ETV Bharat / state

వంటింట్లో మంటలు - నూనె ధరల పెంపుతో సామాన్యులపై భారం వేసిన కేంద్రం - Increased cooking oil prices - INCREASED COOKING OIL PRICES

Common People Worried about Huge Increase in Cooking Oil Prices: పోపు పెట్టాలన్నా, రుచికరంగా కూర వండాలన్నా, దోసెలు, గారెలు వేయాలన్నా వంట నూనె ఉండాల్సిందే. ఇది లేకుండా ఆహార పదార్థాల తయారీని ఊహించలేం.! ఇప్పుడా వంట నూనె ధరలు సలసల కాగుతున్నాయి. ఒక్కసారిగా కిలోపై 15 నుంచి 20 రూపాయల వరకు పెరిగింది.

Increased_cooking_oil_prices
Increased_cooking_oil_prices (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2024, 3:29 PM IST

Updated : Sep 23, 2024, 7:02 PM IST

Common People Worried about Huge Increase in Cooking Oil Prices: పండగల సీజన్ ప్రారంభం కానున్న వేళ సామాన్యుల నెత్తిన మరో భారం పడింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. చౌక దిగుమతుల కారణంగా దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న నేపథ్యంలో స్థానిక రైతులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఎక్కువమంది ఉపయోగించే పామాయిల్, పొద్దు తిరుగుడు నూనె ధరలు భారీగా పెరిగాయి. గత శుక్రవారం అర్ధరాత్రి నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి.

రెండు రోజుల కిందట సొమ్ము చెల్లించుకుని డెలివరీ ఇవ్వాల్సిన ట్యాంకర్లకు సంబంధించి మొత్తాన్ని వ్యాపార సంస్థలు వ్యాపారులకు తిరిగిచ్చేశాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా సొమ్ము చెల్లిస్తే సరఫరా చేస్తామని షరతు విధించాయి. దీంతో రిటైల్ వ్యాపారులు పెరిగిన ధరల ప్రకారమే వంట నూనెను కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా వరుసగా పండుగ సీజన్లలో వంటనూనె ధరలు పెరగడంతో తాము అనుకున్న బడ్జెట్ కంటే ఖర్చు మించిపోతోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వ్యాపారానికి పట్టణమే అవసరం లేదు - మంచి ఆలోచన ఉంటే చాలంటున్న యువతి - Eco Friendly Bags

వంటింట్లో మంటలు - నూనె ధరల పెంపుతో సామాన్యులపై భారం వేసిన కేంద్రం (ETV Bharat)

వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించడమే ఆలస్యం వాటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. లీటరుపై 15 నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి. లీటర్ ప్యాకెట్ 115గా ఉన్న పొద్దు తిరుగుడు నూనె ధర 130కి చేరింది. చిల్లర దుకాణాల్లో ఇంకా ఎక్కువే అమ్ముతున్నారు. పామాయిల్ లీటర్ ప్యాకెట్ ధర 115 అయింది. కేంద్రం ముడి పామోలిన్, సోయా, పొద్దుతిరుగుడుపై సుంకం విధిస్తున్నట్లు ప్రకటించగా దుకాణాల్లో అన్ని రకాల వంటనూనెల ధరలనూ భారీగా పెంచేశారు. నగరాలు, పట్టణాల్లోని దుకాణాల్లోనే కాదు ఆన్​లైన్ విక్రయ సంస్థలు కూడా ధరల్ని అమాంతం పెంచేసాయి.

ఇప్పటికే పెరిగిన బియ్యం, కూరగాయలు, తదితర నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న ప్రజలకి వంట నూనెల ధరలూ కూడా పెరగడంతో వినియోగదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిల్వ ఉన్న సరకును కూడా అధిక ధరలకు విక్రయించడమేంటని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వంటనునెల ధరలు ప్రస్తుతం పెరగడంతో రాబోయే రోజుల్లో మరింత ధరలు పెరుగుతాయనే వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

కోనసీమ కొబ్బరికి మంచి రోజులు - నెల రోజుల్లోనే రెట్టింపు ధర - Konaseema Coconut Prices Hike

భక్తులు ఆందోళన చెందొద్దు - పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశాం: టీటీడీ - maha shanti homam in tirumala

Last Updated : Sep 23, 2024, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.