ETV Bharat / state

ధరణి పోర్టల్ ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు - TG Govt Focus on Dharani Problems - TG GOVT FOCUS ON DHARANI PROBLEMS

Dharani Portal Issues in Telangana : ధరణిని సమగ్రంగా ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కమిటీ సూచనల మేరకు భూములకు సంబంధించిన చట్టాలన్నీ కలిపి సమగ్రంగా ప్రత్యేక చట్టం చేయాలని భావిస్తోంది. ధరణి పేరును భూమాతగా మార్చడం సహా రెవెన్యూ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేసేలా ముసాయిదా బిల్లు తయారవుతోంది. వచ్చేనెలలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఆ చట్టం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ధరణి పోర్టల్‌ను సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా అందుబాటులోకి తెస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సుమారు 2,20,000ల దరఖాస్తులను నెలరోజుల్లో పరిష్కరించాలని అధికారులను, భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ ఆదేశించారు.

Telangana Govt Focus on Dharani Problems
Telangana Govt Focus on Dharani Problems (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 15, 2024, 7:38 AM IST

Updated : Jun 15, 2024, 8:13 AM IST

ధరణి పోర్టల్‌ పేరుని భూమాతగా మార్చనున్న రాష్ట్ర ప్రభుత్వం (ETV Bharat)

Telangana Govt Focus on Dharani Problems : ధరణితోపాటు భూ వ్యవస్థలను సమగ్రంగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడున్న ఆర్వోఆర్ ​చట్టాన్ని సవరించేందుకు బదులుగా భూములకు సంబంధించిన చట్టాలన్నీ కలిపి సమగ్రంగా ప్రత్యేక చట్టం చేసే దిశగా కసరత్తుచేస్తోంది. ఈ మేరకు ముసాయిదా బిల్లును సిద్ధం చేస్తున్న సర్కార్‌ వచ్చే నెలలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదించాలని యోచిస్తోంది.

ధరణి పేరుని భూమాతగా మార్చనున్నారు. భూమాత పోర్టల్‌లో ఇప్పుడున్న మాడ్యూళ్ల సంఖ్యని వీలైనంత వరకు తగ్గించి సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దేలా కసరత్తు చేస్తోంది. పోర్టల్ నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకుండా ప్రభుత్వానికి చెందిన ఎన్​ఐసీ లేదా సీజీజీ లేదా టీఎస్ ఆన్​లైన్​కి అప్పగించే అవకాశం కనిపిస్తోంది. సమస్యను బట్టి తహసీల్దార్ల నుంచి సీసీఎల్​ఏ పరిష్కార బాధ్యతలు అప్పగించనున్నారు. రెవెన్యూ ట్రైబ్యునళ్లని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీ సూచనలతో ప్రభుత్వం వాటిని పరిశీలిస్తోంది. ఆ కమిటీ త్వరలోనే తుది నివేదిక ఇవ్వనుంది.

Dharani Portal Issues in Telangana : తుది నివేదిక సమర్పించే ముందే కమిటీ సిఫార్సులపై జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. ఇప్పటికే కమిటీ సభ్యులతో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమావేశమై సిఫార్సులపై చర్చించారు. ధరణి పోర్టల్‌ను పునర్‌వ్యవస్థీకరించి భూ సంబంధిత చట్టాల్లో మార్పులు చేసేదిశగా చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. అందరికీ సులువుగా అందుబాటులో ఉండేలా పోర్టల్​లో మార్పులు చేర్పులు చేస్తామని చెప్పారు.

ధరణి పోర్టల్‌ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టాం : మంత్రి పొంగులేటి - Minister Ponguleti on Dharani

అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే ధరణి సమస్యలపై దృష్టిసారించిన తెలంగాణ సర్కార్ జనవరి 9న ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కిసాన్ కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి, విశ్రాంత ఐఏఎస్​ అధికారి రేమండ్‌పీటర్, న్యాయవాది సునీల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ సభ్యులుగా సీసీఎల్​ఏ నవీన్‌ మిత్తల్ కన్వీనర్‌గా ఏర్పాటైన కమిటీ నిపుణులు, అధికారులతో చర్చించింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ ​చట్టాలను పరిశీలించింది. క్షేత్రస్థాయిలో పర్యటించి పలు సమస్యలు గుర్తించి ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించింది.

