CM Chandrababu Review on Distribution of Compensation to Flood Victims : వరద బాధితులందరికీ ప్రభుత్వం సాయం చేరాల్సిందేనని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సాంకేతిక సమస్యలను పరిష్కరించి బాధితులను ఆదుకోవాలన్నారు. సచివాలయంలో విపత్తు నిర్వహణశాఖ అధికారులతో సమీక్షించిన సీఎం సాంకేతిక కారణాల వల్ల ఆర్థిక ప్యాకేజీ అందని బాధితులకు తక్షణం సమస్యను పరిష్కరించి ఖాతాల్లో నగదు జమ చేయాలని ఆదేశించారు.
వరద బాధితుల ఖాతాల్లో రూ.569 కోట్లు జమ- అకౌంట్లు లేనివారికి ఇలా! - CM Chandrababu Thanks to Officers
రూ. 588.59 కోట్లు చెల్లింపు : మొత్తం రూ. 602 కోట్ల పరిహారం పంపిణీకి గాను ఇప్పటి వరకు రూ.588.59 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసినట్లు అధికారులు వివరించారు. ఇందులో రూ. 301 కోట్లు పంట నష్టపరిహారం కింద రైతులకు చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు. మిగిలిన మొత్తం ఇళ్లు, షాపులు మునిగి ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారంగా అందిస్తున్నామన్నారు. 97 శాతం మంది లబ్ధిదారుల ఖాతాల్లో పరిహారం జమైందని తెలిపారు. 22,185 మంది లబ్ధిదారులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా నగదు జమ కాలేదని అధికారులు సీఎంకు వివరించారు. బ్యాంక్ అంకౌంట్‌తో ఆధార్ లింక్ అవ్వకపోవడం, బ్యాంకు ఖాతా యాక్టివ్ గా లేకపోవడం, ఇతర వివరాలు సరిగా లేకపోవడంతో పరిహారం సొమ్ము లబ్ధిదారుల అకౌంట్లలో జమకాలేదని అధికారులు వివరించారు.
బడులను ముంచిన బుడమేరు - శుభ్రం చేసే పనిలో సిబ్బంది - govt schools damaged floods
సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరం : పరిహారం జమకాని లబ్ధిదారులు తక్షణమే బ్యాంకులకు వెళ్లి కేవైసీ అప్‌డేట్ చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. రెండు మూడు రోజుల్లో ఈ పక్రియ పూర్తిచేసి వారి ఖాతాల్లో నగద జమ చేయాల్సిందిగా ఆదేశించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వసాయం అందాలని ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండడానికి వీల్లేదని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
వరద సహాయక చర్యలపై కేంద్రం ప్రశంసలు - బాధితులకు ఉచితంగా సర్టిఫికెట్లు - RP Sisodia on AP Floods
ఇప్పటికీ కొంతమంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని వాటిని పరిశీలించి అర్హత ఉంటే ప్రభుత్వ నుంచి సాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం నాటికి అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి పూర్తి స్థాయిలో పరిహారం పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. వాహనాలకు బీమా చెల్లింపు, రుణాల రీషెడ్యూల్, అర్బన్ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ వంటి అంశాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.