ETV Bharat / state

బీఆర్ఎస్ కౌన్సిలర్​పై కాంగ్రెస్ కార్యకర్త పెట్రోల్ దాడి - దాడిని ఖండించిన హరీశ్​రావు - Petrol Attack On Brs Councillor - PETROL ATTACK ON BRS COUNCILLOR

Congress Leader Petrol Attack On BRS Councillor : మెదక్ జిల్లా రామాయంపేటలో కాంగ్రెస్ కార్యకర్త గణేశ్‌ బీఆర్ఎస్ కౌన్సిలర్ నాగరాజుపై పెట్రోల్ దాడి చేశాడు. ఈ దాడికి భూ తగాదాలు, ఆర్థిక వ్యవహారాలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్‌ నేత హరీశ్​రావు ఎక్స్​ వేదికగా పెట్రో దాడిని ఖండించారు.

Congress Leader Petrol Attack
Congress Leader Petrol Attack On BRS Councillor (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 2:41 PM IST

Updated : May 25, 2024, 4:33 PM IST

Congress Leader Petrol Attack On BRS Councillor : మెదక్ జిల్లా రామాయంపేటలో దారుణం జరిగింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ నాగరాజుపై కాంగ్రెస్ కార్యకర్త గణేశ్‌ పెట్రోల్​ పోసి నిప్పటించే ప్రయత్నం చేశాడు. అడ్డుకోబోయిన అతని అనుచరుడిపై కూడా పెట్రోల్ దాడికి దిగాడు. అది గమనించిన స్థానికులు నిప్పు పెట్టే లోపే అడ్డుకున్నారు. ఈ ఘటనలో నలుగురు బాధితులను ఆసుపత్రికి తరలించారు.

రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాధితుడు నాగరాజు, కాంగ్రెస్ కార్యకర్త పోచమ్మ గణేశ్‌పై ఫిర్యాదు చేశాడు. పెట్రోల్ దాడికి భూ తగాదాలు, ఆర్థిక వ్యవహారాలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Harish Rao React on Congress Leader Attack : మరోవైపు ఈ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్​రావు ఎక్స్​లో ట్వీట్ చేశారు. పెట్రో దాడిని ఖండించిన హరీశ్​రావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నిత్యం బెదిరింపులు, హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని ఆగ్రహించారు. ప్రశ్నించే గొంతుకలైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను బెదిరింపులతో నిలువరించలేవని పేర్కొన్నారు. రామాయంపేట పట్టణ కౌన్సిలర్ నాగరాజుపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. దాడికి కారకులైన వ్యక్తిని గుర్తించి వెంటనే అరెస్ట్‌ చేసి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

RS Praveen Kumar Fires On Congress Attacks : కేసీఆర్ రాష్ట్రంలో నీళ్లు పారిస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి సొంత జిల్లాలో రక్తపుటేరులు పారిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేత ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో రోజురోజుకు శాంతి భద్రతలు దిగజారుతున్నాయన్న ఆయన, ప్రజలు, ప్రత్యేకించి గులాబీ నేతల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి అండతో కాంగ్రెస్ గుండాలు చెలరేగిపోతున్నారని ఆక్షేపించారు.

మంత్రి జూపల్లి ఫ్యాక్షన్, బుల్డోజర్ల సంస్కృతి తెరలేపారని మండిపడ్డారు. కొల్లాపూర్‌ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, ప్రతి హత్య, దాడికి రేవంత్ రెడ్డి, జూపల్లి బాధ్యత వహించాలని కోరారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి గులాబీ నేతలకు రక్షణ కల్పించాలని మాజీ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి కోరారు. కాంగ్రెస్‌ పార్టీకి ఇవే చివరి ఎన్నికలని గువ్వల బాలరాజు వ్యాఖ్యానించారు.

వనపర్తి జిల్లాలో బీఆర్​ఎస్​ నేత దారుణ హత్య - తీవ్రంగా ఖండించిన పార్టీ నేతలు - WANAPARTHY BRS LEADER MURDER

తెలంగాణలో వచ్చిన మార్పు - బీఆర్​ఎస్​ నేతలను హత్య చేయడమేనా? : కేటీఆర్ - KTR in MLC By Election Campaign

Last Updated : May 25, 2024, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.