Cm Jagan Stone Pelting Case: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ అజిత్ సింగ్ నగర్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ కోర్టు విచారణ జరిపింది. నిందితుడ్ని 7 రోజుల కస్టడీ కావాలంటూ పోలీసుల తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నిందితుడి నుంచి కేసుకు సంబందించిన మరికొంత సమాచారం రాబట్టాలని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మంగళవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
కాగా సీఎం జగన్‌పై రాయి విసిరిన కేసులో నిందితుడిని 18వ తేదీన అరెస్టు చేసినట్లు చూపించారు. అజిత్‌సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్‌ని నిందితుడిగా తేల్చారు. అయితే ఏ1గా సతీష్‌ను చూపించిన పోలీసులు ఏ2 ప్రోద్బలంతో జగన్‌పైకి రాయి విసిరాడని చెబుతున్నారు. కానీ అలా ప్రోత్సహించిన వ్యక్తి ఎవరన్నది మాత్రం తేల్చకుండానే కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. నిందితుడికి మే 2 వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో ఎవరిని ఇరికించడానికి ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎంపై రాయి దాడి కేసుతో నాకు సంబంధం లేదు: దుర్గారావు - stone Pelting Case Suspect released
సీఎంపై రాయి దాడి కేసులో వడ్డెరకాలనీకి చెందిన అయిదుగురిని ఈ నెల 16 తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సతీష్ తప్ప మిగిలిన నలుగురు మైనర్లు. మూడు రోజుల విచారణ అనంతరం సతీష్ అరెస్టును 18వ తేదీన మధ్యాహ్నం చూపించారు. అరకొర సమాచారంతోనే రిపోర్టు తయారు చేశారు. సీఎంపైకి సతీష్ రాయి విసిరినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ ఘటనకు ఏ2 సూత్రధారి అని చెబుతున్న పోలీసులు ఆ వ్యక్తి పేరును మాత్రం ఇందులో ప్రస్తావించలేదు.
పూర్తి స్థాయిలో ఆధారాలు లేవు : సీఎం ప్రయాణించిన బస్సుకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ, సెల్‌టవర్ డంప్ విశ్లేషణ, సీడీఆర్‌ల ద్వారా సతీష్‌ను నిందితుడిగా తేల్చామని పోలీసులు అంటున్నారు. రిమాండ్ రిపోర్టులో పలువురు సాక్షులను విచారించాలని, సాంకేతిక ఆధారాలను సేకరించాలని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు సతీష్‌ను విచారించినా ఆధారాలను పూర్తి స్థాయిలో సంపాదించలేదు. కేవలం ఏ2 చెప్పిన మీదటే జగన్‌పైకి రాయి విసిరాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఏ కారణంతో నిందితుడు దాడికి పాల్పడ్డాడనే విషయాన్ని బయటపెట్టలేదు. ఇలా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గులకరాయి కేసులో A1కి 14 రోజుల రిమాండ్ - A2 ఎవరో వెల్లడించని అధికారులు - Cm Jagan Stone Pelting Case
మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి కేసులో 20వ తేదీన రాత్రి కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసులు అదుపులో ఉన్న వేముల దుర్గారావును రాత్రి విజయవాడ నార్త్ ఏసీపీ కార్యాలయంలో దుర్గారావును కుటుంబ సభ్యులకు అప్పగించారు. 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చిమళ్లీ అవసరమైతే స్టేషన్‌కు పిలుస్తామని చెప్పి సంతకాలు తీసుకున్నారు.
దాడి ఘటనలో ఆధారాల సేకరణలో పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తెలుగుదేశం నాయకుడు దుర్గారావును 4 రోజులపాటు అదుపులో ఉంచుకుని పోలీసులు ప్రశ్నించినా కేసును ముందుకు తీసుకెళ్లే ఆధారాలు మాత్రం లభ్యం కాలేదు. ఇప్పటివరకు ఏ1 సంగతి మాత్రమే పోలీసులు తేల్చారు. మరి మిగిలిన నిందితులు ఎవరు? వారి పాత్ర ఏంటి? అన్నది ఇంతవరకు తేల్చలేకపోయారు.
గులకరాయి కేసులో పోలీసుల వైఫల్యం - 9 రోజులైనా కనిపించని పురోగతి - Police Failed to Crack Stone Case