ETV Bharat / state

ప్రజలు బయటకు రావద్దు - వర్షాలపై అధికారులతో చంద్రబాబు సమీక్ష - Chandrababu Instructions on Rains - CHANDRABABU INSTRUCTIONS ON RAINS

CM Chandrababu Instructions to Officials on Rains: రాష్టంలో కురుస్తున్న వర్షాలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వర్షాల కారణంగా చనిపోయిన 8 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. భారీ వర్షాలు మరో రెండు రోజులు ఉంటాయన్న సమాచారంతో ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తతో ఉండాలని చంద్రబాబు సూచించారు.

Chandrababu_Instructions_on_Rains
Chandrababu_Instructions_on_Rains (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2024, 12:37 PM IST

Updated : Aug 31, 2024, 9:34 PM IST

CM Chandrababu Instructions to Officials on Rains: వాయుగుండం ప్రభావంలో రాష్ట్రంలో వర్థాలు కురుస్తున్నాయి. వర్ష సహాయ చర్యల కోసం జిల్లాకు 3 కోట్ల రూపాయల చొప్పున తక్షణం విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. భారీ వర్షాలతో చనిపోయిన 8 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. భారీ వర్షాలు ఆదివారం కూడా ఉంటాయన్న సమాచారంతో ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తతో ఉండాలని చంద్రబాబు సూచించారు. ఈ మేరకు సీఎస్‌, డీజీపీ, మంత్రులు, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

శ్రీకాకుళం-విశాఖ మధ్య ఇవాళ రాత్రికి తుపాను తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లు మరింత అప్రమత్తతో ఉండాలన్నారు. వర్షాలు తగ్గేవరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు ఉన్న జిల్లాల్లో సహాయక చర్యల కోసం జిల్లాకు 3 కోట్ల రూపాయలు, కాస్త తక్కువ ప్రభావం ఉన్న జిల్లాలకు 2 కోట్ల రూపాయలు చొప్పున నిధుల విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

అప్రమత్తతతో ప్రజల ఇబ్బందులు తగ్గించవచ్చు: భారీవర్షాల దృష్ట్యా ప్రజలు రేపు కూడా జాగ్రత్తలు పాటించాలని సీఎం అన్నారు. పట్టణాల్లో నీరు నిలిచిన చోట తక్షణ చర్యలు తీసుకోవాలని నీటి ప్రవాహాలకు ఉన్న అడ్డంకులను పొక్లెయిన్లతో తొలగించాలని సీఎం ఆదేశించారు. ఓపెన్ డ్రెయిన్లు ఉండేచోట హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. వరద ప్రాంతాల్లో వాగులపై వాహనాలను అనుమతించవద్దని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న వంతెనలపై రాకపోకలు నిలిపేయాలని అన్నారు.

విద్యుత్‌ సమస్యలపై ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించాలని ఆదేశించారు. తుపాను భవనాలు సిద్ధం చేసి పునరావాసానికి ఏర్పాట్లు చేయాలని అన్నారు. భారీవర్షాలున్న జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించాలని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్న ఘటన జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. హుద్‌హుద్ సమయంలో తీసుకున్న విధానాలు అనుసరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

'సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థంగా పని చేయాలి. ముఖ్యంగా జ్వరాల బారిన పడిన గిరిజనులకు వైద్యం అందేలా చూడాలి. కాల్వలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దు. వాట్సాప్ గ్రూపుల ద్వారా నిత్యం సమన్వయంతో పని చేయాలి. విపత్కర పరిస్థితుల్లో డ్రోన్లు వంటి టెక్నాలజీని విరివిగా వాడండి. భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలెర్ట్ మెసేజ్‌లు పంపాలి. ప్రభుత్వం ఆదుకుంటుందన్న నమ్మకం కల్పించేలా అధికారులు పని చేయాలి' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు

బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది : ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధుల విడుదలకు ఆదేశాలిచ్చామని చెప్పారు. విజయవాడలో ఇంటిపై కొండచరియలు విరిగిపడటం బాధాకరమన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.

గుంటూరు జిల్లాలో వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. 0863 2234014కు ఫోన్ చేసి సమస్యలు తెలపవచ్చని అన్నారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని వెల్లడించారు. విజయవాడలో వర్షాల పరిస్థితిపై కంట్రోల్‌రూమ్‌లో కలెక్టర్‌ సృజన సమీక్ష నిర్వహించారు. గురువారం నుంచి కురుస్తున్న వర్షాలకు జరిగిన నష్టాల వివరాలపై ఆమె ఆరా తీశారు. కొండప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం తగ్గి రోడ్లపై నీరు తగ్గేంతవరకు బయటకు ప్రజలు రావద్దని విజ్ఞప్తి చేశారు.

విజయవాడలో విరిగిపడిన కొండచరియలు - చెరువులను తలపిస్తున్న రహదారులు - Landslide in Vijayawada

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు - పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు - Heavy Rains in Andhra Pradesh

Last Updated : Aug 31, 2024, 9:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.