Construction Workers Problems in NTR District : వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితులు దారుణంగా మారాయంటున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇవ్వటం వలన నిర్మాణ రంగం జోరుగా సాగింది. అమరావతి నందిగామకు దగ్గరలో ఉండటం వల్ల భవన నిర్మాణ కార్మికులు దీనిపై ఆధారపడిన ఇతర రంగాల్లోని కార్మికులకు పనులు దొరికేవి. ప్రతిరోజు ఖాళీ లేకుండా పనులకు వెళ్తుండేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉచిత ఇసుక విధానాన్ని ఎత్తేశారు. దాని స్థానంలో ఇసుక విక్రయాలు ప్రారంభించారు. గుత్తేదారులు సంస్థకు ఇసుక విక్రయ బాధ్యతలు అప్పగించారు.
వైఎస్సార్సీపీ సర్కార్ ఇసుక విధానం - భవన నిర్మాణ కార్మికులకు శాపం
No Works for Construction workers : దీనివల్ల ఇసుక భారంగా మారింది. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గంలో మునేరు కృష్ణా నదిలు దగ్గరలోనే ఉన్నప్పటికీ ట్రక్కు ఇసుక కొనుగోలు చేసేందుకు మూడు వేల పైన ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ఎడ్ల బండికి ఒక్కొక్క బండికి 400 తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇసుక కొనుగోలు చేసి నిర్మాణాలు చేయటం భారంగా మారింది. దీంతో చాలామంది ఇల్లు, ఇతర నిర్మాణాలను వాయిదా వేసుకున్నారు. నందిగామ జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు, కంచికచర్ల ప్రాంతాల్లో ఎడ్లబండ్లతో ఇసుక రవాణా చేస్తున్నారు. నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో భవన నిర్మాణ రంగంలో దాదాపు 15 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు.
భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టిన జగన్ సర్కార్ - నాలుగున్నరేళ్లుగా నానావస్థలు
'ఎడ్ల బండితో తోలుతున్న ఇసుక భవన నిర్మాణ కార్మికులకు పనులు చేసేందుకు సరిపోవట్లేదు. దీంతోపాటు ఇసుక కొనుగోలు చేయటం భారంగా మారింది. దీనివలన పనులు దొరకట్లేదు. నందిగామ గాంధీ సెంటర్లోని అడ్డా వద్దకు ప్రతిరోజు 2000 మంది కార్మికులు భవన నిర్మాణ రంగంలో పనులు కోసం వస్తుంటాం. గత నాలుగేళ్లుగా సక్రమంగా పనులు లేకపోవడం వల్ల పలు గ్రామాల నుంచి ఉపాధి కోసం వస్తున్న కార్మికులు తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాల్సి వస్తుంది. ప్రతిరోజు తాపీ మేస్త్రికి 900, కూలీకి ఎనిమిది వందల రూపాయలు కూలి ఇస్తున్నారు.' -భవన నిర్మాణ కార్మికులు
kalyanamasthu కల్యాణమస్తు పథకాన్ని పునరుద్ధరించిన ఏపీ ప్రభుత్వం
Construction workers Fires on YSRCP Govt : తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక నాలుగైదు సార్లు కూలీలు రేట్లు పెరిగాయి. అప్పట్లో నిర్మాణ పనులు యధేచ్ఛగా ఉండటంతో కార్మికులకు డిమాండ్ ఉండేది. కూలి రేట్లు కూడా రెండు మూడు సార్లు పెరిగాయి. ప్రభుత్వం మారాక కార్మికుల పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. కనీసం కూలి పనులు కూడా దొరకని పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు అడ్డా వద్దకు వచ్చి పనులకు పిలిచేవారు లేక వెళ్లిపోతున్నారు. దీనివల్ల కుటుంబ జీవనం కష్టం అవుతుందని అప్పుల చేయాల్సి వస్తుందని కార్మికులు వాపోతున్నారు.
'అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామన్నారు... చివరికి రోడ్డున పడేశారు'