ETV Bharat / state

ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ విధానం - అక్రమంగా నిర్వహిస్తున్న స్టోన్​ క్రషర్స్​ సీజ్ : రేవంత్ రెడ్డి - New Sand Policy in Telangana

CM Revanth Reddy Review on Sand Policy : రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రజలకు ప్రయోజనం, ప్రభుత్వానికి ఆదాయం ఉండేలా కొత్త ఇసుక విధానాన్ని తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే హైదరాబాద్​లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్​ క్రషర్స్​ను సీజ్​ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

CM Revanth Reddy Review on Sand Policy
cm revanth reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 9:56 PM IST

CM Revanth Reddy Review on Sand Policy : వరుస సమీక్షలతో బిజీబిజీగా ఉన్న సీఎం రేవంత్​ రెడ్డి తాజాగా గనులు, భూగర్భ వనరుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ విధానాన్ని (New Sand Policy 2024) తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఇసుక తవ్వకాలు, రవాణా, అమ్మకాల్లో అడుగడుగునా అక్రమాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త పాలసీ రూపొందించాలని అందుకోసం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.

నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక క్వారీయింగ్, అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. రెండు రోజుల తర్వాత విజిలెన్స్, ఏసీబీ విభాగాలను రంగంలోకి దింపి అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇసుక అక్రమాలకు పాల్పడుతున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దన్నారు. టోల్​ గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా ఇసుక లారీల అక్రమ రవాణా బయటకు తీయాలన్నారు.

New Sand Policy in Telangana : ఇసుక రీచ్​లు, డంపులన్నీ తనిఖీలు చేసి అక్రమాలను గుర్తిస్తే జరిమానాలతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు. ఇసుక రీచ్​ల వద్ద సీసీ కెమెరాలున్నాయన్న అధికారుల సమాధానంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు పాదయాత్రకు వెళ్లినప్పుడు మానేరు వాగులో తనుగుల ఇసుక క్వారీకి వెళ్లగా అక్కడ సీసీ కెమెరాలే లేవని చెప్పారు.

ప్రజలను వేధిస్తే వేటే - అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి మాస్‌ వార్నింగ్‌

ఈనెల 3న నిజామాబాద్, వరంగల్ రూట్లలో రవాణా శాఖతో ఆకస్మిక తనిఖీలు చేయించగా 83 ఇసుక లారీల్లో 22 లారీలకు అనుమతి లేదని తేలిందన్నారు. ఒకే పర్మిట్, ఒకే నంబరుతో నాలుగైదు లారీలు ఇసుక రవాణా చేస్తున్నట్లు బయటపడిందన్నారు. సుమారు 25 శాతం ఇసుక అక్రమంగానే తరలిపోతుందని సీఎం చెప్పారు. అధికారులు 48 గంటల్లో తమ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. టీఎస్ఎండీసీ కేంద్రంగా జరుగుతున్న అక్రమాలను అరికట్టి గనులు, భూగర్భ వనరుల విభాగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు.

అనుమతి లేని స్టోన్ క్రషర్స్ సీజ్ చేయాలి : హైదరాబాద్ పరిసరాల్లో అనుమతి లేని స్టోన్ క్రషర్స్ వెంటనే సీజ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశించారు. భారీ కాంప్లెక్స్​లు నిర్మించేటప్పుడు రోడ్లపై కంకర, బిల్డింగ్ మెటీరియల్ వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు. సెల్లార్లు ఆరు మీటర్లకన్నా ఎక్కువగా తవ్వితే నిబంధనల ప్రకారం పన్ను వసూలు చేయాలని అధికారులను ఆదేశాలు ఇచ్చారు.

భారీ భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేటప్పుడే గనులు, భూగర్భ వనరుల శాఖకు ఆ వివరాలు చేరేలా సమీకృత ఆన్​లైన్ విధానం అమలు చేయాలని సూచించారు. గ్రానైట్, ఖనిజాల తవ్వకాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు జియో ట్యాగింగ్, జీపీఆర్ఎస్​ను వినియోగించాలని సీఎం సూచించారు. గ్రానైట్, ఇతర క్వారీలపై నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి తదితర వివరాలతో నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.

గతంలో నిర్వహించిన గ్రూప్​-1 రద్దు - అదనంగా మరో 60 ఖాళీలతో త్వరలోనే కొత్త నోటిఫికేషన్ : సీఎం రేవంత్​రెడ్డి

నిజాం షుగర్స్ పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష - హాజరైన మంత్రులు శ్రీధర్​ బాబు, దామోదర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.