ETV Bharat / state

పండుటాకులపై కక్ష సాధింపు - సర్వాధికారాలు ఉన్నా నోరు విప్పని జగన్​ - CM Jagan silence on pensions

CM Jagan Silence on Pensions Distribution in AP : సీఎం జగన్​ అయిదేళ్లుగా అప్రతిహత అధికారాన్ని చలాయిస్తూ, ప్రభుత్వ యంత్రాంగాన్ని తన కనుసైగలతో నడిపిస్తున్నారు. ఇంత చేస్తున్నా జగన్​ ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని మాత్రం సీఎస్​ను ఆదేశించడం లేదు. ఆ అంశంపై కనీసం నోరు కూడా మెదపట్లేదు.

pension_distibution
pension_distibution
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 9:10 AM IST

పండుటాకులపై కక్ష సాధింపు - సర్వాధికారాలు ఉన్నా నోరు విప్పని జగన్​

CM Jagan Silence on Pensions Distribution in AP : ముఖ్యమంత్రి జగన్‌ తన కనుసైగలతో అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి ఇప్పటికీ జగన్‌ చెప్పిన గీత దాటి వెళ్లరు. జగన్‌ తలుచుకుంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి టీటీడీ ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ను పొడిగించుకోగలరు. తన ఎన్నికల ప్రచారసభకూ వెయ్యికి పైగా ఆర్టీసీ బస్సుల్నీ రప్పించుకోగలరు. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ అధికారులు తాను చెప్పినట్లు వినాల్సిందేనని శాసిస్తున్న జగన్‌ ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని మాత్రం సీఎస్‌ను ఆదేశించడం లేదు. కనీసం ఈసీకి లేఖ రాయలేదు. పింఛన్‌దారులు ఇబ్బంది పడకుండా తెలుగుదేశం పోరాడుతుంటే సర్వాధికారాలు ఉన్నా సీఎం మాత్రం నోరు విప్పడం లేదు. ఏదైనా జరిగితే ఆ నెపాన్ని ప్రతిపక్షంపై నెట్టేసే కుట్రకు తెరతీశారన్న మాట సర్వత్రా వినిపిస్తోంది.

పింఛన్ల పంపిణీలో జగన్​ గొప్పలు : ఇంటింటికీ పింఛన్ల పంపిణీ తన మానసపుత్రిక అంటూ గొప్పలు చెప్పే జగన్‌ 66 లక్షల మంది లబ్ధిదారుల్ని, అందులో ఎక్కువగా ఉన్న వృద్ధుల్ని ఎండల్లో మొదట సచివాలయాలకు, ఇప్పుడు బ్యాంకులకు వెళ్లి పింఛన్లు తెచ్చుకోవాలని సీఎస్‌ చెబుతుంటే ఎందుకు నోరు విప్పరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోడ్‌ అమల్లో ఉన్న వేళ జగన్‌ కొత్త విధాన నిర్ణయాలు తీసుకోలేరు కానీ ఉన్న విధానాల్ని కొనసాగింపునకు, సమీక్షకు ఎలాంటి ఇబ్బందీ లేదు కదా! మరి ఇంటింటికీ పింఛన్ల పంపిణీ విధానాన్ని కొనసాగించాలని సీఎస్‌ను ఎందుకు ఆదేశించడం లేదు? అలా చేయడం ఆయనకు ఇష్టం లేదా? ఆయన మౌనం వెనుక కారణమేంటి? బ్యాంకుల్లో తగిన సదుపాయాలు ఉండవని ఆయనకు తెలీదా? అసలు పింఛన్ల సమస్య ఆయనకు ఎందుకు పట్టడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల ప్రచారం చేసుకుంటూ, విపక్షాలపై విమర్శలు చేస్తూ జగన్‌ పింఛన్లపై మాత్రం మాట్లాడకపోవడంతో ఆయన వ్యవహారశైలిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా మండుటెండల్లో వృద్ధుల్ని సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిప్పి వారు ఇబ్బంది పడితేనో, ఏదైనా ఉపద్రవం జరిగితేనో ఆ నెపాన్ని ప్రతిపక్షంపై నెట్టేసే కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది.

