ETV Bharat / state

అంతన్నాడు, ఇంతన్నాడు - తీరా చూస్తే నెల్లూరువాసులను నట్టేట ముంచారు - CM Jagan Visit to Nellore

CM Jagan Visit to Nellore District : ' నేను చూశాను. నేను విన్నాను. నేను ఉన్నాను' అంటూ గత ఎన్నికల సమయంలో సీఎం జగన్​ ఊరూరు తిరిగారు. తానొక ఆపద్బాంధవుడినంటూ ప్రగల్భాలు పలికారు. నెల్లూరు జిల్లాలో ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వాటిలో ఒక్కటీ పూర్తి చేయలేదు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నెల్లూరులో బస్సు యాత్ర చేస్తారని జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. హామీలపై తమకు సమాధానం చెప్పాకే నెల్లూరుకు రావాలని స్పష్టం చేస్తున్నారు.

cm_jagn
cm_jagn
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 2:03 PM IST

అంతన్నాడు, ఇంతన్నాడు - తీరా చూస్తే నెల్లూరువాసులను నట్టేట ముంచారు

CM Jagan Visit to Nellore District : పాదయాత్ర చేశారు. నేను ఉన్నాను.నేను విన్నాను అన్నారు. జిల్లాలోని అన్ని సమస్యలను తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. అధికారంలోకి రాగానే అన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వీటికి తోడు అధికారంలోకి వచ్చాక మరికొన్ని హామీలు ఇచ్చారు. అయిదేళ్లు అయింది. ఆఖరికి ఏ ఒక్క హామీని జగన్‌ నిలబెట్టుకోలేదు. మొత్తంగా తన మాటలతో ఓట్లు దండుకున్న జగన్‌ నెల్లూరు జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని జిల్లా వాసులు తేల్చి చెబుతున్నారు.
Cold Storage : పాదయాత్రతో పాటు అధికారంలోకి వచ్చాక సింహపురి ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన జగన్‌ వాటిలో వేటినీ అమలు చేయలేదు. ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పొదలకూరు, గూడూరులో నిమ్మ సాగు అధికం. 30 వేల మందికి పైగా రైతులు నిమ్మతోటల మీద జీవనం సాగిస్తున్నారు. అయితే పండించిన పంటను విక్రయించేందుకు సరైన మార్కెట్‌ లేదు. కేవలం ప్రైవేటు మార్కెట్​ ఉండటంతో తక్కవ ధరకే అమ్ముకునే వారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో పాదయాత్ర సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో మార్కెట్ ఏర్పాటు చేస్తామని, కోల్డ్‌ స్టోరేజ్‌లు సైతం నిర్మిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. హామీకి అయిదేళ్లు గడిచాయి కానీ అడుగు కూడా ముందుకు పడలేదు. పైగా గత మిగ్‌జాం తుపానుకి తీవ్రంగా నష్టపోయిన రైతులకూ పరిహారం ఇవ్వలేదు.

తాగునీటి సమస్యపై మహిళల నిరసన సెగ- ఎట్టకేలకు బస్సు దిగొచ్చిన సీఎం జగన్ - Women Protest CM Jagan

Kadaleru Canal : కడలేరు నుంచి గొట్లపాలెం వరకు లింక్‌ కెనాల్ నిర్మించి ఆయకట్టు ఆఖరి గ్రామాల రైతులకు సాగునీరు అందిస్తానని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు. అయితే అప్పటికే తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్న పనులని అధికారంలోకి వచ్చాక స్థానిక మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిలిపేశారు. గుత్తేదారును డబ్బులు డిమాండ్‌ చేయడంతోనే పనులు ఆగిపోయాయని రైతులు ఆరోపిస్తున్నారు. అయిదేళ్లైనా లింక్‌ కెనాల్‌ నిర్మాణం కలగానే మిగిలిందని వాపోతున్నారు.

