ETV Bharat / state

'అసెంబ్లీ సమావేశాల్లోగా స్కిల్​ వర్సిటీ ఏర్పాటుకు పూర్తిస్థాయి ముసాయిదా సిద్ధం చేయండి' - CM Revanth on Skill University

CM Revanth on Skill University : అసెంబ్లీ సమావేశాల్లో స్కిల్​ వర్సిటీ బిల్లు పెట్టే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దిల్లీ, హర్యానా తరహాలో రాష్ట్రంలో స్కిల్​ వర్సిటీ ఏర్పాటుకు అధికారులు ముసాయిదాను సిద్ధం చేశారు. ఈ మేరకు స్కిల్​ వర్సిటీపై సీఎం రేవంత్​ రెడ్డి సమావేశం నిర్వహించారు.

CM Revanth on Skill University
CM Revanth on Skill University (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 19, 2024, 7:45 PM IST

Updated : Jul 19, 2024, 9:50 PM IST

CM Revanth Meeting on Skill University Establishment : దిల్లీ, హర్యానా తరహాలో రాష్ట్రంలో స్కిల్​ వర్సిటీ ఏర్పాటుకు అధికారులు ముసాయిదాను సిద్ధం చేశారు. వర్సిటీలో సర్టిఫికేషన్​ కోర్సులు, డిప్లొమా కోర్సుల వివరాలు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ స్కిల్​ వర్సిటీ బిల్లు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు ప్రాథమికంగా నిర్ణయించింది. తెలంగాణ స్కిల్​ యూనివర్సిటీ ముసాయిదా బిల్లుపై సచివాలయంలో సీఎం రేవంత్​ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో స్కిల్​ యూనివర్సిటీ ఏర్పాటు, ముసాయిదాపై చర్చించారు.

ముసాయిదా, యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. డిమాండ్​ ఎక్కువగా ఉన్న కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శిక్షణ పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు. దీనిపై ముందుగానే పలు కంపెనీలతో చర్చించాలని సూచించారు. స్కిల్​ యూనివర్సిటీ ఏర్పాటు కోసం నిధుల విషయంలో రాజీపడొద్దని స్పష్టంగా చెప్పారు. సమావేశంలోని సూచనలను పరిగణనలోకి తీసుకొని మార్పులు, చేర్పులతో అసెంబ్లీ సమావేశాల నాటికి పూర్తిస్థాయి ముసాయిదా సిద్దం చేయాలని సీఎం అధికారులకు తెలిపారు.

యుద్ధప్రాతిపదికన స్కిల్​ యూనివర్సిటీ పనులు : గచ్చిబౌలిలో స్కిల్​ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలకు అందుబాటులో ఉన్నందున ఈ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని గత సమావేశంలో సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు. స్కిల్​ యూనివర్సిటీకి ఐబీఎం తరహాలో ఒక బోర్డు ఉండాలని తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులు యుద్ధప్రాతిపదికన జరగాలని గత సమావేశంలో సీఎం ఆదేశించారు.

ఈ నెల 23 నుంచి శాసనసభ సమావేశాలు : శాసనసభ సమావేశాలను ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నారు. ఇందుకు గవర్నర్​ నోటిఫికేషన్​ కూడా విడుదల చేశారు. మొదటి రోజు దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత మృతిపై సంతాపం తెలపనున్నారు. 25వ తేదీన పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. ఈ శాసనసభలోనే జాబ్​ క్యాలెండర్​, ఇతర పథకాలపై శాసనసభలో చర్చించనున్నారు. అలాగే స్కిల్​ యూనివర్సిటీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 24న శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. భద్రతాపరమైన ఏర్పాట్లపై ఇప్పటికే శాసనసభ స్పీకర్​, శానసమండలి ఛైర్మన్​ భద్రతా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.

రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయండి : సీఎం రేవంత్​ రెడ్డి - Skill University in Telangana

ఏఐ సిటీ కోసం హైదరాబాద్​లో 200 ఎకరాల కేటాయింపు : మంత్రి శ్రీధర్ బాబు - Minister Sridhar launch Tech Hub

Last Updated : Jul 19, 2024, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.