మాడ్యుళ్లలో మార్పులు : రాష్ట్రంలో 2020లో అమల్లోకి వచ్చిన ఆర్వోఆర్​ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ తేల్చింది. హడావుడిగా భూసమగ్ర సర్వే చేసి ఆ రికార్డులను ప్రామాణికంగా తీసుకోవటంతో సమస్యలు, రికార్డుల వివాదాలు పెరిగాయని కమిటీ భావిస్తోంది. పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు కలెక్టర్ వరకు వెళ్లాల్సి వస్తోందని కమిటీ తెలిపింది. ధరణిలో 35 మాడ్యుళ్లు ఉండటంతో ఏ సమస్యకు ఏ మ్యాడ్యూల్‌లో దరఖాస్తు చేసుకోవాలో అర్థం కాక రైతులు ఇబ్బంది పడుతున్నట్లు కమిటీ పరిశీలనలో తేలింది.

ప్రభుత్వ ధనం దుర్వినియోగం : ఒక్కోతప్పు సవరించుకునేందుకు దాదాపు వెయ్యి ఫీజు చెల్లించడం రైతులకు భారంగా మారిందని కమిటీ తెలిపింది. ధరణి డేటానే వ్యవసాయశాఖ ప్రామాణికంగా తీసుకోవడంతో రైతుబంధు రూపంలో ఇప్పటికే కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం జరిగిందని గుర్తించింది. ధరణి లోపాలను సవరించాలంటే పలు చట్టాలను సవరించడం లేదా కొత్త సమగ్ర ఆర్వోఆర్​ చట్టం చేయటం తప్ప మరో మార్గం లేదని కమిటీ సూచించింది.

అసెంబ్లీ సమావేశాల్లోపే పరిష్కారం : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 2,45,000ల దరఖాస్తుల పరిష్కారం కోసం మార్చి 1 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. సుమారు లక్ష అర్జీలను పరిష్కరించారు. ఆ తర్వాత మరో లక్ష వరకు కొత్తగా వచ్చాయి. రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా ఉండటంతో పెండింగ్‌ దరఖాస్తులు ప్రస్తుతం 2,20,000లకు చేరాయి. అసెంబ్లీ సమావేశాల్లోపే పెండింగ్‌ అర్జీలను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

శుక్రవారం భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ జిల్లాల కలెక్టర్లతో పాటు అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణికి సంబంధించిన పెండింగ్‌ దరఖాస్తులని వెంటనే పరిష్కరించాలని నవీన్ మిత్తల్ ఆదేశించారు. అర్జీ సంఖ్యని బట్టి ఒక్కో జిల్లాకు వారం నుంచి నెల రోజుల వరకు గడువు విధించారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో, అతి తక్కువగా ములుగు జిల్లాలో దరఖాస్తులు పెండింగులో ఉన్నట్లు అధికారులు వివరించారు.

Special Drive on Dharani Portal Issue :పెండింగ్ దరఖాస్తుల్లో దాదాపు సగం పాస్‌బుక్‌లో తప్పులు సరిదిద్దడంమే ఉన్నట్లు అధికారులు చెప్పారు. ధరణి పోర్టల్​లో 188 సాంకేతిక లోపాలను గుర్తించి అందులో 163 సరిదిద్దినట్లు నవీన్ మిత్తల్ తెలిపారు. నెలాఖరు వరకు వీలైనన్ని పరిష్కరించాలని వారం, పది రోజుల్లో మరోసారి సమీక్షించనున్నట్లు ఆయన అధికారులకు చెప్పారు.

పెండింగ్‌లో 2.06 లక్షల ధరణి దరఖాస్తులు - వేగం పెంచాలని రెవెన్యూ శాఖకు కమిటీ సూచన - Dharani Pending Applications

త్వరలోనే ధరణి స్థానంలో భూ భారతి - ఇకనైనా సమస్యలు పరిష్కారమయ్యేనా? - BHU BHARATI IN PLACE OF DHARANI

Last Updated : Jun 15, 2024, 8:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.