CM Chandrababu will Visit Satya Sai District: సీఎం చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనకు సర్వం సిద్ధమైంది. మడకశిర మండలం గుండుమల గ్రామంలోని ప్రతి ఇంట్లో చంద్రన్న పండుగ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తొలిసారిగా గుండుమల గ్రామానికి వస్తుండటంతో అక్కడి ప్రజలు ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం నుంచి సీఎం హెలీకాప్టర్‌లో నేరుగా మడకశిరకు రానున్నారు. ఎన్టీఆర్ పింఛన్ భరోసా కింద సామాజిక పింఛన్లను చంద్రబాబు లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వనున్నారు. ఇందుకోసం కొంతమంది లబ్దిదారులను అధికారులు ఎంపిక చేశారు.
ముందుగా సీఎం చంద్రబాబు గుండుమలలో కరియమ్మదేవి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకొని, గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. గ్రామంలోని మల్బరీ తోటలను, పట్టు గూళ్ల పెంపకం షెడ్డులను పరిశీలించనున్నారు. సాయంత్రం వరకు గుండుమలలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో పుట్టపర్తి చేరుకొని, ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు. ఇందుకోసం శ్రీ సత్యసాయి జిల్లా అధికారులు కార్యక్రమాన్ని రూపొందించారు.
ఆ జిల్లా మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్‌లతో పాటు అనంతపురం జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజులు గుండుమలలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు తగిన సూచనలు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీస్ శాఖ గట్టి బందోబస్తుతో పాటు మిగిలిన శాఖలు పటిష్టంగా ఏర్పాట్లు చేశాయి. సత్యసాయి జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై వేల పింఛన్లు ఉదయం నుంచే పంపిణీ ప్రారంభమవుతాదని జిల్లా కలెక్టర్ చేతన్ మీడియా ద్వారా వివరించారు.
CS Nirab Kumar Prasad Review on Pension : ఆగస్టు 1వ తేదీ ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఆగస్టు నెలకు 64.82 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ కోసం రూ. 2,737 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఆగస్టు 1వ తేదీనే 96 శాతం, 2వ తేదీతో 100 శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు.
1వ తేదీనే నూరు శాతం పింఛన్లు పంపిణీ: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2,43,402 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 101 కోట్ల 30 లక్షల రూపాయలు పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇందుకోసం 4,258 మంది సిబ్బందిని నియమించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ సామాజిక పింఛన్ల పంపిణీపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఆగస్టు 1వ తేదీనే నూరు శాతం పింఛన్లు పంపిణీ చేయాలని దిశా నిర్దేశం చేశారు.
హాస్టల్ బాత్‌రూమ్‌లో ప్రసవించిన విద్యార్థిని - Student DELIVERY HOSTEL Bathroom