ETV Bharat / state

సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యతగా నిర్వర్తించాడు - ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను సీఎం రేవంత్‌ అభినందనలు - cm Revanth congratulate constable - CM REVANTH CONGRATULATE CONSTABLE

CM Revanth congratulate Traffic Constable : యూపీఎస్సీ అభ్యర్థికి సహాయం చేసిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా, సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యతగా నిర్వర్తించాడంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

TRAFFIC CONSTABLE SURESH
CM Revanth congratulate Traffic Constable (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 17, 2024, 5:34 PM IST

CM Revanth congratulate Traffic Constable : సమయభావంతో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు గైర్జాజరు కాకుండా, యూపీఎస్సీ అభ్యర్థికి సహాయం చేసిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా, సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యతగా నిర్వర్తించాడంటూ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ అంటూ ఎక్స్ వేదికగా కొనియాడారు. కానిస్టేబుల్ సురేశ్‌ సహకారంతో సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్న యువతి యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

సకాలంలో స్పందించడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు - కరీంనగర్‌ డిపో ఆర్టీసీ మహిళ సిబ్బందికి సీఎం అభినందనలు

రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల నియంత్రణ విధులతోపాటు, సామాజిక సేవలు అందిస్తున్నారు. తాజాగా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఓ అభ్యర్ధి పరిక్ష రాసేందకు సహయం చేసి ప్రజల మన్నలను అందుకుంటున్నారు. సదరు యువతి సివిల్స్ పరీక్ష కేంద్రం మహవీర్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఉంది. ఆర్టీసీ బస్సులో మైలార్‌దేవుపల్లి పల్లె చెరువు బస్‌స్టేషన్ వద్ద దిగారు.

అక్కడి నుంచి పరీక్ష కేంద్రం చాలా దూరంలో ఉండడంతో సమయం మించిపోతుందని అభ్యర్ధి కంగారు పడుతున్న సమయంలో, అక్కడే ట్రాఫిక్ విధుల్లో నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సురేశ్‌ అమె ఆందోళనకు గమనించారు. విషయం తెలుసుకున్న వెంటనే కానిస్టేబుల్ తన ద్విచక్రవాహనంపై పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ జరిగిన సన్నివేశాలను స్ధానికులు వీడియో తీసి సామాజిక మాద్యమంలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. సరైన సమయంలో కానిస్టేబుల్ సురేశ్‌ తన ఉదారత చాటుకున్నారని ప్రజలు అభినందించారు.

ప్రశాంతంగా ముగిసిన ప్రిలిమ్స్ పరీక్ష.. రాష్ట్రంలో ఆదివారం నిర్వహించిన యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్‌ జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. జాతీయ స్థాయిలో ఈ ఏడాది 1,056 సివిల్‌ సర్వీసెస్‌ పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌ జిల్లాలోని 99 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 45,153 మంది అభ్యర్థులకు గాను పేపర్‌-1 పరీక్షకు 25,875 (57.31 శాతం) మంది, పేపర్‌-2 పరీక్షకు 25,661 (56.83 శాతం) మంది హాజరయ్యారు. వరంగల్‌ జిల్లాలోని 11 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 4,730 మంది అభ్యర్థులకు గాను పేపర్‌-1 పరీక్షకు 2,637 (55.75 శాతం) మంది, పేపర్‌-2 పరీక్షకు 2,614 (55.26శాతం) మంది హాజరయ్యారు.

వర్షాకాల అత్యవసర పరిస్థితుల్లో అధికారులు తక్షణం స్పందించాలి : సీఎం రేవంత్​

రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి - CM REVANTH TRIBUTES TO RAMOJI RAO

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.