AP CM YS Jagan Election Campaign: ముఖ్యమంత్రి పర్యటన అంటే ప్రజలు విస్తుపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఒక మైదుకూరులోనే కాదు రాష్ట్రంలో ఏప్రాంతంలో పర్యటించినా ఆప్రాంత వాసులకు ఎదురయ్యే దుస్ధితి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మంగళవారం మైదుకూరు రానున్న నేపథ్యంలో ప్రొద్దుటూరురోడ్డులో బహిరంగసభ నిర్వహించారు.
మాములుగా అయితే, సీఎం జగన్ హెలిప్యాడ్ నుంచి బస్సులో సభా ప్రాంగణానికి చేరుకుని ప్రసంగం అనంతరం వెనుతిరగాల్సి ఉంది. అందుకోసం, అధికారులు జాతీయ రహదారి డివైడర్ను రెండుచోట్ల పది అడుగుల చొప్పున ధ్వంసం చేశారు. తిరిగి ఆప్రాంతానికి సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చేశారు. అంతేకాదు ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేసిన డివైడర్ మధ్యలో ఎర్రమట్టిని నింపి అందంగా ఉండేలా చేస్తున్నారు. సీఎం ఏప్రాంతానికి వెళ్లినా చెట్లను నరకడం, అడ్డువచ్చిన వాట
ఇక మైదుకూరు సభలో మాట్లాడిన సీఎం జగన్ ఎంపీ అవినాష్‌రెడ్డిని మరోసారి వెనుకేసుకొచ్చారు. చాలా తక్కువ మంది అవినాష్ లాగ మంచి మనస్సుతో ఉంటారని చెప్పుకొచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే రాజోలి ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. అయితే, సీఎం బహిరంగసభ కోసం పార్టీ శ్రేణులు వివిధ ప్రాంతాల నుంచి జనసమీకరణ చేశారు. 12.45 గంటలకు మైదుకూరు చేరుకుంటారని ప్రచార జరిగింది. కానీస సీఎం జగన్ 1.40గంటలకు హెలికాప్టర్ ద్వారా మైదుకూరు చేరుకున్నారు. బహిరంగసభ వేదిక వద్దకు 2 గంటలకు చేరుకుని నేరుగా ప్రసంగాన్ని కొనసాగించారు. ఎండ వేడిమి అధికంగా ఉండటంతో సభ ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రజలు వెనుదిరగడం కనిపించింది.
ప్రకాశం జిల్లా టంగుటూరు నియోజకవర్గం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. సీఎం బహిరంగ సభ కోసం కొండేపిలోని వివిధ గ్రామాల నుంచి ఆర్టీసీ, ప్రవేట్ బస్సుల్లో ప్రజలను తరలించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి న సభ 11 గంటలకు ప్రారంభమైంది. సీఎం రాకకోసం వేచిచూసిన ప్రజలు ఎండలో ఇబ్బందులు పడ్డారు. అయితే, సీఎం జగన్ సభలో మాట్లాడుతున్న సమయంలో, సీఎం ప్రసంగం వినకుండానికి ప్రజలు ఎండ తాకిడికి ఉండలేక ఇంటి కి తిరుగు మొఖం పట్టారు. భహిరంగ సభ ప్రాంగణంలో మంచి నీటి ఏర్పాటు చేయడంలో నేతలు విఫలమయ్యారు. సభ కోసం పిలిచి తాగేందుకు మంచినీళ్లు కూడా అందించడం లేదని ప్రజలు విమర్శలు గుప్పించారు.
వందల గ్రామాల్లో దాహం కేకలు - జగన్‌ను ఈసారి నమ్మేది లేదంటున్న ప్రజలు - WATER PROBLEMS IN AP