Good News For RTC STAFF: ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నాలుగేళ్లుగా వేలాది మంది ఉద్యోగులు పడుతోన్న కష్టాలని తీర్చింది. డ్రైవర్లు, కండక్టర్లకు నైటౌట్ అలవెన్సులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. రాత్రి విధులు చేసే సిబ్బందికి రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్సు చెల్లించేలా ఈరోజు జీవో విడుదల చేసింది. హెడ్ క్వార్టర్ వెలుపల 6 నుంచి 12 గంటల లోపు హాల్ట్ చేసిన సిబ్బందికి ఈ అలవెన్సు మొత్తాన్ని వర్తింపజేస్తున్నట్లు ఆదేశాల్లో తెలిపింది. దీనివల్ల నైటౌట్ అలవెన్సులు మంజూరై సుదూర ప్రాంతాలకు రాత్రి డ్యూటీలపై వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్ధిక లబ్ది చేకూరనుంది.
Electric Bus: కడప-తిరుపతి మధ్య విద్యుత్ బస్సులు.. ప్రారంభించిన ఆర్టీసీ ఛైర్మన్
అలవెన్సులను తొలగించిన వైఎస్సార్సీపీ: ఆర్టీసీ సిబ్బంది అదనంగా పనిచేసిన నిర్ణీత గంటల ప్రకారం లెక్కగట్టి మరీ నైటౌట్ అలవెన్సు మొత్తాన్ని వేతనంతో కలిపి ఇవ్వనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటి నుంచి ఉద్యోగులకు వస్తోన్న నైటౌట్ అలవెన్సులను వైఎస్సార్సీపీ సర్కారు నిర్దాక్షిణ్యంగా తొలగించింది. నాలుగేళ్లుగా ఈ అలవెన్సులు రాక ఉద్యోగులంతా లక్షల్లో నష్టపోయారు.
ఆర్టీసీలోని ఉద్యోగ సంఘాలన్నీ నాలుగేళ్లుగా లెక్కలేనన్ని సార్లు ఈ సమస్యపై పలు లేఖలు, పోరాటాలు చేసినా అప్పటి సీఎం జగన్ ఖాతరు చేయలేదు. సరిగ్గా ఎన్నికలు సమీపించడానికి కేవలం రెండు నెలల ముందు స్పష్టమైన జీవో జారీ చేయకుండానే పరిమిత డిపోల్లోనే నైటౌట్ అలవెన్సులు ఇచ్చి దీనికి మంగళం పాడారు. అన్ని డిపోల్లో అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేసినా పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో నైటౌట్ అలవెన్సులు మంజూరు కోసం ఆర్టీసీ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.
దేవాలయాల్లో తొలిసారిగా విద్యుత్ బస్సును ప్రారంభించిన సింహాచలం దేవస్థానం - Simhachalam Devasthanam
సర్వత్రా హర్షాతిరేకాలు: కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైటౌట్ అలవెన్సులను మంజూరు చేయాలని ఆర్టీసీ ఎండీ సహా ఆర్ధిక శాఖ అధికారులకు ఆదేశించారు. దీంతో యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకున్న అధికారులు దస్త్రాన్ని సిద్దం చేసి ఆర్దిక శాఖ ఆమోదం తీసుకున్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సైతం పలు మార్లు సమావేశాలు ఏర్పాటు చేసి నైటౌట్ అలవెన్సుల జారీ కోసం చర్యలు తీసుకున్నారు.
ఎట్టకేలకు కూటమి ప్రభుత్వంలో నైటౌట్ అలవెన్సుల మంజూరు చేయడంపై ఆర్టీసీ లోని వేలాది డ్రైవర్లు, కండక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆర్టీసీలోని అన్ని ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు.
ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ - ఆ బస్సుల్లో ఛార్జీలు తగ్గింపు
గత వైఎస్సార్సీపీ సర్కారు అలవెన్సులు తొలగించడం వల్ల ఆర్టీసీ ఉద్యోగులు నష్టపోయారని, కూటమి ప్రభుత్వం వచ్చాక అలవెన్సులు మంజూరు చేసినట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. నైటౌట్ అలవెన్సులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసి విలీనానంతరం వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
వృద్ధులకు గుడ్న్యూస్ - ఈ కార్డులుంటే ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