ETV Bharat / state

'మేడిగడ్డ పర్యటనతో కేసీఆర్ పాలనలో విధ్వంసమైన జలదృశ్యాన్ని తెలంగాణ సమాజం కళ్లారా చూడబోతోంది' - నీటిపారుదలపై శ్వేతపత్రం

CM Revanth on Irrigation Department : ప్రాజెక్టుల వద్ద వాస్తవ పరిస్థితులు చూపేందుకే మేడిగడ్డ పర్యటనకు అన్ని పార్టీలను రమ్మంటున్నామని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. మేడిగడ్డ పర్యటన అనంతరం శాసనసభలో ఇరిగేషన్​పై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పర్యటనకు కేసీఆర్​ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని, కాళేశ్వరం నిర్మాణాన్ని కేసీఆరే స్వయంగా ఎమ్మెల్యేలకు వివరిస్తే బాగుంటుందని రేవంత్​రెడ్డి కోరారు.

cm revanth medigadda tour
CM Revanth on Irrigation Department
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2024, 11:28 AM IST

Updated : Feb 13, 2024, 1:35 PM IST

CM Revanth on Irrigation Department : మేడిగడ్డ పిల్లర్లు కుంగిన ఘటన అనంతరం గత ప్రభుత్వం వాఘా బార్డర్​ను మించిన పోలీస్​ ఫోర్స్​ను బ్యారేజీ వద్ద పెట్టారని సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth) పేర్కొన్నారు. అక్కడి వాస్తవాలు చూపేందుకు, సభ్యులందరికీ మేడిగడ్డలో(Medigadda Tour) ఏం జరిగిందో తెలియజేయడం కోసమే ఈపర్యటన ఏర్పాటు చేసినట్లు అసెంబ్లీలో సీఎం వెల్లడించారు. మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశం స్వల్పకాలిక చర్చలో మాట్లాడారు.

CM Revanth Medigadda Tour : "సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలని మన పెద్దలు చెప్పారు. ప్రాజెక్టుల వల్లే కరవు ప్రాంతాల్లోనూ పంటలు పండించే అవకాశం వచ్చింది. తెలంగాణకు తాగు, సాగునీటి కోసం ప్రధానంగా రెండు నదులున్నాయి. అవి కృష్ణా, గోదావరి జలాలు. నిన్న కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చించాము. ప్రజలకు కొంతమేర నిజనిజాలు తెలిశాయి. గోదావరి జలాలపై కూడా తెలియాల్సి ఉందని" సీఎం రేవంత్​రెడ్డి ప్రస్తావించారు.

"అప్పటి పాలకులు ప్రజల ఆలోచనను దృష్టిలో పెట్టుకుని తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత - చేవెళ్ల ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకుడు వెంకటస్వామి సూచన మేరకు ప్రాణహిత - చేవెళ్లకు అంబేడ్కర్‌ పేరు పెట్టారు. స్వరాష్టం వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు రీడిజైన్ అనే బ్రహ్మపదార్థం తీసుకొచ్చింది. ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మరోచోట కట్టారు. బ్యారేజీ కింద ఇసుక కుంగడం వల్లే మేడిగడ్డ కుంగిందని బీఆర్ఎస్​ నేతలు అంటున్నారు. ప్రాజెక్టుల పేరుతో పేకమేడలు కట్టారా?" అని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు.

నేడు మేడిగడ్డలో సీఎం, ప్రజాప్రతినిధుల పర్యటన - 800 మందితో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

"గోదావరిపై రూ.35 వేల కోట్ల అంచనాతో ప్రారంభించిన ప్రాజెక్టును, రూ.లక్షా 47 వేల కోట్లకు పెంచారు. ఇరిగేషన్ శాఖలో ఫైళ్లు మాయం కావడంతోనే విజిలెన్స్ ఎంక్వైరీ వేశాం. విజిలెన్స్ రిపోర్టు​లో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ పర్యటన అనంతరం సాగు నీటి శాఖ మంత్రి అసెంబ్లీలో త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతమని అమెరికాలోనూ ప్రచారం చేశారు. కాళేశ్వరం మీకు ఏటీఎంలా మారిందని, మీ ఇళ్లలో కనకవర్షం కురిసిందని మేం అనడం లేదు. ప్రజాధనం దుర్వినియోగానికి కారకులెవరు? దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి వంటి అంశాలను చర్చించడానికి ఆహ్వానిస్తున్నాము. ప్రాజెక్టుల వద్ద ఉన్న పరిస్థితులు చూసేందుకే అన్ని పార్టీలనూ రమ్మంటున్నాం" - సీఎం రేవంత్ ​రెడ్డి

వాస్తవ పరిస్థితులు చూపేందుకే మేడిగడ్డ పర్యటన - కేసీఆర్ వస్తే ఇంకా బావుంటుంది సీఎం రేవంత్​ రెడ్డి

ప్రజాప్రతినిధుల మేడిగడ్డ టూర్ ​- షెడ్యూల్​ ఇదే!

రేపే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల మేడిగడ్డ పర్యటన - బ్యారేజీ లోపాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సభ!

Last Updated : Feb 13, 2024, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.