ETV Bharat / state

తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే - ఆ పత్రాలన్నీ రెడీ చేసుకోండి !

తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే - 75 ప్రశ్నలతో సర్వే ఫారమ్ - ఫొటోలు, పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు

family_survey_in_telangana
family_survey_in_telangana (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2024, 3:40 PM IST

Comprehensive Family Survey in Telangana: తెలంగాణలో ఇంటింటి కుటుంబ సర్వేకు అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. ఈ సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల, రాజకీయాలకు సంబంధించిన సమాచారం సేకరించనున్నారు. ఈ క్రమంలో సర్వే చేసే ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఏ ప్రశ్నలు అడుగుతారు? ఎలాంటి పత్రాలు దగ్గర పెట్టుకోవాలి? ఎటువంటి సమాధానం చెప్పాలి అనే ప్రశ్నలు చాలా మందిలో వస్తున్నాయి. ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకే ఈ కింద ఇచ్చే సమాచారం.

సర్వే నిర్వహణ ఇలా: సర్వేలో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. వీటి ద్వారా సమాచారం సేకరిస్తారు. ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు ఉండగా, మరో 19 అనుబంధ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 2 పార్టులు అంటే పార్టు-1, పార్టు-2గా ఉండి 8 పేజీల్లో సమాచారం పూరించనున్నారు.

  • పార్టు-1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉంటాయి. అంటే సాధారణ, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూములు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, రాజకీయ సమాచారం అడగనున్నారు.
  • పార్టు-2లో కుటుంబ వివరాలను సేకరిస్తారు. ఇందులో మొత్తం 17 ప్రశ్నల్లో 7 ప్రధాన ప్రశ్నలు ఉండగా, మిగిలినవి అనుబంధ ప్రశ్నలు.

ధరణి ఖాతా, భూముల వివరాలు చెప్పాల్సిందే : భూ వివరాలు సేకరించే క్రమంలో ధరణి పట్టా నెంబరు, భూముల రకాలు మెట్ట, తరి, పడావు వంటి భూమి రకం, ఎకరాలు గుంటల రూపంలో ఎన్యుమరేటర్​కు చెప్పాల్సి ఉంటుంది. సాగు విస్తీర్ణం అనగా నీటి వనరు, కౌలు భూమి సాగు వివరాలు చెప్పాలి.

బోటు షికారు - వింటర్​లో మంచి థ్రిల్ ఇచ్చే టూర్

రిజర్వేషన్​ పొందేవారు: విద్యా, ఉద్యోగ పరంగా రిజర్వేషన్ విధానంతో ప్రయోజనం పొందినా, గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పథకాలు, ఆ వివరాలు నమోదు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్ల్యూఎస్​ ధ్రువపత్రాలు పొందారా? అనేవి నమోదు చేస్తారు.

రాజకీయ నేపథ్యం: ప్రజాప్రతినిధిగా సభ్యత్వం కింద ప్రస్తుతం, పూర్వం ఏ పదవిలో ఉన్నారనేది తెలుసుకుంటారు. పదవీ కాలం, నామినేటెడ్ వివరాలు నమోదు చేస్తారు. ఈ ప్రశ్నావళి ప్రజాప్రతినిధులుగా పని చేసిన వారికి వర్తిస్తుంది.

ఈ పత్రాలు దగ్గర ఉంచుకొండి: ఆధార్ కార్డులు, రైతులైతే అదనంగా ధరణి పాస్​ పుస్తకాలు దగ్గర ఉంచుకోవాలి. సర్వే చేసినప్పుడు సులువుగా వివరాలు అందించవచ్చు.

వలసలు: ఒక కుటుంబంలో ఎవరైనా ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళితే వారి వివరాలు చెప్పాలి. వలసలు వెళ్లడానికి కారణం కూడా అడుగుతారు.

ఫొటోలు తీయరు - పత్రాలు తీసుకోరు: సర్వే సందర్భంగా ప్రతి కుటుంబం ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సర్వే సందర్భంలో ఫొటోలు, పత్రాలు వంటివి తీసుకోరు. అలాగే కుటుంబీకులు అందరూ ఉండాల్సిన పని లేదు. కుటుంబ యజమాని ఉండి ఆయా వివరాలను నమోదు చేయిస్తే సరిపోతుంది. వారు ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.

ఇన్​స్టాలో పరిచయం - కట్​చేస్తే ఏకంగా ఇంటికే కన్నం వేసిన బాలిక

ఈ సమాచార సేకరణ:

  • ఐదేళ్లలో రుణాలు ఎందుకు తీసుకున్నారు. (ఎక్కడి నుంచి రుణాన్ని పొందారు)
  • ఏదైనా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో పాల్గొంటే ఆ వివరాలు
  • పశుసంపద సంఖ్య
  • చరాస్తి, స్థిరాస్తి వివరాలు
  • రేషన్ ​కార్డు నెంబరు (ఉంటేనే)
  • నివసించే నివాసం విస్తీర్ణం (చదరపు గజాల్లో), గదుల సంఖ్య, నివాసరకం, విద్యుత్​ సదుపాయం
  • తాగునీటి వనరు
  • మరుగుదొడ్డి
  • వంట కోసం ఏ ఇంధనం వినియోగిస్తారు

సాధారణ వివరాలు నమోదు చేసినప్పుడు తీసుకునే వివరాలు:

  • కుటుంబ యజమాని
  • సభ్యుల పేర్లు
  • సంబంధం
  • మతం
  • సామాజికవర్గం
  • వయసు
  • మాతృభాష
  • ఆధార్‌కార్డు నెంబరు (ఐచ్ఛికం)
  • మొబైల్‌ నెంబర్
  • దివ్యాంగులైతే వైకల్యం
  • వైవాహిక స్థితి

విద్యా వివరాల నమోదులో: పాఠశాలలో చేరిన నాటికి వయసు ఎంతో చెప్పాలి. విద్యార్హతను చెప్పాలి. ఏ మీడియంలో చదివారని తెలియజేయాలి. ఒకవేళ బడి మానేస్తే ఆ వివరాలు కూడా నమోదు చేయాలి.

ఉద్యోగ, ఉపాధి వివరాలు: ఈ విషయానికి వచ్చినప్పుడు ప్రస్తుతం చేసే పని, ఉద్యోగం, వృత్తి, ఉపాధి సమాచారం ఇవ్వాలి. వార్షికాదాయం, ఒకవేళ వ్యాపారులైతే వార్షిక టర్నోవర్ తెలియజేయాలి. సాంప్రదాయ కులవృత్తులయితే ఆ వృత్తి కొనసాగిస్తున్నారా? లేదా? అని రాయాలి. కుల వృత్తితో కలిగిన వ్యాధి (ఉంటేనే) చెప్పాలి. ఆదాయ పన్ను చెల్లింపుదారులా? అవునా, కాదా చెప్పాలి. బ్యాంకు ఖాతా ఉందా, లేదా తెలియజేయాలి.

మహా మాయగాళ్లు - మాటలతో లాక్ చేస్తారు - ఆపై అందినకాడికి సొమ్ము కాజేస్తారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.