CM Revanth Reacts on Bharateeyudu Movie Team : డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమ సహకరించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు భారతీయుడు 2 చిత్ర బృందం స్పందించింది. చిత్ర ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన కమల్‌హాసన్, దర్శకుడు శంకర్, నటులు సిద్ధార్థ్, సముద్రఖని డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అభినందించారు.
నటులను అభినందించిన సీఎం రేవంత్ : ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రత్యేక వీడియో విడుదల చేశారు. భారతీయుడు 2 చిత్ర బృందం వీడియో రూపొందించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా నిలిచిన కమల్‌హాసన్, శంకర్, సిద్ధార్థ్, సముద్రఖనిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారు రూపొందించిన అవగాహన వీడియో హర్షించదగిన విషయమని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
పాఠశాలలోని అల్పాహారంలో బల్లి - అస్వస్థతకు గురైన విద్యార్థులు
Hero Siddharth Support to Telangana CM : సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని యువ కథానాయకుడు సిద్ధార్థ్ స్పష్టం చేశారు. భారతీయుడు 2 చిత్ర ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన సిద్ధార్థ్, ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ తనకు సామాజిక బాధ్యత ఉందని తెలిపారు.
మెరుగైన సమాజం కోసం చిత్ర పరిశ్రమ కృషి : ముఖ్యమంత్రి చెప్పకముందే గతంలో తాను కండోమ్ ప్రకటనలో నటించి సామాజిక బాధ్యత చాటుకున్నానని వివరించారు. అయితే తన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొంటూ ప్రత్యేక వీడియో విడుదల చేసిన సిద్ధార్థ్, డ్రగ్స్‌పై పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. పిల్లల భవిష్యత్ మన చేతుల్లోనే ఉందని, మెరుగైన సమాజం కోసం చిత్ర పరిశ్రమ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
భారతీయుడు -2 సినిమా బృందానికి నా ప్రత్యేక అభినందనలు.
— Revanth Reddy (@revanth_anumula) July 9, 2024
డ్రగ్స్ రహిత సమాజం కోసం…
ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా…
శ్రీ కమల్ హాసన్…శ్రీ శంకర్…శ్రీ సిద్దార్థ…
శ్రీ సముద్రఖని కలిసి ఈ అవగాహనా వీడియో…
రూపొందించడం హర్షించదగ్గ విషయం.#DrugFreeTelangana #SayNoToDrugs pic.twitter.com/MDkT95sqze