ETV Bharat / state

గత పాలకులు మూడు నగరాలు నిర్మించారు - మేము నాలుగో సిటీని నిర్మిస్తాం : సీఎం రేవంత్ - Young India Skill University

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 1, 2024, 7:39 PM IST

Updated : Aug 1, 2024, 10:23 PM IST

Young India Skill University Foundation Stone : రంగారెడ్డి జిల్లాలో యంగ్​ ఇండియా స్కిల్​ యూనివర్సిటీకి సీఎం రేవంత్​, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. 57 ఎకరాల్లో స్కిల్​ యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. దీంతో పాటు మరో నాలుగు సెంటర్లకు శంకుస్థాపన చేశారు.

Young India Skill University Foundation Stone
Young India Skill University Foundation Stone (ETV Bharat)

CM Revanth Laid Foundation Stone to Skill University : గత పాలకులు మూడు నగరాలు నిర్మించారని, ఈ ప్రభుత్వం నాలుగో సిటీని నిర్మించనుందని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో హెల్త్​, స్పోర్ట్స్​, ఇతర కంపెనీలకు హబ్​గా మారుస్తామని వివరించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటామని అన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మెట్రో రైలు కూడా నిర్మించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరి మండలంలోని నిర్మిస్తున్న స్కిల్​ యూనివర్సిటీకి సీఎం రేవంత్​, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు.

యువతకు నైపుణ్యం లేకపోవడం వల్లే తెలంగాణలో నిరుద్యోగ సమస్య ప్రధానంగా మారిందని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. నైపుణ్యమున్న యువతను తీర్చిదిద్దేందుకే స్కిల్​ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. రెడ్డి ల్యాబ్స్​ నుంచి ఎస్​బీఐ వరకు ఎన్నో సంస్థలు ఈ యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చాయని చెప్పారు. అడ్మిషన్​ దొరికితే ఉద్యోగం గ్యారంటీ అని రాష్ట్ర యువతకు హామీ ఇచ్చారు. 57 ఎకరాల్లో సుమారు రూ.150 కోట్లతో స్కిల్​ యూనివర్సిటీని నిర్మిస్తున్నట్లు సీఎం రేవంత్​ తెలిపారు.

"మహేశ్వరం నియోజకవర్గాన్ని నాలుగో నగరంగా తీర్చిదిద్దుతాం. ఈ విషయంలో కొంతమంది వెటకారంగా మాట్లాడుతున్నారు. నాలుగేళ్లలో బేగరికంచె ప్రాంతాన్ని న్యూయార్క్​ కంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తాం. బంజారాహిల్స్​లో వాళ్లలాగా ఈ ప్రాంత ప్రజలు గొప్పగా చెప్పుకునేలా తీర్చిదిద్దుతాం. ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులు అధైర్యపడొద్దని, ఆ కుటుంబాలను ఆదుకుంటాము." - రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

Skill University in Telangana : రూ.150 కోట్లతో 57 ఎకరాల్లో స్కిల్​ యూనివర్సిటీ నిర్మించనున్నామని అన్నారు. స్కిల్​ యూనివర్సిటీతో పాటు మరో నాలుగు ప్రధాన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్కిల్​ యూనివర్సిటీతో కలిసి పని చేసేందుకు ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయని వివరించారు. ఔటర్​ రింగ్​రోడ్డు, ఎయిర్​పోర్టుతో హైదరాబాద్​ రూపురేఖలు మారిపోయాయని గుర్తు చేశారు. ఓఆర్​ఆర్​, విమానాశ్రయంతో రంగారెడ్డి జిల్లా భూముల విలువలు పెరిగాయని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు.

స్కిల్​ యూనివర్సిటీ శంకుస్థాపనకు సంతృప్తి ఇచ్చింది : స్కిల్​ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడం తనతో పాటు రేవంత్​ రెడ్డి మంత్రివర్గానికి ఎనలేని సంతృప్తిని ఇచ్చిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ముచ్చర్ల ప్రాంతం దేశానికి ఆదర్శంగా ఉండేలా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ముచ్చర్ల ప్రాంతవాసులు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి శ్రీధర్​ బాబు కోరారు.

యంగ్​ ఇండియా స్కిల్​ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన : తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్యంతో కూడిన ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదముద్ర పడిన గంట వ్యవధిలోనే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్​ఖాన్ పేట వద్ద సహచర మంత్రులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భూమి పూజ చేశారు. స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ శిలఫలకాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

అంతేకాకుండా ముచ్చర్ల వద్ద ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతుల కోసం బేగరికంచె వద్ద 600 ఎకరాల్లో నిర్మించనున్న నివాస సముదాయాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేశారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మోడ్రన్ స్కూల్, కమ్యునిటీ సెంటర్​కు ముఖ్యమంత్రి భూమి పూజ చేసి ప్రతిపాదిత నిర్మాణాల చిత్ర పటాలను పరిశీలించారు. అనంతరం నెట్ జీరో సిటీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్కిల్ యూనివర్సిటీ ప్రాధాన్యతను, నాలుగో నగరం అభివృద్ధిని వివరించారు.

స్కిల్ యూనివర్సిటీలో 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నాం : రేవంత్ రెడ్డి - CM Revanth On Skill University

అసెంబ్లీలో స్కిల్​ యూనివర్సిటీ బిల్లును ప్రవేశ పెట్టిన మంత్రి శ్రీధర్​ బాబు

Last Updated : Aug 1, 2024, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.