Government Efforts To Establish Handloom Factory In Vizianagaram District : వైఎస్సార్సీపీ హయాంలో అన్నిరంగాలతోపాటు చేనేత రంగం కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. కొనుగోళ్లు నిలిచి గత బకాయిలు విడుదల కాక సొసైటీలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఇటు రాయితీ నూలు అందక వందల మగ్గాలు మూలకు చేరాయి. ఫలితంగా విజయనగరం జిల్లాలో చేనేత సొసైటీలపై ఆధారపడిన నేత కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. చేనేత రంగానికి ఊతమిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం విజయనగరం జిల్లాలో చేనేతశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీంతో నేతన్నల బతుకు మారనుంది.
చేనేత రంగంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విజయనగరం జిల్లాది ప్రముఖ స్థానం. ఈ ప్రాంతంలో నేత చీరలకు అధిక ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో 25 చేనేత సహకార సంఘాలు ఏర్పడ్డాయి. ఈ సంఘాల్లో సభ్యుల సంఖ్య 3,800 ఉండేది. ఇక్కడి చేనేత ఉత్పత్తులకు మార్కెట్ సౌలభ్యం లేకపోవడంతో ఆప్కో కొనుగోళ్లే ప్రధాన ఆధారం. వస్త్రాలు తయారుచేసి సంఘాల్లో విక్రయించడం ద్వారా నేత కార్మికులు ఉపాధి పొందుతారు. ముడిసరుకైన నూలు సంఘాల ద్వారా చేనేత కార్మికులకు లభిస్తుంది.
చేనేతకు చేయూతేదీ - కుటుంబ పోషణ కష్టమై కులవృత్తిని వీడుతున్న నేతన్నలు - Problems of Handloom Industry
ఆప్కో ఆర్డర్ల మేరకు సాధారణ, ఇతర రకాల వస్త్రాలు తయారవుతాయి. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో చేనేత రంగానికి ఆదరణ కరవైంది. కార్మికులకు ఉపాధి దూరమైంది. పట్టు, నూలు వంటి ముడిసరుకులపై అప్పటివరకు ఉన్న 18 శాతం రాయితీని గత ప్రభుత్వం ఎత్తేసింది. నూలు, రంగులు, రసాయనాలపై 18శాతం జీఎస్టీ విధించింది. ఫలితంగా విజయనగరం జిల్లాలో 25 ఉన్న చేనేత సంఘాలు 12కు పడిపోయాయి. సంఘాల్లో సభ్యుల సంఖ్య 750కి తగ్గిపోయింది.
ఆర్థికంగా చితికిపోయిన నేతన్నలు : విజయనగరం జిల్లాలో నేతన్నలు మగ్గాలపై నేసిన 33లక్షల రూపాయల విలువైన వస్త్రాలు, ఏకరూప దుస్తులు సుమారు 60వేల టన్నుల వరకు గత ప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోలు చేయలేదు. ఇందులో అత్యధికంగా కొట్టక్కి, కోటగండ్రేడు, రాజాం, పెనుబాక చేనేత సొసైటీల్లో నిల్వలు ఉండిపోయాయి. టీటీడీ నుంచి పంచెలు, తువ్వాళ్ల కొనుగోలుకు వైఎస్సార్సీపీ హయాంలో ఆర్డర్లు రాలేదు. ఇదే సమయంలో రాయితీలు, ప్రోత్సాహకాలు లేకపోవడంతో నేత కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో నేత కార్మికులు ఆర్థికంగా చితికిపోయారు.
కూటమి ప్రభుత్వం విజయనగరం జిల్లాలో చేనేతశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చేనేతశాల ఏర్పాటుకు కోటి రూపాయల నిధులు కేటాయించారు. రాజాం పరిసర ప్రాంతాల్లో చేనేతశాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. చేనేతశాల ఏర్పాటు చేస్తే తమకు ఉపాధి కలుగుతుందని నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చేనేత రంగంపై జీఎస్టీ పెంపు వెనక్కి తీసుకోండి.. కేంద్రానికి లోకేశ్ లేఖ