ETV Bharat / state

అప్పుల లెక్కలు ఓకే - అమ్మకాల సంగతేంటి? - వాటిపై విచారణకు రెడీయా? : సీఎం రేవంత్ - CM REVANTH SLAMS HARISH RAO - CM REVANTH SLAMS HARISH RAO

Telangana Assembly Budget Session 2024 : అప్పుల లెక్కలు చెప్పిన హరీశ్​రావు, అమ్మకాల లెక్కలు చెప్పట్లేదని సీఎం రేవంత్​ రెడ్డి ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం లక్షల కోట్ల విలువైన ఓఆర్​ఆర్​ను రూ.7 వేల కోట్లకు అమ్ముకుందని ఆరోపించారు.

CM Revanth Reddy speech telangana assembly budget session 2024
CM Revanth Reddy speech telangana assembly budget session 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 12:04 PM IST

Updated : Jul 27, 2024, 1:09 PM IST

CM Revanth Reddy Budget Session 2024 Speech : గత ప్రభుత్వం లక్షల కోట్ల విలువైన ఓఆర్​ఆర్​ను రూ.7 వేల కోట్లకు అమ్మిందని, గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్లు అవినీతి జరిగిందని సీఎం రేవంత్​ రెడ్డి ఆరోపించారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీశ్​ రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదని విమర్శించారు. బతుకమ్మ చీరలు అని సూరత్​ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేశారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో హరీశ్​ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్​ రెడ్డి ఘాటుగా స్పందించారు.

కేసీఆర్​కు పాలమూరు జిల్లా ప్రజలు ఏం అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పదేళ్లలో పూర్తి చేయలేదని అన్నారు. కేసీఆర్​ పాలనలో రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల విలువైన భూములు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా అంటూ బీఆర్​ఎస్​ నేతలను సీఎం కేసీఆర్​ ప్రశ్నించారు.

ఆడబిడ్డల సెంటిమెంట్​ను బతుకమ్మ చీరల పంపిణీ రూపంలో దోపిడీకి పాల్పడ్డారని సీఎం రేవంత్​ రెడ్డి విమర్శలు చేశారు. కురుమ, యాదవులను అమాయకులను చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారని తెలిపారు. కాళేశ్వరం ఖర్చు విషయంలోనూ గతంలో ఒకటి చెప్పి ఇప్పుడు రూ.94 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్​ఎస్​ హయాంలో ఎన్ని వేల కోట్ల విలువైన భూములు అమ్మారో లెక్క తీస్తామని హెచ్చరించారు.

"గత ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చింది. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా రంగారెడ్డి జిల్లాపై నిర్లక్ష్యం వహించారు. ఈ జిల్లా ఆస్తులు అమ్ముకున్నారు కానీ సాగు నీరు ఇవ్వలేదు. ప్రజలు బీఆర్​ఎస్​కు గుండు సున్నా ఇచ్చినా బుద్ధి మారకుండా ఇలా మాట్లాడటం సరైంది కాదు. బతుకమ్మ చీరలు, కేసీఆర్​ కిట్స్​, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాలి." - రేవంత్​ రెడ్డి, సీఎం

సభ్యులు మాట్లాడే తప్పును సరిచేసే బాధ్యత తనపై ఉంది : సభ్యులు మాట్లాడే తప్పును సరిచేసే బాధ్యతను తనపై ఉందని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు. సభలో అబద్ధాలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని అన్నారు. 2018 డిసెంబరు లోపల విద్యుత్​ మీటర్ల బిగిస్తామని కేసీఆర్​ కేంద్రానికి చెప్పారు. అధికారిక లెక్కలు చూసి హరీశ్​ రావు స్పందించాలని సీఎం రేవంత్​ తెలిపారు.

కేసీఆర్​ మార్క్​ను కంప్యూటర్ నుంచి తొలగించగలరేమో కానీ - ప్రజల మనసులోంచి కాదు : హరీశ్‌రావు - Harish Rao On Budget

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి - అధికారులకు సీఎం ఆదేశం - CM Revanth on Panchayat Elections

Last Updated : Jul 27, 2024, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.