Purified Drinking Water Facility : నెల్లూరు నగర ప్రజలకు శుద్ధిచేసిన తాగునీటిని అందించేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం రూ. 645 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించి సుమారు రూ. 485 కోట్లు ఖర్చు పెట్టి 85 శాతం మేర పూర్తి చేసింది. శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం 15 శాతం పనులను పూర్తి చేయకుండా నిలిపివేసింది. ఏడాదిన్నర క్రితం అప్పటి పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నెల్లూరుకు వచ్చినప్పుడు రెండు నెలల్లో మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. కేవలం రూ.100 కోట్లు చెల్లిస్తే పనులు పూర్తయ్యే పరిస్థితి ఉన్నా వైసీపీ నాయకులు పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు.దీంతో పాటు చిన్న వాన పడితే నగరం మునిగిపోతోంది. దీనికి పరిష్కారంగా వరద కాలువలు నిర్మిస్తామని చెప్పి ఆర్భాటంగా రూ.55 కోట్లతో పనులు చేపట్టారు. కానీ నిధుల కొరతతో పనులు మూలనపడ్డాయి. కేవలం 25 శాతం పనులు మాత్రమే చేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో రెండేళ్లుగా పనులు సాగడం లేదు. ఫలితంగా కాలువలన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. చెత్తచెదారం పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తుండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
సీఎం బస్సు యాత్రా మజాకా - ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు - Jagan Bus Yatra Traffic Diversions
Road Facility : నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం వద్ద కలగానే మిగిలిన పొట్టెపాళెం వద్ద కలుజు నిర్మాణాన్ని పూర్తిచేస్తామని హామీ ఇచ్చిన జగన్‌ దానిని అంచనాలకే పరిమితం చేశారు. ప్రభుత్వం తీరుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి పలుమార్లు నిరసనలు చేశారు. అయినా మార్పు రాలేదు. వానాకాలంలో చిన్నపాటి వర్షానికే నెల్లూరుకు రాలేక నాలుగు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉప్పుకాలువపై వంతెన నిర్మాణం కూడా ఒట్టిమాటేగానే మిగిలిపోయింది. గతేడాది అక్టోబర్‌లో జెన్కో మూడో యూనిట్‌ ప్రారంభానికి వచ్చిన ముఖ్యమంత్రి సర్వేపల్లి నియోజకవర్గంలో సమస్యలపై హామీ ఇచ్చారు. వెంకటాచలం రోడ్డు నుంచి తిరుమలమ్మపాళెం వెళ్లేందుకు ఉప్పుకాలువపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.12 కోట్లు, కృష్ణపట్నం నుంచి పొట్టెంపాడు వయా బ్రహ్మదేవికి వెళ్లేందుకు వీలుగా నక్కలవాగుపై పైవంతెన నిర్మించేందుకు రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు దానిపై ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటికీ స్థానికులు తాడు సహాయంతోనే కాలువను దాటుతున్నారు.

నేడు చిత్తూరు జిల్లాలో జగన్ బస్సు యాత్ర- జనం అడిగే ప్రశ్నలకు బదులివ్వగలరా? - CM Jagan Chittoor Tour

Ramayapatnam Port : తాము అధికారంలోకి రాగానే రామాయపట్నంలో మేజర్‌ పోర్టు ఏర్పాటు చేసి తీరుతామని 2018 ఫిబ్రవరిలో పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడేళ్లకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మైనర్‌ పోర్టు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఓడరేవును విడతల వారీగా అభివృద్ధి చేస్తామని అందులో భాగంగా మొదటి విడతగా గుడ్లూరు మండలం చేవూరు గ్రామం పరిధిలో 825 ఎకరాల్లో నాలుగు బెర్తులతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు 2022 జూలైలో జగన్‌ భూమిపూజ చేశారు. 2023 డిసెంబర్‌ నాటికి ఓడరేవు నిర్మాణం పూర్తి చేసి ఓడలను తీసుకొస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం కేవలం ఒక్క బెర్తు మాత్రమే నిర్మించారు. అది కూడా ప్రారంభానికి నోచుకోలేదు. రైల్వేలైన్‌ కూడా అతీగతీ లేదు. ఓడరేవుకు అనుబంధంగా ఏర్పాటు చేస్తామన్న పరిశ్రమల ఊసే లేదు. దాంతో పాటు గత తెలుగుదేశం ప్రభుత్వంలో దగదర్తి విమానాశ్రయం నిర్మాణంలో ఉండగా దానిని నిలిపేసి కందుకూరులో నిర్మిస్తామని చెప్పిన జగన్‌ దాన్నీ పక్కనపడేశారు.

Atmakuru and Kandukur Constituencies Development : వీటితో పాటు ఆత్మకూరు, కందుకూరు నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులు చేస్తామని చెప్పిన జగన్‌ ఆర్భాటంగా వాటికి నిధులు కేటాయిస్తున్నట‌లు ప్రకటించారు. కానీ ఒక్కదానికీ నిధులు విడుదల చేయలేదు. అయిదేళ్లలో ఇచ్చిన హామీలను ఏ మాత్రం పట్టించుకోని జగన్‌ ఇప్పుడు ఏమొహం పెట్టుకుని జిల్లాలో బస్సు యాత్ర చేస్తారని జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. హామీలపై తమకు సమాధానం చెప్పాకే నెల్లూరుకు రావాలని స్పష్టం చేస్తున్నారు.

నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారు: వైఎస్ షర్మిల - SHARMILA FIRE ON CM JAGAN

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.