వైఎస్సార్సీపీకి వంత పాడేలా జవహర్‌రెడ్డి జగన్నాటకం - బ్యాంకుల్లో పింఛను నగదు జమ చేసేలా నిర్ణయం - CS Jawahar Reddy Plan On Pensions

ప్రతిపక్షానికే ఎందుకు పట్టింది : తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఐదేళ్లుగా జగన్‌ సేవలో తరిస్తున్న అధికారులు ప్రధాన ప్రతిపక్ష నేతగానూ గుర్తించడం లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్​), డీజీపీ లాంటి అధికారులు ఎవరూ ప్రతిపక్ష నేత చంద్రబాబు మాటకు కనీస విలువా ఇవ్వడం లేదు. తన మాట చెల్లుబాటు కాకపోయినా, తనకు అధికారం లేకపోయినా ఇప్పుడు అదే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటింటికీ పింఛన్లు పంపిణీ కోసం చేయని ప్రయత్నం లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. మండుతున్న ఎండల్లో వృద్ధుల్ని సచివాలయాలకు, బ్యాంకులకు కిలోమీటర్ల దూరం తిప్పొద్దని వేడుకుంటున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. తెలుగుదేశం భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీ నాయకులూ ఆయనతో గొంతు కలిపారు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని ఎక్కే గడపా, దిగే గడపా అన్నట్టుగా అలుపెరగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గవర్నర్‌ను కలసి పరిస్థితిని వివరించారు. సీఎస్‌ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఆందోళన నిర్వహించారు. ఊరూవాడా గొడవ చేస్తున్నారు. గత నెలలో సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తెచ్చుకోవాలని అధికారులు చెప్పినప్పుడూ ప్రతిపక్షం నేతలు తీవ్రంగా పోరాడారు. ఇప్పుడూ పోరాడుతున్నారు. మండుటెండల్లో వృద్ధుల్ని తిప్పడం సరికాదు. పింఛన్లు ఇంటికే తీసుకెళ్లి ఇవ్వండి మహోప్రభో అని ఎలుగెత్తి చాటుతున్నారు. సర్వశక్తులూ ఒడ్డుతోంది. వృద్ధులు, ఇతర లబ్ధిదారుల క్షేమాన్ని కోరుతూ అంతగా పోరాడుతోంది. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసేలా చూడాల్సిన అధికారపార్టీ మౌనం వహించడం, ఏ అధికారాలూ, ఏ పాత్రాలేని ప్రతిపక్షం ఆ బాధ్యత తీసుకోవడం దేశంలో ఇలాంటి విచిత్ర పరిస్థితి మన రాష్ట్రంలోనే చూస్తున్నామన్న వాదన వినిపిస్తోంది.

ఒకటో తేదీ వస్తోంది - ఈసారైనా ఇంటి వద్దే పింఛన్లు ఇస్తారా ? - Pension Distribution Issue

కుట్రలు, కుహకాల్లో ఆరితేరిన జగన్ : తిమ్మిని బమ్మిని చేయడంలో, దుష్ప్రచారంలో వైఎస్సార్సీపీ నాయకుల్ని మించిన అఖండులు మరొకరు లేరు. ఎన్నికల ముందు సొంత బాబాయ్‌ హత్యకు గురైతే, నారాసుర రక్తచరిత్ర అంటూ ప్రతిపక్ష నేతపై అభాండం వేసి, డ్రామాను రక్తికట్టించారు. తమ వికృత రాజకీయ క్రీడకు ఇప్పుడు ‘అవ్వాతాతల్ని’ బలిపెడుతున్నారు . ఏప్రిల్‌ మొదటి వారంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనే ఎండలకు తాళలేక పింఛన్ల కోసం సచివాలయాలకు తిరిగే క్రమంలో 32 మంది చనిపోయారు. ఇప్పుడు జగన్‌ తన అధికారదాహాన్ని తీర్చుకోవడానికి మరింతమంది అవ్వాతాతల్ని అంపశయ్య ఎక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు! వచ్చే వారం రోజులు ఎండలు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. అంత తీవ్రమైన ఎండల్లో వృద్ధులు ఎండల్లో బ్యాంకులకు తిరిగితే ఈసారి మరింతమంది ఇబ్బందిపడి, ఆస్పత్రుల పాలయ్యే అవకాశం ఉంది. జగన్‌కు, అధికారపార్టీ నాయకులకూ కావలసిందీ అదే! ఆ నెపాన్ని ప్రతిపక్షంపై నెట్టేసి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలన్నదే వాళ్ల కుట్ర! 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బంది ద్వారా మూడు నాలుగు రోజుల్లోనే మొత్తం లబ్ధిదారులందరికీ పింఛన్లు పంపిణీ చేసే వీలున్నా ఏప్రిల్‌ మొదటి వారంలో సచివాలయాలకే వచ్చి పింఛన్లు తీసుకోవాలని లబ్ధిదారుల్ని ప్రభుత్వం ఆదేశించింది. వృద్ధుల్ని అధికార పార్టీ నాయకులు చక్రాల కుర్చీలపైనా, మంచాలపైనా మండుటెండల్లో ఊరేగించారు. విపక్షంపై నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే డ్రామాను పునరావృతం చేసి, ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది అధికార పార్టీ కుట్ర.

పింఛన్లపై వైసీపీ సర్కార్​ మరో కుట్ర - లబ్ధిదారుల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యం - PENSION DISTRIBUTION ISSUE IN AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.