఈజీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.