ETV Bharat / state

దిల్లీ వెెళ్లనున్న సీఎం చంద్రబాబు - హోంమంత్రి అమిత్ ​షాతో భేటీ - CM CHANDRABABU DELHI TOUR

CM Chandrababu Will Go For Delhi in Tomorrow: ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం దిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ ​షాను కలిసి విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశం ఉంది. ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Chandrababu Will Go For Delhi in Tomorrow
Chandrababu Will Go For Delhi in Tomorrow (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 15, 2024, 9:31 PM IST

Updated : Jul 15, 2024, 11:00 PM IST

CM Chandrababu Will Go For Delhi in Tomorrow: ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు దిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ ​షాను కలిసి విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశం ఉంది. ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 4,5 తేదీలలో చంద్రబాబు దిల్లీలో పర్యటించారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. ప్రస్తుతం మరోసారి దిల్లీలో పర్యటించనున్న సీఎం, ఈ సారి కేంద్ర హోంమంత్రి అమిత్​షాతో విభజన సమస్యలపై చర్చించనున్నారు.

మరోవైపు నేడు సీఎం చంద్రబాబుతో జేఎస్​డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి సజ్జన్‌ జిందాల్‌ సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని జిందాల్‌కు వివరించారు. సరైన ప్రతిపాదనలతో వస్తే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సజ్జన్​తో చంద్రబాబు పేర్కొన్నారు.

Last Updated : Jul 15, 2024, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.