CM Revanth Reddy On Skill University In Telangana : సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుని ప్రపంచంతో యువతతో పోటీ పడాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. యుంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చలో మాట్లాడిన ముఖ్యమంత్రి విద్యార్థుల కోసం 17 కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. వృత్తి నైపుణ్యం లేకపోవడంతో పట్టాలు ఉన్నా ఉద్యోగాలు దొరకలేదన్న రేవంత్ దేశానికి ఆదర్శంగా నిలపాలనే ఉద్దేశంతో స్కిల్ వర్సిటీ రూపకల్పన చేసినట్టు తెలిపారు.
ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి వ్యవసాయం, విద్యకు ఎంతో ప్రాధాన్యతనిచ్చాని రేవంత్ వివరించారు. రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తెచ్చారని గుర్తుచేశారు. ఇందిరాగాంధీ చదువుకునే విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇచ్చి ప్రోత్సహించారన్న ఆయన, రాజీవ్ గాంధీ దేశానికి సాంకేతికను అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు.
హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి ఆనాడు రాజీవ్ గాంధీ పునాదులు వేశారని చెప్పారు. ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో నైపుణ్యం ఉన్నవారి కొరత ఉందన్న ఆయన వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల నిరుద్యోగం పెరుగుతోందని పేర్కొన్నారు. అందుకే అందరికీ అన్ని రకాల నైపుణ్యాలను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేబోతున్నామని రేవంత్ స్పష్టం చేశారు.
యంగ్ ఇండియా పత్రిక మహాత్మాగాంధీ మొదలు పెట్టారు. ఆయన స్పూర్తితో యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోబోతున్నాం. లక్షలాదిమంది యువతకు ఉపాధి కల్పించడమే స్కిల్ యూనివర్సిటీ ఉద్దేశం. స్కిల్ యూనివర్సిటీపై ప్రధాన ప్రతిపక్ష నాయకులు సూచనలు ఇస్తే సంతోషించేవాళ్ళం. కానీ వారు సభకు రాలేదు వచ్చిన వారు వాకౌట్ చేసి వెళ్లిపోయారు. స్కిల్ 17 కోర్సులను యూనివర్సిటీలో ప్రవేశపెట్టనున్నాం. స్కిల్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్స్ అందించాలని నిర్ణయం తీసుకున్నాం- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
అవసరమయితే రీయింబర్స్మెంట్ ద్వారా ఉచిత శిక్షణ : ఏడాదికి రూ.50వేలు నామ మాత్రపు ఫీజుతో కోర్సుల శిక్షణ అందించనున్నట్లు సీఎం రేవంత్ వివరించారు. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఉచితంగా అందిస్తామని అన్నారు. గురువారం సాయంత్రం స్కిల్ యూనివర్సిటీకి భూమిపూజ చేయబోతున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం 6కోర్సులకు రెండువేల మందికి అడ్మిషన్స్ కు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయన్న ఆయన భవిష్యత్‌లో జిల్లాల్లోనూ కళాశాలలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
రాజకీయాలకు అతీతంగాా స్వాగంతించాలి : రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించడం, ప్రైవేటులో యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముచ్చెర్లలో 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ' ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దీన్ని అన్ని రాజకీయపక్షాలు స్వాగతించాలని కోరారు. యువత భవిష్యత్తు మార్పునకు స్కిల్ యూనివర్సిటీ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ పై జరిగిన చర్చలో మంత్రి కోమటిరెడ్డి వివరాలు ఇచ్చారు. బీటెక్, పాలిటెక్నిక్ పూర్తిచేసిన యువత నైపుణ్యాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్న గత ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
త్వరలో జాబ్ క్యాలెండర్ - 2 లక్షల ఉద్యోగాల భర్తీ : మంత్రి శ్రీధర్‌బాబు - JOB CALENDER IN TELANGANA
అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశ పెట్టిన మంత్రి శ్రీధర్ బాబు