ETV Bharat / state

ఎమ్మెల్సీ ఉపఎన్నికపై కాంగ్రెస్ కేడర్‌ క్రియాశీలకంగా పనిచేయాలి : రేవంత్‌ - CM REVANTH ZOOM MEET on Election - CM REVANTH ZOOM MEET ON ELECTION

CM Revanth Zoom Meeting on MLC By Election : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ, ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూమ్‌ మీటింగ్‌ నిర్వహించి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. మూడు ఉమ్మడి జిల్లాల నాయకులు క్రియాశీలకంగా పనిచేయాలని, తీన్మార్ మల్లన్న విజయానికి ప్రతిఒక్కరూ దోహదపడాలని కోరారు.

CM Revanth Zoom Meeting
CM Revanth Reddy Instructions to Congress Cadre (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 22, 2024, 10:14 PM IST

Updated : May 22, 2024, 10:48 PM IST

CM Revanth Zoom Meeting With Party Leaders over MLC Election : ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కాంగ్రెస్‌ అభ్యర్ధి తీన్మార్‌ మల్లన్నను గెలిపించేందుకు పనిచేయాలని పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశనిర్దేశం చేశారు. ఇవాళ రాత్రి సీఎం రేవంత్‌ రెడ్డి నిర్వహించిన జూమ్ సమావేశంలో అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జిలు, అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జిలు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

మూడు ఉమ్మడి జిల్లాల నాయకులు క్రియాశీలకంగా పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 27న పోలింగ్ ఉన్నందున క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, మండల స్థాయి నాయకులను సన్నద్ధం చేయాలని సూచించారు. ప్రతి ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌లను సందర్శించాలన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా పని చేస్తారని, తీన్మార్ మల్లన్నఎన్నిక, కాంగ్రెస్ పార్టీ ఎన్నికగా పని చేసి గెలుపునకు పని చేయాలన్నారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులకు సూచించారు.

లోక్‌సభ పోలింగ్‌ ముగిసిన మరుక్షణమే ఆసక్తికర పోరు : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మెజార్టీ సీట్ల గెలుపు పైన మూడు ప్రధాన పార్టీలు భారీస్థాయి అంచనాలతో ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక సైతం ఈ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తోండగా, ఇక్కడ గెలుపును సీఎం రేవంత్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

అదేవిధంగా కమలదళం సైతం గట్టి పోటీ ఇస్తోంది. ఈ సమరంలో కలిసొచ్చేదెవరికో మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే. కాగా 2021లో జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ బై ఎలక్షన్‌ అనివార్యమైంది.

Telangana Graduate MLC Elections 2024 : ఈ పోరులో మొత్తం 52మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, గులాబీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రచారానికి మూడు రోజులు గడువు మాత్రమే ఉండడంతో సన్నాహక భేటీలతో పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా నేతల మాటల తూటాలు - ఫుల్ స్వింగ్​లో ప్రచారం - Telangana Graduate MLC Campaign

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక - ఓట్లవేటలో దూసుకెళ్తున్న ప్రధాన పార్టీలు - GRADUATE MLC BYPOLL CAMPAIGN IN TS

Last Updated : May 22, 2024, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.